గిద్యోను యోర్దానుకు ఈవలివైపున పోరాడుట

యావే గిద్యోను సైన్యములను తగ్గించుట

7 1. యెరూబాలు అనబడు గిద్యోను అతని అను చరులును వేకువనే ఎన్హారోదు వద్ద శిబిరము పన్నిరి. మిద్యాను సైన్యములు వారికి ఉత్తరముగా మోరే కొండచెంత క్రిందిలోయలో గుడారములు పన్ని యుండెను.

2. యావే గిద్యోనుతో ”నీ యొద్ధ భటులు చాలమంది ఉన్నారు. ఇంతమంది భటులతోగూడిన మీకు మిద్యానీయులను వశముచేయుట నాకిష్టము లేదు. ‘మా బలముతో మమ్ము మేమే రక్షించు కొింమి’ అని మీ యిస్రాయేలీయులు విఱ్ఱవీగుదురు.

3. కనుక నీవు ‘యుద్ధమునకు భయపడువారు వెంటనే వెడలిపోవచ్చును’ అని శిబిరమున ప్రకింపుము” అని చెప్పెను. గిద్యోను అట్లే చేయగా పాళెమునుండి ఇరువది రెండువేలమంది వెడలిపోయిరి. పదివేల మంది మాత్రము మిగిలియుండిరి.

4. యావే గిద్యోనుతో ”ఇంకను చాలమంది జనులున్నారు. వారిని నీిపడియ యొద్దకు కొని రమ్ము. అక్కడ వారిని పరిశీలించి చూచెదను. ఎవరు నిన్ను అనుసరింపవలెనని తెల్పుదునో వారు మాత్రమే నీ వెంటవత్తురు. ఎవరు నిన్ననుసరింపగూడదని తెల్పుదునో వారు నీ వెంటరాగూడదు” అని చెప్పెను.

5. గిద్యోను జనులను నీిచెంతకు కొనివచ్చెను. యావే అతనితో ”కుక్కవలె నాలుకతో నీళ్ళు గతుకు వారినందరిని ఒక వైపున ఉంచుము. మోకాళ్ళూని నీరు త్రాగువారినందరిని వేరొక వైపున చేర్చుము” అని పలికెను.

6. నాలుకతో నీళ్ళు గతికినవారి సంఖ్య మూడువందలు మాత్రమే. మిగిలినవారందరు మోకా ళ్ళూని నీళ్ళు త్రాగిరి.

7. కనుక యావే గిద్యోనుతో ”నాలుకతో నీళ్ళు గతికిన మూడువందల మందితోనే నేను మిమ్ము రక్షించి శత్రువులను మీ వశము చేసెదను. మిగిలిన వారినందరిని వెడలిపొండని చెప్పుము” అనెను.

8. గిద్యోను ఆ మూడు వందల మందిని మాత్రమే తన చెంతనుంచుకొనెను. మిగిలిన వారియొద్ద నుండి ఆహారమును, బాకాలను తీసికొని వారిని పంపివేసెను. మిద్యానీయులు గిద్యోను శిబి రము చెంతనే క్రిందిలోయలో విడిదిచేసిరి.

విజయ సంకేతము

9. యావే ఆ రాత్రి గిద్యోనుతో ”నీవు వెళ్ళి శత్రుశిబిరము మీదపడుము. వారిని నీ వశము చేసితిని.

10. నీవు శత్రువుల మీదపడుటకు జంకెద వేని మొదట నీ సేవకుడైన పూరాను తీసికొని వారి శిబిరము వద్దకు పొమ్ము.

11. అచట వారేమను కొనుచున్నారో వినుము. నీవు వారి పలుకులు ఆలించి ధైర్యము చెందగలవు” అని నుడివెను. కనుక గిద్యోను పూరాను వెంటనిడుకొని విరోధిసైన్యము చెంతకు పోయెను.

12. అచట మిద్యానీయులు, అమాలెకీయులు, తూర్పు దేశవాసులు మిడుతల దండువలె లోయ యందంతట వ్యాపించియుండిరి. వారి ఒంటెలు సముద్రపు ఒడ్డునగల యిసుకరేణువులవలె లెక్కకు మించియుండెను.

13. గిద్యోను వ్యూహము చేరు నప్పికి అచటనొకడు తన మిత్రునితో ”వింవా! నేనొక కలగింని. యవధాన్యముతో చేయబడిన గుండ్రనిరొట్టె ఒకి గిరగిర దొర్లుకొనుచు వచ్చి మిద్యానీయుల శిబిరముచొచ్చెను. అది గుడారమునకు తగులగా ఆ గుడారము వెల్లికిలబడెను” అని చెప్పు చుండెను.

14. ఆ మిత్రుడతనితో ”అయిననేమి? ఈ రొట్టె మరేమో కాదు. యిస్రాయేలీయుడగు యోవాషు కుమారుడగు గిద్యోను ఖడ్గమే. దేవుడు మిద్యానీయులను ఈ శిబిరమును అతనికి హస్తగతము చేసెను” అని పలికెను.

15. గిద్యోను ఆ స్వప్న వృత్తాంతమును దాని అర్థమును విని భక్తిభావముతో ప్రభునకు నమస్కరించెను. అంతటతడు డేరాకు మరలి వచ్చి తన అనుచరులతో ”లెండు! యావే మిద్యానీయుల శిబిరమును మీ వశము గావించెను” అని పలికెను.

గిద్యోను దాడి

16. గిద్యోను తన సైన్యములను మూడు దండులుగా విభజించెను. ప్రతి సైనికునికి ఒక బాకాను, కుండను ఇచ్చెను. ప్రతి కుండలోను దీపము గలదు.

17. అతడు వారితో ”నన్ను జాగ్రత్తగా గమనించు చుండుడు. నేను చేసినట్లే మీరును చేయవలెను. నేను శత్రుశిబిరము చేరగానే ఏమిచేయుదునో జాగ్రత్తగా గమనింపుడు. నేను చేసినట్లే మీరును చేయవలెను.

18. నేను, నా వెంటనున్నవారు బాకానూదగనే మీరును శిబిరముచుట్టు బాకానూది యావేకు గిద్యోనునకు విజయమని నినాదములు చేయుడు” అని చెప్పెను.

19. గిద్యోను, అతని వెంటనున్న నూరుగురు సైనికులు నడిజామున శత్రుశిబిరము దాపునకు వచ్చిరి. అప్పుడే విడిదిపట్టున కావలిభటులు వంతులు మార్చుకొనియుండిరి. గిద్యోను అతని అనుచరులు బాకాలనూది కుండలు పగులగ్టొిరి.

20. అది చూచి మూడుదండులును బాకాలనూది కుండలు పగుల గొట్టెను. ఎడమచేత దివిీలుప్టి, కుడిచేత బాకాలను పూని ”యావేకు ఖడ్గము, గిద్యోనునకు ఖడ్గము!” అని నినాదములు చేసెను.

21. యిస్రాయేలుదండులు తమ శత్రువుల విడిదిచుట్టు నిలబడియుండెను. ఆ నినాదములకు శిబిరమంతయు మేల్కొని గావుకేక లిడుచు పలాయనమయ్యెను.

22. ఆ మూడువందల మంది బాకాల నూదుచుండగా శత్రుసైనికులందరు కలవరముచెంది ఒకరిమీద ఒకరు కత్తిదూయ మొద లిడిరి. అది యావే చేసిన కార్యము. ఆ సైనికులందరు సెరారాతు దిక్కుగా బేత్షిత్తా వరకు, తాబ్బాతు దిక్కుగా ఆబెల్మెహోలా వరకును పారిపోయిరి.

గిద్యోను శత్రువులను వెన్నాడుట

23. నఫ్తాలి, ఆషేరు, మనష్షే తెగలవారైన యిస్రాయేలీయులందరు కూడివచ్చి మిద్యానీయులను వెన్నాడిరి.

24. గిద్యోను ఎఫ్రాయీము కొండసీమల లోనికి దూతలనంపి ”మీరు దిగివచ్చి మిద్యానీయు లతో పోరాడుడు. వారికి ముందుగా బోయి బెత్బారా, యోర్దాను రేవుల నాక్రమింపుడు” అని వర్తమానము పంపెను. కనుక ఎఫ్రాయీము వాసులందరు ప్రోగై వచ్చి ఆ రేవులను ఆక్రమించుకొనిరి.

25. వారు మిద్యాను సైన్యాధిపతులైన ఓరేబు, సేయేబులను పట్టుకొనిరి. ఓరేబును ఓరేబు కొండవద్ద వధించిరి. సెయేబును సెయేబు ద్రాక్షగానుగ చెంత మట్టుప్టిెరి. మిద్యానీయులను తరిమిక్టొిరి. ఇద్దరు మొనగాండ్ర తలలు తెగగ్టొి యోర్దాను ఒడ్డున గిద్యోను వద్దకు కొనివచ్చిరి.

Previous                                                                                                                                                                                                  Next  

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము