4. బోవసు రూతును పెండ్లియాడుట

4 1. బోవసు వెళ్ళి నగరద్వారము చెంత రచ్చబండ వద్ద కూర్చుండెను. అంతలో మునుపు బోవసు పేర్కొనిన ఎలీమెలెకు దగ్గరిబంధువు ఆ త్రోవన పోవు చుండెను. బోవసు అతనిని పిలిచి, ఇటువచ్చి కూర్చుండుమని చెప్పెను. అతడు వచ్చి రచ్చపట్టున కూర్చుండెను.

2. బోవసు నగరమునుండి పదిమంది పెద్దలను పిలిచి వారిని తన దాపున కూర్చుండబెట్టు కొనెను.

3. బోవసు ఆ దగ్గరిచుట్టముతో ”నవోమి మోవాబునుండి తిరిగివచ్చినదికదా! ఆమె మన బంధువైన ఎలీమెలెకునకుచెందిన పొలమును అమ్మ గోరుచున్నది.

4. ఈ సంగతి నీకు ఎరిగింపవల యును అనుకొింని. నీకు వలయునేని ఈ పెద్దల సమక్షమున ఆ భూమిని సంపాదించుకొనుము. ఆ పొలమును విడిపింపవలసిన బాధ్యత మొదటనీది. అటు తరువాత నాది. నీకు అక్కరలేదేని ఆ మాట కూడ చెప్పుము” అనెను. అతడు ”నేను విడిపించెదను” అని పలికెను.

5. బోవసు మరల ”నీవు నవోమి చేతినుండి ఆ పొలమును సంపాదించు దినమున చనిపోయినవారిపేరట అతని స్వాస్థ్యమును స్థిర పరుచునట్లు, చనిపోయినవాని భార్యయైన రూతు అను మోవాబీయురాలు యొద్దనుండి దానిని సంపా దించుకొనవలెను” అని అనెను.

6. ఆ మాటలకు ఆ దగ్గరి బంధువు ”అటులయినచో నేను ఆ పొలమును విడిపింపలేను. క్రొత్తసంతానము వలన నా పిల్లలకు దక్కవలసిన ఆస్తి తగ్గిపోవును. కనుక నీవే ఆ భూమిని తీసికోవచ్చును” అని పలికెను.

7. వెనుకిరోజులలో యిస్రాయేలీయులలో ఒక ఆచారము ఉండెడిది. పొలమును అమ్మునపుడుగాని, మారకము వేయునపుడుగాని బేరము ముగిసినదనుటకు గుర్తుగా వారిలో ఒకడు తన చెప్పు తీసి అవతలివానికి ఇచ్చెడివాడు.

8. కనుక దగ్గరిచుట్టము బోవసుతో నీవే ఆ భూమిని తీసికొమ్మని పలికి కాలి చెప్పు విడిచెను.

9. బోవసు అచట సమావేశమైన పెద్దల తోను మరి యితరులతోను ”వినుడు, నేడు నేను ఎలీమెలెకు, కిల్యోను, మహ్లోనులకు చెందిన ఆస్తినంతిని నవోమి నుండి కొింననుటకు మీరే సాకక్షులు.

10. మహ్లోను భార్యయు మోవాబీయురాలైన రూతును నేను పెండ్లి యాడుదును. ఆమెకు కలిగిన సంతానము ఎలీమెలెకు పొలమునకు వారసులగుదురు. ఈ రీతిగా గతించిన ఎలీమెలెకు కుటుంబము మన జనమందును, మన నగరమందును వర్ధిల్లును. మీరందరు దీనికి సాకక్షులు” అనెను.

11. అచట ప్రోగైన పెద్దలు మరియు ఇతరులు ”మేమందరము ఈ ఉదంతమునకు సాకక్షులము.  నీ ఇంట అడుగుపెట్టనున్న ఈ యిల్లాలుకూడ, పూర్వము యాకోబునకు పెక్కుమంది బిడ్డలను కనిన రాహేలు, లేయాలవలె ప్రభువు కృపవలన సంతానవతి అగును గాక!  నీవు ఎఫ్రాతా తెగనందు సంపన్నుడవగుదువు గాక! బేత్లెహేమున సుప్రసిద్ధుడవగుదువుగాక!

12. ప్రభువు నీకును ఈ యువతికిని ప్రసాదించు సంతానము వలన పూర్వము యూదా తామారులు కనిన పెరెసు కుటుంబమువలె నీ కుటుంబమును కీర్తి కెక్కును గాక!” అని దీవించిరి.

13. అంతట బోవసు రూతును పెండ్లియాడెను. అతడు రూతును కూడగా ఆమె గర్భముతాల్చి బిడ్డను కనెను. 14. ఆ ఊరి స్త్రీలు నవోమితో ”ప్రభువు స్తుతింపబడునుగాక! అతడు నీకొక మగకందును ప్రసాదించెను. ఈ బిడ్డడు యిస్రాయేలున సుప్రసిద్ధుడు అగును గాక!

15. నీ కోడలికి నీవన్న ప్రాణముకదా! ఆమె నీకు ఏడుగురు కుమారులకంటెను మిన్న.  నేడు ఆమెకనిన ఈ శిశువువలన నీకు ఆనందము కలుగును. నీ ముసలితనమున ఇతడు నిన్ను ఆదు కొనును” అని పలికిరి.

16. నవోమి ఆ బిడ్డను రొమ్మునకు అదుముకొనెను. తానే ఆ శిశువునకు దాది అయ్యెను.

17. ఇరుగుపొరుగు స్త్రీలు ఆ శిశువునకు ఒబెదు అని పేరు ప్టిెరి. నవోమికి బిడ్డకలిగెనని ఊరంతయు చెప్పుకొనిరి.  ఇతడే దావీదు తండ్రియైన యిషాయికి జనకుడు.

18-22. పెరెసునుండి దావీదువరకు గల వంశ వృక్షమిది: పెరెసు, హెస్రోను, రాము, అమ్మినాదాబు, నహస్సోను, సల్మోను, బోవసు, ఒబెదు, యిషాయి, దావీదు.

Previous                                                                                                                                                                                                  Next  

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము