సౌలు తన తండ్రియొక్క గాడిదలను వెదకబోవుట

9 1. అఫియకు ప్టుిన బెకోరతు కుమారుడగు సెరోరునకు జన్మించిన అబీయేలు కుమారుడు కీషు అను బెన్యామీనీయుడు ఒకడుండెను. అతడు భాగ్య వంతుడు.

2. కీషు కుమారుడు సౌలు. సౌలు పడుచువాడు, చక్కనివాడు. యిస్రాయేలీయులలో అతనికంటె అందమైనవాడు లేడు. ఇతరులు అతని భుజముల వరకైనను రారు.

3. ఒక దినము కీషు గాడిదలు తప్పిపోయెను. కనుక అతడు కుమారుని పిలిచి ”నాయనా! సేవకుని వెంట బెట్టుకొనిపోయి గాడిదలను వెదకిరమ్ము” అని చెప్పెను.

4. వారు ప్రయాణమైపోయి ఎఫ్రాయీము కొండసీమలుదాిరి. షాలీషా పొలములు గాలించిరి. కాని గాడిదలు కనిపించలేదు. షాలీము, బెన్యామీను పొలిమేరలు దాినను వాని జాడతెలియరాలేదు.

5. అంతట వారు సూఫు సీమ చేరుకొనిరి. అప్పుడు సౌలు తనవెంట వచ్చు బంటుతో ”ఇక తిరిగిపోదము. లేకున్న నాయన గాడిదల మాట మరచి మనలను గూర్చి చింతించును” అనెను.

6. అందుకు పనివాడు ”అయ్యా! ఈ నగరమున దైవభక్తుడు ఒకడున్నాడు. అతడనిన అందరికి మిగుల గౌరవము. అతడు చెప్పినదంతయు జరిగి తీరును. ఆ భక్తుని దర్శింతము రమ్ము. ఒకవేళ అతడు మనకు మార్గము చూపునేమో” అనెను.

7. ఆ మాటలకు సౌలు ”మనము అతని వద్దకు వెళ్ళినచో బహుమానముగా ఏమికొని పోగలము? సంచిలోని రొట్టెయంతయు అయిపోయినది. ఆ దైవభక్తునకు కానుక ఈయదగిన వస్తువేదియు మనకడలేదు. ఏమున్నది?” అని అడిగెను.

8. సేవకుడు ”నా చెంత పావుతులము వెండినాణెమున్నది. దానిని ఇచ్చెదము. అతడు మనకు మార్గము చూపును” అని చెప్పెను.

9. పూర్వము యిస్రాయేలీయులు యావేతో సంప్రతించుటకు పోవునపుడు, దీర్ఘదర్శియొద్దకు పోవుదమని అను కొనెడివారు. ఇప్పుడు ప్రవక్త అనబడే జనుడు ఆ రోజులలో దీర్ఘదర్శి అని పిలువబడెడివాడు.

10. సౌలు ”చక్కగా నుడివితివి, పోవుదమురమ్ము” అనెను. అంతట వారిద్దరు దైవభక్తుని దర్శించుటకు నగర మునకు పోయిరి.

సౌలు సమూవేలును దర్శించుట

11. వారు కొండమీదనున్న పట్టణమునకెక్కి పోవుచు నీళ్ళు తోడుకొనుటకు దిగివచ్చు బాలికలను చూచి దీర్ఘదర్శి ఉన్నాడా అని అడిగిరి.

12. ఆ బాలికలు ”అవును, ఆయన ఇక్కడనే ఉన్నాడు. ఇప్పుడే నగరమునకు వచ్చియున్నాడు. ఈ దినము ఉన్నత స్థలమున బలి అర్పింపబోవుచున్నాడు.

13. అతడు భోజనమునకై ఉన్నతస్థలమునకు వెళ్ళకమునుపే మీరు ఆయనను కలిసికోవచ్చును. ఆయన వెళ్ళి బలిభోజ్యమును ఆశీర్వదించిన గాని అచ్చి జనులు ఆహారమును ముట్టుకోరు. కనుక త్వరగావెళ్ళుడు. ఆయనను దర్శింపవచ్చును” అని చెప్పిరి.

14. సౌలు సేవకునితో పైకెక్కిపోయి పట్టణమున ప్రవేశింపగనే సమూవేలు ఉన్నతస్థలమునకు పోవుటకై బయలుదేరి పురద్వారముచెంత వారికి ఎదురు పడెను.

15. ఆ ముందురోజు ప్రభువు సమూవేలుతో 16. ”రేపు నిర్ణీత సమయమునకు బెన్యామీను దేశీయుని ఒకనిని నీ యొద్దకు పంపెదను. అతనిని యిస్రాయేలు నకు నాయకునిగా అభిషేకింపుము. అతడు నా ప్రజలను ఫిలిస్తీయుల బారినుండి కాపాడును.ఆ జనులమొర నాకు విన్పించినది. నేను వారిని కనికరించితిని” అని చెప్పెను.

17. సౌలు సమూవేలునకు ఎదురుపడగనే ప్రభువు అతనితో ”నా ప్రజలను పరిపాలించునని నేను ముందుగా నీకెరిగించినవాడు ఇతడే” అని పలికెను.

18. సౌలు పురద్వారముచెంత సమూవేలును సమీపించి ”అయ్యా! దీర్ఘదర్శి ఇల్లెక్కడ?” అని అడిగెను.

19. సమూవేలు సౌలుతో ”దీర్ఘదర్శిని నేనే. నాకంటె ముందుగా పోయి ఉన్నతస్థలమును చేరుకొనుము. నేడు నీవు నాతో భుజింపవలెను. రేపు నిన్ను సాగనంపెదను. నీవు వెళ్ళునపుడు నీ మనస్సులోని సందియము కూడ తీర్చెదను.

20. మూడురోజుల క్రిందట తప్పిపోయిన మీ గాడిదలు దొరికినవి. కనుక వానిని గూర్చి చింతింపకుము.ఇక ఈ యిస్రాయేయులందరు కోరు కొనునది ఎవరిని? నిన్నును నీ కుటుంబము వారిని కాదా?” అనెను.

21. అందులకు సౌలు ”నేను యిస్రాయేలు తెగలన్నిలో అల్పమైన బెన్యామీను తెగవాడను. బెన్యామీను తెగనందలి కుటుంబము లన్నింకంటె అల్పమైనది నా కుటుంబము. మీర్టి పలుకు పలుకనేల?” అనెను.

22. సమూవేలు సౌలును అతని దాసుని భోజన శాలకు తోడ్కొనిపోయెను. అచ్చట పిలువగా వచ్చి పంక్తిదీరియున్న ముప్పదిమంది అతిథులకు ముంది భాగమున వారిని కూర్చుండబెట్టెను.

23. సమూవేలు వంటలవానిని పిలిచి, నేను నీ చేతికిచ్చి వండి వేరుగా నుంచుమని చెప్పిన మాంసఖండము కొనిరమ్మనెను.

24. అతడు వండియుంచిన వేట తొడనుతెచ్చి సౌలు ముందటపెట్టెను. సమూవేలు సౌలుతో ”నీ కొరకు వేరుగానుంచిన మాంసమిదియే. అతిథులను ఆహ్వా నించిన ఈ విందునందు ఈ భాగమును నీకొరకు ప్రత్యేకముగా అి్టప్టిెతిని. ఇక భుజింపుము” అనెను. ఆ రీతిగా సౌలు నాడు సమూవేలుతో విందారగించెను.

25. అంతట వారు ఉన్నతస్థలము నుండి నగరము నకు దిగివచ్చిరి. సౌలుకు మిద్దెమీదపడక సిద్ధము చేయగా అతడు నిద్రించెను.

సమూవేలు సౌలును అభిషేకించుట

26. మరునాి వేకువనే సమూవేలు సౌలును పిలిచి ”లెమ్ము! నేను నిన్ను సాగనంపవలెను” అనెను. సౌలు లేచెను. వారిద్దరు పయనమై వీధిలోనికి వెళ్ళిరి.      

27. నగరము చివరకు రాగానే సమూవేలు సౌలుతో ”నీ పని వానిని సాగిపొమ్మనుము. నీవు మాత్రము ఒక్క క్షణము నాయొద్ద నిలువుము. యావే ఆజ్ఞను నీకు తెలియజేసెదను” అనెను.

Previous                                                                                                                                                                                                    Next