4. దావీదు ఫిలిస్తీయుల దేశమున వసించుట
గాతు రాజు దావీదునకు ఆశ్రయమిచ్చుట
27 1. దావీదు ”నేడో రేపో నేను సౌలు చేతికి చిక్కుటనిక్కము. కనుక శీఘ్రమే ఫిలిస్తీయుల దేశము నకు పారిపోయెదను. అటులైన సౌలు యిస్రాయేలు దేశము నలుమూలలు గాలించి నన్ను పట్టుకోవలయు నను ప్రయత్నమును మానును. అక్కడ నేను సురక్షిత ముగా ఉండిపోవచ్చును” అని అనుకొనెను.
2. కనుక అతడు ఆరువందలమంది అనుచరులను వెంటనిడు కొనివచ్చి గాతు రాజును, మావోకు కుమారుడునైన ఆకీషు శరణుజొచ్చెను.
3. దావీదు, అతని అనుచ రులు కుటుంబసమేతముగా వచ్చి ఆకీషు నీడలో గాతు దేశమున వసింపమొదలిడిరి. 4. దావీదు తన ఇద్దరు భార్యలతో అనగా యెస్రెయేలు నుండి వచ్చిన అహీనోవముతో, కర్మెలు నాబాలు భార్యయైయుండిన అబీగాయీలుతో అచట కాపురముండెను.
దావీదు ఫిలిస్తీయ ప్రభువునకు సామంతుడగుట
5. దావీదు ఆకీషుతో ”నేను నీ మన్ననకు పాత్రుడనైతినేని నీ దేశమున సాగునేలలోనున్న పట్టణ మొకి నాకిచ్చివేయుము. నేనచట స్థిరపడెదను. నీతోపాటు రాజధానిలో వసింపనేల?” అనెను.
6. ఆకీషు దావీదునకు సిక్లాగు పట్టణమునిచ్చెను. కనుకనే సిక్లాగు నగరము నేికిని యూదారాజుల వశమున నున్నది.
7. ఈ రీతిగా దావీదు పదునారు నెలలు ఫిలిస్తీయ రాజ్యమున వసించెను.
8. దావీదు అనుచరు లతో పోయి అమాలెకీయులు, గెషూరీయులు, గెరిసీయులు మొదలైన జాతులపై దాడిసల్పెను. వీరు తేలాము నుండి షూరుమీదుగా ఐగుప్తువరకు నివాసములు ఏర్పరచుకొనియుండిరి.
9. దావీదు ఆ ప్రాంతమును కొల్లగ్టొి స్త్రీలనక పురుషులనక చేతికి చిక్కినవారినందరిని హతమార్చి అచ్చటనున్న గొఱ్ఱెలు, ఎడ్లు, గాడిదలు, ఒంటెలు మొదలగు పశుసంపదను, జనులు తాల్చు బట్టలను దోచుకొని ఆకీషుచెంతకు కొనితెచ్చెడి వాడు.
10. ఆకీషు అతనినిచూచి ”నేడు ఏ ప్రాంతములను దోచుకొనివచ్చితివి?” అని అడుగు చుండును. దావీదు అతనితో ”నెగేబునందు యూదీ యుల గ్రామ సీమనో లేక యెరాహ్మెయేలీయుల పల్లెపట్టునో లేక కేనీయుల పల్లెనో దోచుకొనివచ్చి తిని” అని చెప్పుచుండును.
11. కాని దావీదు ఎన్నడు ఆ ప్రాంతముల నుండి ఆడువారినిగాని, మగవారిని గాని ప్రాణములతో గాతునకు కొనిరాలేదు. వారు తనపైన, తన అనుచరుల పైన లేనిపోని నేరములు మోపుదురేమో అని అతడు శంకించెను. ఫిలిస్తీయ రాజ్యమున ఉన్నంతకాలము అతడు ఈ నియమమునే పాించెను.
12. ఆకీషు దావీదు మాటలను గ్టిగా నమ్మెను. అతడు ”దావీదు చేయు పాడుపనులకు అతనికి ఇష్టులైన యిస్రాయేలీయులుకూడ అతనిని ద్వేషింతురు. కనుక జీవితాంతము అతడు నాకు సామంతుడుగనే ఉండిపోవును” అని అనుకొనెను.