3 1. దావీదు పక్షము వారికిని సౌలు పక్షము వారికిని నడుమ చాలనాళ్ళు పోరునడచెను. కాని రోజురోజుకు దావీదు పక్షమువారు బలాఢ్యులు కాగా సౌలు పక్షము వారు దుర్బలులైపోయిరి.
దావీదు పుత్రులు
2. దావీదునకు హెబ్రోనున కొడుకులు కలిగిరి. వారిలో పెద్దవాడు యెస్రెయేలుకు చెందిన అహీనోవము నకు ప్టుిన అమ్నోను.
3. రెండవవాడు కర్మెలు పట్టణమున నాబాలు భార్యయగు అబీగాయీలునకు జన్మించిన కిల్యాబు. మూడవవాడు గెషూరురాజు టల్మయి కుమార్తె మాకా కనిన అబ్షాలోము.
4. నాలుగవవాడు హగ్గీత్తునకు ప్టుిన అదోనియా. ఐదవవాడు అబీలునకు జన్మించిన షెప్యా. 5. ఆరవవాడు ఎగ్లాకు ప్టుిన ఈత్రెయాము.
అబ్నేరు ఈష్బోషెతు ప్లోాడుకొనుట
6. దావీదు తరపువారు, సౌలు తరపువారు తమమధ్య పోరు కొనసాగించుచుండిరి. సౌలు పక్ష మున అబ్నేరు సర్వాధికారయ్యెను.
7. సౌలుకు రిస్పా అను ఉంపుడుకత్తె కలదు. ఆమె అయ్యా కుమార్తె. ఈష్బోషెతు ”నా తండ్రి ఉంపుడుకత్తెతో ఏల శయ నించితివి?” అని అబ్నేరును ప్రశ్నించెను.
8. అబ్నేరు ఉగ్రుడై ”నేనేమి యూదా కుక్కతలననుకొింవా? నేి వరకు నేను నీ తండ్రి సౌలు కుటుంబమును, అతని సోదరులను, స్నేహితులను కనురెప్పవలె కాపాడుచు వచ్చితిని. నిన్ను దావీదు వశము చేయనైతిని. నేడు ఈ ఉంపుడుకత్తె మూలమున నాపై నేరము మోపెదవా?
9-10. ఇక, ఈ రాజ్యమును సౌలుకుటుంబము నుండి తొలగింతుననియు దాను నుండి బెర్షేబా వరకు యిస్రాయేలీయులకును, యూదీయులకును దావీదునే రాజుగా నియమింతుననియు యావే దావీదునకు చేసిన బాసను సఫలము చేయనేని నా పేరు అబ్నేరు కాదు” అని పరుషముగా పలికెను.
11. ఈష్బోషెతు అబ్నేరుకు భయపడుటచే అతని మాటలకు మారు పలుకలేదు.
అబ్నేరు దావీదుతో మంతనము నడపుట
12. అబ్నేరు దూతలనంపి ”ఈ దేశము ఎవరిది? నీవునాతో ఒప్పందము చేసినయెడల నేను నీకు సహాయముచేసి, యిస్రాయేలీయులు అందరిని నీ పక్షమునకు మరల్చెదను” అని కబురు ప్టిెంచెను.
13. దావీదు ”మంచిది. నేను నీతో ఒడంబడిక చేసికొందును. కాని నీవు నా చెంతకు వచ్చునపుడు సౌలు కూతురు మీకాలును వెంటగొనిరావలయును. లేదేని నీవు నా మొగము చూడజాలవు” అని తెలియ జేసెను.
14. దావీదు సౌలు కుమారుడు ఈష్బోషెతు వద్దకు దూతలను పంపి ”నా భార్య మీకాలును నా కడకు పంపింపుము. నూరుమంది ఫిలిస్తీయుల చర్మాగ్రములు సమర్పించి ఆమెను బడసితిని” అని ఆజ్ఞ ఇచ్చెను.
15. కనుక ఈష్బోషెతు లాయీషు కుమారుడు ఫల్తీయేలు ఇంినుండి మీకాలును పిలిపించెను.
16. మీకాలు భర్త బావురుమని ఏడ్చుచు బహురీము వరకు ఆమె వెనువెంట వచ్చెను. కాని అబ్నేరు ఇక వెడలిపొమ్మని ఆజ్ఞాపింపగా అతడు వెనుదిరిగి పోయెను.
17. అబ్నేరు యిస్రాయేలు పెద్దలతో సంప్రదించి ”మీరు చాలకాలము నాడే దావీదును రాజుగా ఎన్ను కోగోరియుింరిగదా!
18. నా సేవకుడగు దావీదు ద్వారా ఫిలిస్తీయుల నుండి ఇతర శత్రువుల నుండి యిస్రాయేలీయులను రక్షించెదనని ప్రభువు పలికెను గనుక మీరు దావీదు వైపున చేరవలయును” అని చెప్పెను.
19. అతడు బెన్యామీనీయులతో కూడ సంప్రదించిన పిమ్మట హెబ్రోనున దావీదును కలిసి కొనెను. పై రెండు తెగలవారు సమ్మతించిరని విన్న వించెను.
20. అబ్నేరు ఇరువదిమంది అనుచరులను వెంటనిడుకొని హెబ్రోనున దావీదును చూడబోయెను. దావీదు అబ్నేరుకు అతని తోడి బలగమునకు విందుచేసెను.
21. అతడు దావీదుతో ”ఏలిక సెలవైన నేనిక వెడలిపోయెదను. యిస్రాయేలీయులనందరను మీ పక్షమునకు కొనివచ్చెదను. వారు మీతో ఒడంబడిక చేసికొందురు. ఇక మీరు అభిలషించినరీతిని అందరి మీదను పరిపాలనము నెరపవచ్చును” అనెను. దావీదు అబ్నేరును సాగనంపగా అతడు సురక్షితముగా వెడలి పోయెను.
అబ్నేరు వధ
22. దావీదు సైనికులు శత్రువులపై దాడి చేయ బోయిరి. వారు విస్తారమైన కొల్లసొమ్ము గైకొని అప్పుడే యోవాబుతో తిరిగివచ్చిరి. దావీదు అబ్నేరును సాగ నంపెనుగదా! అతడు రాజును వీడ్కొని హెబ్రోను నుండి సురక్షితముగా వెడలిపోయెను.
23. కాని తోడి బంటులతో తిరిగివచ్చిన యోవాబు, నేరు కుమారు డగు అబ్నేరు రాజువద్దకు వచ్చెననియు రాజు అతనిని నిరపాయముగా సాగనంపెననియు వినెను.
24. అతడు వెంటనే రాజు వద్దకు వచ్చి ”ఏమిపనిచేసితివి? అబ్నేరు నీ యొద్దకురాగా ఊరకే వెడలి పోనిత్తువా? ద్రోహి జారిపోయెనుగదా?
25. నేరు కుమారుడు అబ్నేరును నీవెరుగవా? అతడు నిన్ను మోసగించి నీ గుట్టుమట్టు తెలిసికొనగోరియే ఇక్కడకి వచ్చెను” అనెను.
26. అటుపిమ్మట యోవాబు దావీదును వీడ్కొని వెడలిపోయి అబ్నేరును పిలుచుటకై దూతలను పంపెను. వారు సిరా నూతి దగ్గర అతనిని కలిసికొని యోవాబు వద్దకు కొనివచ్చిరి. కాని యీ సంగతి యేమియు దావీదునకు తెలియదు.
27. అబ్నేరు మరల హెబ్రోను చేరిన పిమ్మట యోవాబు అతనితో రహస్యముగా మ్లాడగోరినట్లే నించుచు నగర ద్వారము వద్దకు తోడ్కొనిపోయెను. తన తమ్ముడు అసాహేలును చంపినందుకు పగతీర్చుకోగోరి యోవాబు అబ్నేరును అచట కత్తితో పొట్టలో పొడవగా అతడు ప్రాణములు విడిచెను.
28. తరువాత దావీదు ఈ సంగతి తెలిసికొనెను. అతడు ”నేరు కుమారుడు అబ్నేరు చావునకు యావే సమక్షమున నేను నా రాజ్యము బాధ్యులము కాము.
29. ఈ అపరాధమునకు యోవాబు అతని కుటుంబమువారు ఉత్తర వాదులు అగుదురుగాక! యోవాబు కుటుంబమున ఎప్పుడు ఎవడో ఒకడు రక్తస్రావరోగియో, కుష్ఠరోగియో, పేడి వాడో, కత్తివాతబడువాడో, అడుగుకొని బ్రతుకువాడో అగునుగాక!” అనెను.
30. అబ్నేరు గిబ్యోను యుద్ధ మున అసాహేలును చంపెనుగదా! అందుకే యోవాబు అతని తమ్ముడు అబీషాయి, అబ్నేరుపై పగతీర్చుకొనిరి.
31. దావీదు యోవాబును, అతని అనుచరులను చూచి ”మీరు బట్టలుచించుకొని, గోనెలుతాల్చి అబ్నేరు ఎదుట విలపింపుడు” అని చెప్పెను. రాజు స్వయముగా అబ్నేరు పాడెవెంట నడచెను.
32. అతనిని హెబ్రోనున పాతి ప్టిెరి. రాజు అబ్నేరు సమాధిచెంత పెద్దగాఏడ్చెను. పౌరులును విలపించిరి.
33-34. అపుడు రాజు దుఃఖముతో క్రింది శోకగీతికను వినిపించెను:
”అబ్నేరు పిచ్చివానివలె చనిపోయెనుగదా!
మిత్రమా! నీ కాలుసేతులను క్టివేయలేదు
అయినను మోసగాండ్ర చేజిక్కిన వానివలె
మడిసితివిగదా!”
ఆ మాటలువిని ప్రజలందరు మరల విలపించిరి.
35. అప్పికింకను ప్రొద్దుక్రుంకలేదు. ప్రజ లందరు దావీదును ఆహారము తినుమని బ్రతిమాలిరి. కాని దావీదు ”సూర్యుడు అస్తమింపకముందు ఆహా రము ముట్టుకొందునేని దేవుడు నన్ను శపించుగాక!” అని ఒట్టుపెట్టుకొనెను.
36. ప్రజలు ఆ మాటలకు సంతసించిరి. అసలు రాజు చేసిన ప్రతి పనియు ప్రజలకు నచ్చెను.
37. నేరు కుమారుడు అబ్నేరును చంపుట రాజునకు సమ్మతముకాదని యిస్రాయేలీయు లందరు నాడు తెలిసికొనిరి.
38. రాజు తన ఉద్యోగులతో ”నేడు యిస్రాయేలీ యులందు రాజవంశీయుడగు మహావీరుడొకడు గతించెను.
39. నేను రాజుగా అభిషిక్తుడనైనను దుర్బలుడను. ఈ సెరూయా కుమారులు నాకు లొంగుటలేదు. కీడు చేసిన దుర్మార్గులను ప్రభువే ఉచితరీతిగా శిక్షించునుగాక!” అనెను.