మందసము యెరూషలేము చేరుట
6 1. దావీదు యిస్రాయేలీయులనుండి ముప్పది వేలమంది వీరులను ఎన్నుకొనెను.
2. వారిని వెంట నిడుకొని కెరూబుదూతలమధ్య నివసించు, సైన్యము లకు అధిపతియగు యావేపేర వెలయు మందసమును కొనివచ్చుటకై యూదానందలి బాలాకు పయనమై పోయెను.
3. వారు మందసమును క్రొత్తబండి మీదికెక్కించి కొండమీది అబీనాదాబు ఇంినుండి తరలించుకొని వచ్చిరి.
4. అబీనాదాబు పుత్రులగు ఉస్సా, అహ్యో బండి తోలించుచుండిరి. ఉస్సా బండి ప్రక్కన, అహ్యో బండిముందట నడచుచుండిరి.
5. వాద్యకారులు సితారా, మృదంగము, తంబుర, స్వరమండలము, తాళములను వాయించుచుండగా దావీదు, యిస్రాయేలీయులు తన్మయులై యావే ముందట నాట్యమాడిరి.
6. వారు నాకోను కళ్ళము వద్దకు వచ్చిరి. అచట ఎడ్లు బండిని గతుకులలోనికి ఈడ్చుటచే మందసముజారి క్రిందపడబోయెను. కనుక ఉస్సా చేయిచాచి దానిని పట్టుకొనెను.
7. కాని యావే ఉగ్రుడై ఉస్సా నేరము సహింపక, ఉన్నవానిని ఉన్నట్లు శిక్షించెను. అతడు మందసము ప్రక్కన కూలి ప్రాణము విడిచెను.
8. ఆ రీతిగా యావే ఉస్సా మీద పడి నందుకు దావీదు ఆ తావునకు పేరెస్ఉస్సా4 అని పేరుపెట్టెను. నేికిని ఆ తావు అదేపేరుతో పిలువ బడుచున్నది.
9. నాడు దావీదు యావేకు భయపడి, దైవ మందసమును ఇంికి కొనిపోవుట మేలాయని అను మానపడెను.
10. కనుక అతడు మందసమును దావీదుపురమునకు కొనిపోవుట చాలించి గిత్తీయుడైన ఓబేదెదోము ఇంికిచేర్చెను.
11. అతని ఇంట మందసము మూడుమాసములు ఉండెను. యావే ఓబేదెదోమును, అతని కుటుంమును చల్లనిచూపు చూచెను.
12. మందసము మూలముగా యావే ఓబేదెదోము కుటంబమును, అతని ఆస్తిపాస్తులను వృద్ధిచేసెనని దావీదు వినెను. అతడు సంతసముతో మందసమును తన నగరికి కొనివచ్చెను.
13. మందసమును మోయువారు ఆరేసి అడుగులు వేసినపిదప దావీదు కోడెను, బలసిన పొట్టేలును బలిఅర్పించెను.
14. రాజు, యాజకులు ధరించు నారబట్టతాల్చి యావే ముందు తన్మయుడై నాట్యమాడెను.
15. అతడును, యిస్రాయేలీయులును కొమ్మునూదుచు, పెద్దపెట్టున నాదములు చేయుచు, యావే మందసమును కొనివచ్చిరి.
16. మందసము నగరము ప్రవేశించుచుండగా సౌలు కూతురు మీకాలు కికీనుండి చూచెను. దావీదు మందసముముందు గంతులు వేయుచు నాట్యమాడు చుండెను. మీకాలు దావీదును గాంచి ఏవగించుకొని అతనిని చిన్నచూపుచూచెను.
17. జనులు మందస మును కొనివచ్చి, దావీదు ముందుగనే సిద్ధముచేసిన గుడారున ప్రతిష్ఠించిరి. రాజు దహనబలులు, సమాధానబలులు సమర్పించెను.
18. బలులు ఒసగిన పిమ్మట సైన్యములకు అధిపతియైన యావే పేర ప్రజలను దీవించెను.
19. స్త్రీలు, పురుషులనక యిస్రాయేలీయులందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రొట్టెను, కొంత మాంసమును, ఎండిన ద్రాక్షపండ్లను పంచి పెట్టెను. అంతట అందరు తమతమ ఇండ్లకు వెళ్ళి పోయిరి.
20. దావీదు తన కుటుంబమును కూడ దీవింప వచ్చెను. సౌలు కూతురు మీకాలు అతనికి ఎదురుపడి ”నేడు యిస్రాయేలు రాజు బట్టలువూడిన కూడ పనికత్తెల ఎదుట పిచ్చివానివలె నాట్యమాడి ఎంత గౌరవము తెచ్చుకొనెను!” అని ఎత్తిపొడిచెను.
21. అతడు ”నేను యావే ఎదుట నాట్యమాడితిని. ప్రభువు నీ తండ్రిని, అతని కుటుంబమును కాదని తన ప్రజలైన యిస్రాయేలీయులకు నన్ను నాయకునిగా నియమించెను. ఆ ప్రభువు ఎదుట నేను నాట్యము చేయవలదా?
22. నేనింతకంటె ఎక్కువగా అగౌరవము పాలయ్యెదనుగాక! నీ కింకింకను చులుకన అయ్యెదనుగాక! కాని నీవు పేర్కొనిన ఆ పనికత్తెలు మాత్రము నన్ను మన్నన చేయకపోరు” అనెను.
23. సౌలు కూతురు మీకాలునకు మాత్రము చనిపోవువరకును సంతానము కలుగలేదు.