దావీదు యుద్ధములు

8 1. దావీదు ఫిలిస్తీయులను జయించి లోబరచు కొనెను. మెతెగమ్మాను వారిచెంతనుండి గైకొనెను.7

2. అతడు మోవాబీయులను కూడ జయించెను. వారిని వరుసగా నేలపై పరుండబ్టెి ఆ వరుసపొడవును త్రాితో కొలిపించెను. ప్రతిరెండు త్రాళ్ళ పొడవువారిని మట్టుప్టిెంచి, ప్రతియొక త్రాిపొడవున ఉన్న వారిని ప్రాణములతో వదలివేసెను. మోవాబీయులు దావీదు నకు సామంతులై కప్పము క్టిరి.

3. రేహోబీయుడును, సోబా రాజైన హదదెసెరు యూఫ్రీసు నదీతీరమును జయించుటకై దాడికి వెడలుచుండగా త్రోవలో దావీదు అతనిని ఎదిరించి ఓడించెను.

4. ఆ రాజు సైన్యములనుండి పదునేడు వందల గుఱ్ఱములను, వేయిమంది సైనికులను పట్టు కొనెను. కాని వందగుఱ్ఱములను మాత్రము తన నగరమున వాడుకొనుటకు ఉంచుకొని, మిగిలిన అన్నికి గుది కాలినరములు తెగగ్టొించెను.

5. సోబారాజుకు సాయపడుటకై అర్మీయులు ప్రోగైవచ్చిరి. కాని దావీదు వారినెదుర్కొని ఇరువది రెండువేల మందిని మట్టుపెట్టెను. వారి దేశమున పాలము లను కూడనిల్పెను.

6. ఆ రీతిగా అర్మీయులు దావీదునకు లోబడి కప్పము చెల్లించిరి. దావీదు పోరాడినచోటులనెల్ల యావే విజయము ప్రసాదించెను.

7. అతడు హదదెసెరు అంగరక్షకులు మోయు బంగారు డాళ్ళనుగైకొని యెరూషలేమునకు కొని వచ్చెను.

8. ఆ రాజునకు చెందిన బేతా, బెరోతయి నగరములనుండి పెద్ద మొత్తము ఇత్తడిసొమ్మును కూడ తీసికొనివచ్చెను.

9. హమాతు రాజు తోయి, దావీదు హదదెసెరు సైన్యమును ఓడించెనని విని అతనిని అభినందించు టకు తన కుమారుడైన హదోరామును పంపెను.

10. హదదెసెరు తోయికి శత్రువు. హదోరాము బంగారు, వెండి, ఇత్తడి పనిముట్లను కొనివచ్చి దావీదునకు కానుకగా ఇచ్చెను. దావీదు వానిని యావేకు సమర్పించెను.

11-12. దావీదు అంతకుముందే తనకు లొంగిపోయిన ఎదోమీయులు, మోవాబీయులు, అమ్మోనీయులు, ఫిలిస్తీయులు, అమాలెకీయులు మొద లగు జాతులనుండి గైకొనిన వెండిబంగారు వస్తువు లను, రెహోబీయుడును సోబారాజగు హదదెసెరు నుండి చేకొనిన కొల్లసొమ్మును యావేకు సమర్పించెను.

13. దావీదు యుద్ధమునుండి తిరిగివచ్చిన తరు వాత ఉప్పులోయలో ఎదోమీయులను ఎదుర్కొనెను. పదునెనిమిదివేల మందితో వచ్చిన వారి సైన్యము నంతిని చికాకుపరచెను.

14. ఎదోము మండల మున పాలములనుంచెను. వారు అతనికి లొంగి పోయిరి. దావీదు పేరు నేల నాలుగు చెఱగులకు ప్రాకెను. ఈ రీతిగా దావీదు పోరాడిన చోట్లనెల్ల యావే విజయము ప్రసాదించెను.

దావీదు పరిపాలనావిధానము

15. దావీదు యిస్రాయేలీయులనందరిని పరి పాలించెను. తన ప్రజలందరకు చక్కని తీర్పుతీర్చి న్యాయమును, సమానత్వమును కాపాడెను.

16. సెరూయా కుమారుడు యోవాబు అతని సైన్యాధిపతి. అహీలూదు పుత్రుడు యెహోషాఫాత్తు లేఖకుడు.          

17. అహీటూబు తనయుడు సాదోకు, అహీమెలెకు కొడుకు అబ్యాతారు యాజకులు. సెరాయా కార్యదర్శి.

18. యెహోయాదా కుమారుడు బెనాయా రాజునకు అంగరక్షకులైన కెరెతీయులకు, పెలెతీయులకు నాయ కుడు. దావీదు కుమారులును యాజకులైరి.

Previous                                                                                                                                                                                                     Next