నిర్వాసితుల జాబితాలు
2 1. చాలమంది ప్రవాసితులు బబులోనియానుండి యెరూషలేము, యూదారాజ్యములందలి తమతమ పట్టణములకు తిరిగివచ్చిరి. పూర్వము నెబుకద్నెసరు బందీలుగా కొనిపోయినప్పినుండి వారు బబులోనియా లో వసించుచుండిరి.
2. అటుల తిరిగివచ్చినవారి నాయకులు సెరుబ్బాబెలు, యేషువా, నెహెమ్యా, సెరాయా, రేలాయా, మొర్దెకయి, బిల్షాను, మిస్పారు, బిగ్వయి, రెహూము, బానా అనువారు. ప్రవాసము నుండి తిరిగి వచ్చిన ఆయా యిస్రాయేలు కుటుంబ ముల పెద్దల పేర్లు వారి వంశస్థుల సంఖ్యలు ఇవి:
3-20. పరోషు -2172; షెపట్య-372;
ఆర-775, యేషువ, యోవాబు వంశస్థుడు
పహత్మోవబు-2812; ఏలాము-1254;
సత్తు-945; సక్కయి-760; బాని-642; బేబయి-623; అస్గాదు-1222;
అదోనీకాము-666; బిగ్వయి-2056; ఆదీను-454; హిజ్కియా అను ఆతేరు-98;
బెసయి-323; యోరా-112;
హాషుము-223; గిబ్బారు-95;
21-35. ఈ క్రింది పట్టణములకు చెందిన వారు కూడ తిరిగివచ్చిరి. వారి సంఖ్యా వివరములివి:
బేత్లెహేము-123; నెతొఫా-56;
అనాతోతు-128; అస్మావెతు-42; కిర్యత్యారీము, కెఫిరా, బెరోతు-743;
రామా, గెబా-621; మిక్మసు-122;
బేతేలు, హాయి-223; నెబో-52;
మగ్బీషు-156;మరియొక ఏలాము-1254;
హారిము-320; లోదు, హాదీదు, ఓనో-725; యెరికో-345; సెనా-3630.
36-39. ప్రవాసము నుండి తిరిగివచ్చిన యాజక కుటుంబములు వారివంశస్థుల సంఖ్యలివి:
యేషువా వంశీకుడు యెదయా-973;
ఇమ్మేరు-1052; పషూరు-1247;
హారిము-1017.
40-42. ప్రవాసము నుండి తిరిగివచ్చిన లేవీయులు వారివారి కుటుంబములతో:
హోదవ్యా వంశజులైన యేషువా, కద్మియేలు వంశస్థులు-74, ఆసాపు వంశజులైన దేవాలయ గాయకులు-128, షల్లూము, అతేరు, టల్మోను, అక్కూబు, హతీతా, షోబయి వంశజులైన దేవాలయ ద్వారపాలకులు-139
43-54. ప్రవాసమునుండి తిరిగివచ్చిన దేవాల యపు పనివాండ్ర కుటుంబములు:
సీహా, హసుఫా, తబ్బావోతు; కెరోషు, సియాహా, పాదోను; లెబానా, హగాబా, అక్కూబు; హగాబు, షల్మయి, హనాను; గిద్దెలు, గహారు, రెయాయా; రెసీను, నెకోదా, గస్సాము; ఉజ్జా, పాసెయ, బేసాయి; అస్నా, మెవూనీము, నెఫీసీము; బక్బూకు, హకూఫా, హర్హూరు; బస్లూతు, మెహిదా, హర్షా; బర్కోసు, సీసెరా, తెమ; నెసీయా, హతీఫా.
55-57. ప్రవాసమునుండి తిరిగివచ్చిన సొలోమోను సేవకుల కుటుంబములు:
సోతయి, హస్సోఫెరేతు, పెరుదా; యాలా, దర్కోను, గిద్దేలు; షెఫ్యా, హత్తీలు, పోకెరెతు-హస్సెబాయీము, ఆమీ.
58. ప్రవాసమునుండి తిరిగివచ్చిన దేవాలయపు పనివాండ్రును సొలోమోను సేవకుల వంశస్థులును మొత్తము కలిసి 392 మంది.
59-60. దెలయ్యా, తోబియా, నెకోదా కుటుంబము వారు టెల్మెలా, టెల్హర్షా, కెరూబు, అద్దాను, ఇమ్మేరు పట్టణముల నుండి వెడలివచ్చిరి. వారందరు కలిసి 652 మంది. కాని వారు తాము యిస్రాయేలు సంతానమని రుజువు చేసికోలేకపోయిరి.
61-62. హబాయా, హక్కోసు, బర్సిల్లయి యాజక కుటుంబముల వారు, యాజకుల వంశ వృక్షములలో తమ పేర్లు చూపింపజాలకపోయిరి (బర్సిల్లయి పేరుతో పిలువబడు యాజక కుటుంబపు మూలపురుషుడు గిలాదునందలి బర్సిల్లయి కుటుంబపు ఆడపడుచును పెండ్లియాడి తన మామ వంశనామ మునే తాను కూడ స్వీకరించెను). ఈ కుటుంబముల వారు తమ వంశకర్తలను నిరూపింపజాలరైరి కనుక, వారు శుద్దికలవారుగాను, యాజకులుగాను గణింప బడలేదు.
63. దైవచిత్తమును తెలిసికొను పరికర ములను అనగా ఉరీము తుమ్మీము ధరించు యాజకుడు ఏర్పడువరకు పై మూడు కుటుంబములవారు దేవునికి అర్పించు నైవేద్యములను భుజింపరాదని పారశీక అధికారి కట్టడచేసెను.
64-67. ప్రవాసమునుండి తిరిగివచ్చిన నిర్వా సితులు మొత్తము 42,360 మంది, వారి దాసదా సీజనము-7,337 మంది.
గాయనీగాయకులు-200 మంది అయిరి,
గుఱ్ఱములు-736, కంచర గాడిదలు-245,
ఒంటెలు-435, గాడిదలు-6,720 ఉండెను.
68. నిర్వాసితులు యెరూషలేమునందలి దేవా లయమును చేరుకొనినపిదప దేవాలయమును యథా స్థానమున నిర్మించుటకు ఆయా వంశీకుల పెద్దలు స్వేచ్ఛగా విరాళములర్పించిరి.
69. ఎవరి శక్తికొలది వారు విరాళములిచ్చిరి. ఆ సొమ్మును ప్రోగుచేయగా 61,000 బంగారు నాణెములు, 5,000 వెండి నాణె ములు, నూరు యాజకవస్త్రములాయెను.
70. యాజ కులు, లేవీయులు మరికొందరు ప్రజలు యెరూషలేము న స్థిరపడిరి. గాయకులు, రక్షకభటులు, మరికొంత మంది యెరూషలేము చుట్టుపట్ల నివాసములు ఏర్పర చుకొనిరి. మిగిలిన యిస్రాయేలీయులందరు తమ పూర్వనగరములలో స్థిరపడిరి.