అన్యజాతులతో జరిగిన వివాహములను రద్దుచేయుట
9 1. ఈ కార్యములన్ని జరిగిన తరువాత ప్రజా నాయకులు కొందరు నా యొద్దకు వచ్చి ”అయ్యా! మన ప్రజలు, యాజకులు, లేవీయులు చెడుపనులు చేయు అన్యజాతి జనులతో తెగతెంపులు చేసికోరైరి. కనాను, మోవాబు, అమ్మోను, ఐగుప్తు దేశములతో, హిత్తీయులు పెరిస్సీయులు, యెబూసీయులు, అమోరీ యులు మొదలగు జాతులనుండి వేరుపడకుండ, వారితో కలిసి అసహ్యమైన కార్యములను చేయుచూ, 2. యూదులు ఇతరజాతుల ఆడుపడుచులను పెండ్లి యాడి ప్రభువు పవిత్ర ప్రజలను భ్రష్టము చేసిరి. మన నాయకులును, అధికారులును ఈ పాపమును అధిక ముగా మూటకట్టుకొనిరి” అని చెప్పిరి.
3. ఆ మాటలు విని నేను విచారముతో బట్టలు చించుకొింని. తల వెంట్రుకలను, గడ్డపువెంట్రుకలను పెరికి వేసికొింని. విషాదముతో నేలపై చతికిలబడితిని.
4. సాయంకా లము దహనబలి సమర్పించు సమయమువరకు నేనట్లే దిగులుతో చతికలబడియుింని. నిర్వాసితుల పాప మును గూర్చి దేవుడుపలికిన పలుకులు విని భయ పడిన యిస్రాయేలీయులందరు క్రమముగా వచ్చి నా చుట్టు ప్రోగైరి.
5. సాయంకాలబలిని సమర్పించునపుడు నేను చతికిలబడియున్న తావు నుండి ఎట్టకేలకు పైకి లేచితిని. ఆ చినిగిన బట్టలతోనే మోకాళ్లూని యావే వైపు చేతులెత్తి, 6. ”ఓ దేవా, నాదేవా, నాదేవా! నీ ఎదుట తలెత్తుటకు గూడ నాకు సిగ్గుగానున్నది. మా పాపములు మా తలల కంటె ఎత్తుగా కుప్పలు పడియున్నవి. మా దోష రాశులు ఆకాశమంతయెత్తుగానున్నవి.
7. మాపి తరుల కాలమునుండి మేము ఘోర పాతకములు చేసితిమి. మా అపరాధముల వలన మేమును, మా రాజులును, మా యాజకులును అన్యజాతిరాజులకు చిక్కిపోతిమి. వారు మమ్ము కత్తులతో పొడిచిరి. ప్రవాస మునకు కొనిపోయిరి. మా ఆస్తిపాస్తులను దోచు కొనిరి. మమ్ము అవమానపరచిరి. నేికి మేము ఈ దురవస్థలోనే ఉన్నాము.
8. అయితే ఇప్పుడు మా దేవుడు మా కన్నులకు వెలుగునిచ్చి, మా దాస్యము నుండి మేము కొంచెము ఉపశమనము పొందునట్లును, మాలో ఒక శేషజనమును ఉండనిచ్చునట్లుగాను, తన పవిత్రస్థలమునందు మమ్ము స్థిరపరచునట్లుగాను, మా దేవుడైన యావే కొంతమట్టుకు మా మీద దయ చూపెను.
9. మేము బానిసలము. అయినను నీవు మమ్ము బానిసలుగానే వదిలివేయలేదు. నీ దయవలన పారశీకరాజు మమ్మాదరముతో చూచెను.అతడు మమ్ము తెగార్పలేదు. యెరూషలేమున శిథిలమైయున్న నీ దేవాలయమును మరలకట్టుటకును, యూదా రాజ్య మందు, యెరూషలేము పట్టణమునందు సురక్షితముగా వసించుటకును అతడు మాకు అనుమతినిచ్చెను.
10. మా దేవా! ఇంత కృపనొందిన పిమ్మట ఇక మేమేమి చెప్పగలము? మేము నీ ఆజ్ఞలను ధిక్క రించిన అపరాధులము.
11. మేము వసింపబోవు దేశము అపవిత్రమైనదని ప్రవక్తలద్వారా నీవు ముందు గనే యెరిగించితివి. ఆ దేశీయులు ఆ నేల నాలుగు చెరగులను అపవిత్ర కార్యములతో నింపివేసిరని నీవు పలికితివి.
12. మేము మా కుమార్తెలను వారి కుమా రులకు వియ్యమొందరాదని మరియు మా కుమా రులకు, వారి కుమార్తెలను పుచ్చుకొనరాదని నీ ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించితివి. మేము వృద్ధిచెంది ఈ దేశమునందలి భూములను మా సంతానమునకు వారసత్వముగా ఈయగోరెదమేని ఆ అన్య దేశీయు లకు అభ్యుదయమునుగాని, శాంతి భద్రతలనుగాని తలపెట్టరాదని ఆజ్ఞాపించితివి.
13. మేము చేసిన మహాపాపములకుగాను మాకీశిక్షలు ప్రాప్తించినవి. అయినను నీవు మా దోషములకు తగినట్లుగా మమ్ము దండింపవైతివి. నేి వరకు మాలో కొందరిని ప్రాణ ములతో బ్రతుకనిచ్చితివి.
14. ఇదంతయు చాల దోయన్నట్లు మేము మరల నీ ఆజ్ఞ మీరి ఈ దుష్ట జనముతో పెండ్లిపొత్తు కుదుర్చుకొనుట యెట్లు? ఇట్లు చేసినచో నీవు మహాకోపముతో మమ్మందరిని నాశన ముచేయవా? ఎవరిని మిగులకుండ మమ్మందరిని మట్టుపెట్టవా?
15. యిస్రాయేలు దేవుడవైన ప్రభూ! నీవు న్యాయవంతుడవు కనుకనే నేడు మాలో కొంద రము ఇంకనుబ్రతికిబట్టగ్టియున్నాము. చిత్తగించుము! నీ యెదుట మా పాపములను ఒప్పుకొనుచున్నాము. పాపులమైన మాకు నీ యెదుట నిలుచుటక్టిె యోగ్య తలేదు” అని ప్రార్ధించితిని.