అన్యజాతి వివాహములను రద్దుపరచుటకు పథకము

10 1. ఈ రీతిగా ఎజ్రా దేవాలయము ముందట నేలమీదికివంగి దిగులుతో, పశ్చాత్తాపముతో ప్రార్ధన చేయుచుండగా యిస్రాయేలు ప్రజలు, పురుషులు-స్త్రీలు, చిన్న పిల్లలందరును అతని యెదుట ప్రోగైరి. ఎజ్రాను చూచి వారు కూడ వెక్కివెక్కి యేడ్చిరి.

2. అపుడు ఏలాము కుమారులలో ఒకడగు యహీయేలు కుమారుడైన షెకన్యా, ఎజ్రాతో ”మేము అన్యజాతి స్త్రీలను పరిణయమాడి యావేకు ద్రోహము చేసితిమి. అయినను ఈ తప్పును సవరించుకొను మార్గము కలదు. 3. ఇపుడు ఈ పరజాతి స్త్రీలను వారికి కలిగిన సంతానమును వదలివేయుదుమని యిస్రాయేలు దేవునియెదుట ప్రమాణము చేయుదుము. మేమెల్ల రము నీవును, దేవుని ఆజ్ఞలు భయభక్తులతో పాించు పెద్దలును కోరినట్లే చేయుదుము. అందరము యావే ఆజ్ఞలకు బద్ధులమైయుందుము.

4. ఈ వివాహము లను చక్కదిద్దుట నీ బాధ్యత. మేము నీతో సహక రింతుము. నీవు మాత్రము ధైర్యముతో కార్యనిర్వ హణకు పూనుకొనుము” అనెను.

5. అంతట ఎజ్రా లేచి ప్రధానయాజకుల చేతను, లేవీయులచేతను, యిస్రాయేలీయులందరిచేతను ఆ మాట ప్రకారముగ చేయునట్లుగా వారిచేత ప్రమాణము చేయించెను.

6. అటు తరువాత అతడు దేవాలయము ముంది నుండి వెడలిపోయి యెల్యాషిబుకుమారుడైన యోహానాను ఇల్లు చేరుకొనెను. యిస్రాయేలీయుల ద్రోహమునకు వగచుచు ఆ రాత్రి అచటనే గడిపెను. అతడు అన్న పానీయములు గూడ ముట్టుకోలేదు.

7. ప్రవాసమునుండి వచ్చిన నిర్వాసితులందరు యెరూషలేమున ప్రోగుకావలెననియు యూదా యెరూషలేము మండలములలో ప్రకటన చేయించిరి.

8. మూడురోజులలో ప్రోగుకానివారి ఆస్తి దేవుని ఆలయమునకు ప్రతిష్ఠింపబడుననియు, వారు విడుద లైన యిస్రాయేలు సమాజమునుండి బహిష్కరింప బడుదురనియు, అది పెద్దల ఆజ్ఞయని చాింపు వేయించిరి.

9. ఆ చాింపు విని యూదా, బెన్యామీను మండలములలో వసించు యూదులందరును మూడు నాళ్ళలో యెరూషలేము దేవాలయము ముంది మైదానమున ప్రోగైరి. అది తొమ్మిదవనెల ఇరువది యవనాడు. ఆ రోజు ఒకవైపు కుండపోతగా వాన కురియుచున్నందున, మరియొకవైపు వివాహముల సమస్య వచ్చినందున ప్రజలందరును గడగడ వణకు చుండిరి.

10. అప్పుడు యాజకుడైన ఎజ్రా లేచి ప్రజలతో ”మీరు అన్యజాతి స్త్రీలను పెండ్లియాడి ప్రభువునకు ద్రోహము చేసితిరి.

11. యిస్రాయేలీయులకు పాపము మూట గ్టితిరి. కనుక ఇప్పుడు మీ పితరుల దేవు డునైన ప్రభువు ఎదుట మీ అపరాధమును ఒప్పు కొనుడు. ఆ ప్రభువు చిత్తము చొప్పున నడచుకొనుడు. మన నేలమీద వసించు అన్యదేశీయుల నుండి వైదొల గుడు. అన్యజాతి భార్యలను వదలివేయుడు” అని పలికెను.

12. అక్కడ గుమిగూడిన ప్రజలు మేమెల్లరము నీవు చెప్పినట్లే చేయుదుమని అరచిరి.

13. వారు ఇంకను ఇట్లనిరి. ”అయ్యా! ఇక్కడ చాలమంది ప్రజలు ప్రోగై యున్నారు. మింకిమింకి ఏకధారగా వర్షము కురియుచున్నది. మేము ఈ వానలో వెలుపల నిలిచి యుండజాలము. ఇది ఒకి రెండు రోజులలో తెగు సమస్యకాదు. ఈ పాపమును కట్టుకొనినవారు చాల మంది యున్నారు.

14. మా పెద్దలు యెరూషలేము ననేయుండి ఈ నేరమును చక్కదిద్దుదురు. ఆయా నగరముల నుండి అన్యజాతి భార్యలుగల యిస్రాయేలీ యు లందరు వారివారి పెద్దలతోను, న్యాయాధిపతు లతోను నియమితదినమున ఇక్కడికి వత్తురు. ఇట్లు చేసినచో మనపై రగుల్కొనిన ప్రభువు కోపము చల్లా రును” అనిరి.

15. ప్రజలెల్లరు ఆ సలహాను అంగీ కరించిరి. అషాయేలు కుమారుడైన యోనాతాను, తిక్వా కుమారుడైన యహస్యా మాత్రము ఆ సూచనను అంగీకరింపలేదు. మెషూల్లాము, లేవీయుడైన షబ్బెతయి ఇద్దరు ఈ యిరువురికి మద్దతునిచ్చిరి.

16. ప్రవాసమునుండి వచ్చిన నిర్వాసితులందరు పై సూచన నంగీకరించిరి కనుక ఎజ్రా ఆయా వంశాధి కారులైన పెద్దలను పూటకాపులుగా నియమించి వారి పేరులు నమోదు చేసెను. ఆ పెద్దలు పదియవనెల మొదిదినమున తమ విచారణను ప్రారంభించిరి.

17. మొదినెల మొదిరోజుకు అనగా మూడు నెలలలో వారు అన్యజాతి భార్యలు కలవారినందరిని ప్టివేసిరి.

18. అన్యజాతి భార్యలు కలవారి జాబితా ఇది: యాజకులు వంశముల వారిగా వీరు: యెసాదాకు కుమారులు యేషూవ, మరియు అతని సోదరుల వంశమునుండి మాసేయా, ఎలియెజెరు, యారీబు, గెదల్యా.

19. వారు తమ భార్యలను విడనాడుదుమని ప్రమాణముచేసి వారి అపరాధమునుబ్టి ఒక పొట్టే లును అర్పించిరి.

20. ఇమ్మేరు వంశమునుండి హనానీ, సెబద్యా.

21. హారిము వంశమునుండి మాసెయా, ఏలియా, షెమయా, యెహీయేలు, ఉజ్జీయా.

22. పషూరు వంశమునుండి యెల్యోయేనయి, మాసెయా, యిష్మాయేలు, నెతనేలు, యోసాబాదు, ఎలాసా.

23. లేవీయులు వీరు: యోసాబాదు, షిమీ, కెలితా అనుపేరుగల కెలయా, పెతహియా, యూదా, ఎలియెజెరు.

24.  గాయకుడు ఎల్యాషీబు, దేవాలయ ద్వారపాలకులు షల్లూము, తేలెము, ఊరి. 

25.  యిస్రాయేలు ప్రజ వీరు: పరోషు వంశమునుండి రమ్యా, ఇజ్జీయా, మల్కియా, మీయామిను, ఎలియెజెరు, హషబియా, బెనాయా.

26.  ఏలాము వంశమునుండి మత్తన్యా, జెకర్యా, యెహీయేలు, అబ్ది, యెరెమోతు, ఏలియా.

27.  సత్తు వంశమునుండి ఎల్యోయేనయి, ఎల్యాషిబు, మత్తన్యా, యెరెమోతు, సాబాదు, అసీసా.

28.  బేబై వంశమునుండి యోహానాను, హనన్యా, సబ్బయి, అత్లాయి.

29. బానీ వంశమునుండి మెషుల్లూము, మల్లూఖ, అదయా, యాషూబు, షెయాలు, యెరెమోతు.

30. పహత్మోవబు వంశమునుండి అద్నా, కేలాలు, బెనాయా, మాసేయా, మత్తన్యా, బెసలేలు, బిన్నుయి, మనష్షే.

31-32. హారిము వంశమునుండి ఎలియెజెరు, ఇష్షీయ, మల్కీయా, షమయా, షిమ్యోను, బెన్యామీను, మల్లూకు, షెమర్యా.

33. హాషుము వంశమునుండి మత్తెనయి, సాబాదు, ఎలీఫేలెటు, ఎరెమాయి, మనష్షే, షిమెయి

34-37. బానీ వంశమునుండి మాదయి, అమ్రాము, ఊయేలు, బెనాయా, బెద్యా, కెలూహి, వన్యా, మెరేమోతు, ఎల్యాషీబు, మత్తన్యా, మత్తెనయి, యాశు.

38-42. బిన్నుయి వంశమునుండి షిమీ, షెలెమ్యా, నాతాను, అదాయా, మక్నద్బయి, షాషై, షారాయి, అసరేలు, షెలెమ్యా, షెమర్యా, షల్లూము, అమర్యా, యోసేపు.

43. నేబో వంశమునుండి యెయియేలు, మతిత్యా, సాబాదు, సెబీనా, యద్దయి, యోవేలు, బెనయా.

44. పైన పేర్కొనిన వారందరికి అన్యజాతి భార్యలు కలరు. వారు ఆ స్త్రీలను, వారికి కలిగిన సంతానమును పరిత్యజించిరి.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము