ప్రవాసమునుండి తిరిగివచ్చిన యాజకులు, లేవీయులు

12 1. షల్తియేలు కుమారుడైన సెరుబ్బాబెలుతో, ప్రధానయాజకుడు యోషూవతో ప్రవాసమునుండి తిరిగివచ్చిన యాజకులు, లేవీయులు వీరు:

2-7. సెరాయా, యిర్మియా, ఎజ్రా, అమర్యా, మల్లూకు, హట్టూషు, షెకన్యా, రెహూము, మెరెమోతు, ఇద్దో, గెన్నెతోయి, అబీయా, మియామీను, మాద్యా, బిల్గా, షెమయా, యోయారీబు, యెదయా, సల్లూ, ఆమోకు, హిల్కీయా, యెదాయా. యోషూవ కాలమున వీరెల్లరు యాజకులకు పెద్దలు.

8.           లేవీయులలో ఈ క్రిందివారు కృతజ్ఞతాస్తుతులు పాడెడివారు:

               యేషూవ, బిన్నుయి, కద్మీయేలు, షేరెబ్యా, యూదా, మత్తన్యా.

9.           ఈ క్రిందివారు పాటలకు వంతలు పాడెడివారు.

               బక్బుక్యా, ఉన్నో మరియు వారి తోడివారు.

వీరు గాయక బృందమునకు ఎదురు వరుసలో నిలుచుండెడివారు.

ప్రధానయాజకుడు యోషూవ సంతతివారు

10. యేషూవా కుమారుడు యోయాకీము. అతని కుమారుడు ఎల్యాషిబు, అతని కుమారుడు యోయాదా.

11. యోయాదా పుత్రుడు యోనాతాను, అతని కుమారుడు యద్దూవ.

యాజకుల పెద్దలు

12-21. యోయాకీము ప్రధాన యాజకుడుగా నున్న కాలమున ఈ క్రింది వారు యాజకుల వంశములకు పెద్దలుగా నుండిరి:

సెరాయా ఇంివారికి మెరాయా,

యిర్మీయా ఇంివారికి హనన్యా,

ఎజ్రా ఇంివారికి మెషుల్లాము,

అమర్యా ఇంివారికి యెహోహానాను,

మల్లూకి ఇంివారికి యోనాతాను,

షెబన్యా ఇంివారికి యోసేపు,

హారిము ఇంివారికి ఆద్నా,

మెరాయోతు ఇంివారికి హెల్కాయి,                         

ఇద్దో ఇంివారికి జెకర్యా,

గిన్నెతోను ఇంివారికి మెషుల్లాము,

అబీయా ఇంివారికి సిక్రీ,

మిన్యామీను ఇంివారికి       మరియు

మోవద్యా ఇంివారికి పిల్టాయి,                                     

బిల్గా ఇంివారికి షమ్మువ,

షెమయా ఇంివారికి యెహోనాతాను,                     

యోయారీబు     ఇంివారికి మత్తెనాయి,                    

యెదాయా ఇంివారికి ఉజ్జీ,

సల్లాయి ఇంివారికి కల్లాయి,

ఆమోకు ఇంివారికి ఏబేరు,                                          

హిల్కీయా ఇంివారికి హషబ్యా,

యెదాయా ఇంివారికి నెతనేలు.

యాజకుల,  లేవీయుల కుటుంబములు

22. ఈ క్రింది ప్రధానయాజకుల కాలమున యాజకుల కుటుంబములకు, లేవీయుల కుటుంబ ములకు పెద్దలుగానుండిన వారి జాబితాలను పదిల పరచియుంచిరి. వారు ఎల్యాషిబు, యోయాదా, యోహానాను, యద్దూవ. దర్యావేషురాజు పారశీక మునకు రాజుగ నున్నకాలమున ఈ జాబితా  వ్రాయుట ఆపివేసిరి.

23. ఎల్యాషిబు మునిమనుమడైన యోహానాను కాలమువరకు లేవీయుల కుటుంబములకు పెద్దలుగా నుండినవారి జాబితాలను దినవృత్తాంత ముల గ్రంథమున పదిలపరిచిరి.

గాయకులు, దేవాలయద్వారపాలకులు

24. హషబ్యా, షేరెబ్యా, యేషూవ, కద్మీయేలు వారి అనుయాయులు నాయకత్వమున లేవీయులను బృందములుగా విభజించిరి. దేవాలయమున ఒక్కొ క్కసారి రెండు బృందముల గాయకులు ప్రోగై స్తుతి గీతములను, వానికి వంతపాటలను పాడెడివారు. దైవభక్తుడు దావీదే  ఈ  నియమము  చేసిపోయెను.

25. దేవాలయ ద్వారమునొద్దనున్న వివిధ వస్తుభాండాగారములకు కాపుండిన దేవాలయ       ద్వారాపాలకులు వీరు: మత్తన్యా, బక్బూక్యా, ఓబద్యా, మెషుల్లాము, తల్మోను, అక్కూబు.

26. పైన పేర్కొనిన వారందరు యోసాదాకు మనుమడును యేషూవ కుమారుడైన ప్రధానయాజ కుడు యోయాకీమునకు, అధికారి అయిన నెహెమ్యాకు, యాజకుడును, ధర్మశాస్త్ర పండితుడునైౖన ఎజ్రాకు సమకాలికులు.

ప్రాకారమును ప్రతిష్ఠించుట

27. యెరూషలేము నగర ప్రాకారమునకు ప్రతిష్ఠ చేసినపుడు నానా స్థలములనుండి లేవీయులను పిలువనంపిరి. ఆ సమయమున కృతజ్ఞతాస్తుతులతో, స్వరమండలము, చితాళము, పిల్లనగ్రోవి మొదలగు వాద్యములతో హృదయానందముగా ఉత్సవము చేసి కోవలెనని సంకల్పించుకొనిరి.

28-29. యెరూషలేము చుట్టుపట్లనున్న నగరములనుండి, నెోఫానగరము చుట్టుపట్టులనుండి, బేతు, గిల్గాలు, గేబా, అస్మావేతు పట్టణములనుండి లేవీయ గాయకులు వచ్చిచేరిరి. వారెల్లరు యెరూషలేమునకు చేరువలోని పట్టణముల వారే.

30. లేవీయులు, యాజకులు తమ్ముతాము శుద్ధిచేసికొనిరి. ప్రజలను, ప్రాకారమును, దాని ద్వారములను గూడ శుద్ధిచేసిరి.

31. నేను యూదా పెద్దలను గోడమీద సమావేశ పరచితిని. వారిని రెండు గాయక బృందములుగా విభజించితిని. మొది బృందము గోడమీద కుడివైపు నడచి పేడద్వారము వైపు వెళ్ళెను. 

32. వారి వెనుక హోషయా అతనితోపాటు సగముమంది యూదియా నాయకులు నడచిరి.

33-35. అసర్యా, ఎజ్రా, మెషుల్లాము, యూదా, బెన్యామీను, షెమయా, యిర్మీయా అనువారు వెళ్ళిరి. యాజకుల కుమా రులలో కొందరు బాకాలూదుచు వారి వెనుక వెళ్ళిరి. వారెవరనగా, షెమయా మనుమడును యోనాతాను కుమారుడునగు జెకర్యా నడచెను. మత్తన్యా, మీకాయా, సక్కూరు, ఆసాపు ఈ జెకర్యాకు మూలపురుషులు.

36. జెకర్యా వెనుక అతని ఇంికి చెందిన యాజకులు షెమయా, అసరేలు, మిలాలయి, గిలాలయి, మాయి, నెతనేలు, యూదా, హనానీ వచ్చిరి. వారెల్లరు పూర్వము దైవభక్తుడైన దావీదు వాడిన సంగీత వాద్యములవిం వాద్యములు కొనివచ్చిరి. ధర్మశాస్త్ర బోధకుడగు ఎజ్రా ఈ మొది బృంద మునకు ముందు నడచెను.

37. వారు జలధార ద్వారమునొద్ద మెట్లెక్కి దావీదు నగరమున ప్రవేశించి ఆ రాజుప్రాసాదము ప్రక్కగా నడచిరి. పిమ్మట జల ద్వారమునొద్ద నగరమునకు తూర్పువైపున మరల ప్రాకారమును చేరుకొనిరి.

38. రెండవ బృందము గోడమీద ఎడమ వైపుగా నడచివెళ్ళెను. నేను వారిననుసరించితిని. మేము కొలిమిప్రాకారము మీదుగా పోయి మైదానపుగోడను చేరితిమి.

39. అచట ఎఫ్రాయీము, మేషనా, మత్స్య ద్వారమును దాితిమి. హననేలు బురుజును, మేయా బురుజును, గొఱ్ఱెల ద్వారమును చేరితిమి. కడకు గస్తీద్వారము చేరుకొింమి.

40-41. ఈ రీతిగా రెండు బృందములు దేవాలయము చేరెను. మాతోనున్న సగముమంది పెద్దలు మాత్రమేకాక ఈ క్రింది యాజకులు బాకాలూదుచు మావెంట వచ్చిరి: ఎల్యాకీము, మాసెయా, మిన్యామీను, మీకాయా, ఎల్యోయేనయి, జెకర్యా, హనన్యా.

42. ఈ క్రింది గాయకులు ఎస్రహయా నాయకత్వమున పాటలు పాడుచు మా వెంట వచ్చిరి: మాసెయా, షెమయా, ఎలియెజెరు, ఉజ్జీ, యెహోహానాను, మల్కీయా, ఏలాము, ఏసేరు.

43. ఆ దినము ప్రజలు చాలా బలులు సమర్పించిరి. ప్రభువు ప్రజలను సంతోషచిత్తులను చేయగా వారు మిక్కిలి ఆనందించిరి. స్త్రీలు, పిల్లలుకూడ ఉత్సవ మున పాల్గొనిరి. ఆ ప్రజల ఉత్సాహ నినాదములు చాలదూరమువరకు విన్పించెను.

44. దేవాలయమునకర్పించెడు ధాన్యము, ఫల ములు, పండిన పంటలో పదియవవంతు, మరియు ఇతర వస్తువులు భద్రముచేయు భాండాగారమునకు పర్యవేక్షకులను నియమించితిని. ధర్మశాస్త్రవిధి ప్రకా రము యాజకులకొరకు, లేవీయులకొరకు, ఆయా నగరములకు చెందిన పొలములనుండి ధాన్యాదులు సేకరించుట ఈ పర్యవేక్షకుల పని. యాజకులు లేవీయులు సంతృప్తికరముగా పనిచేసి యూదీయుల మన్నన పొందిరి.

45. దైవారాధనను, శుద్ధీకరణను నిర్వర్తించినది వారే. దావీదు అతని కుమారుడు సొలోమోను విధించినట్లుగనే గాయకులు, దేవాలయ ద్వారపాల కులు తమతమ విధులను పాించిరి.

46. దావీదు కాలము నుండి ఆసాపునాినుండి గాయకులు బృందములుగా గూడి ప్రభుని స్తుతించి గానము చేయుచుండిరి.

47. సెరుబ్బాబెలు కాలమున, నెహెమ్యా కాలమున గాయకులకొరకు, దేవాలయ ద్వారపాలకుల కొరకు యిస్రాయేలీయులందరు ప్రతిరోజు భోజన పదార్ధములు ఇచ్చిరి. ప్రజలు లేవీయులకు కానుకలీయగా, లేవీయులు వానినుండి యాజకులవంతు యాజకులకు పంచియిచ్చెడివారు.

Previous                                                                                                                                                                                                    Next