ఉపోద్ఘాతము:

పేరు: కతోలిక బైబులులో పూర్వనిబంధనములో నున్న ఏడు గ్రంథములను ఖిలితిశిలిజీళి  బీబిదీళిదీరిబీబిజి   లేక బిచీళిబీజీగిచీనీబిజి ఔంంచఐ  అందురు.   హీబ్రూ బైబులు ఈ గ్రంథములను అంగీకరించదు. (దీని వివరములను పూర్వనిబంధన ఉపోద్ఘాతములో చూడగలరు). వాిలో నొకి తోబీతు గ్రంథము. గ్రంథములో ప్రధాన వ్యక్తి తోబీతు కాబ్టి ఈ పేరుతోనే గ్రంథము పిలువబడినది.  తోబీతు నఫ్తాలి తెగకు చెందినవాడు. వీరి కుటుంబము అస్సిరియాకు బందీగా వలస వెళ్ళినది. తోబీతు భార్య పేరు అన్నా, అతని కుమారుడు తోబియా. తోబీతు అనునది గ్రీకుపదము. దాని అర్ధము ”యావే నా దేవుడు”.

కాలము: ఇదమిత్తముగా చెప్పలేము. ఈ వృత్తాంతము క్రీ.పూ. 8-7 శతాబ్దాలలోనిదై వుండవచ్చును. ఈ గ్రంథమును క్రీ.పూ. 200-180 మధ్య వ్రాసి వుండవచ్చునని భావించబడుచున్నది. 

చారిత్రక నేపథ్యము:  తోబీతు అను ఒక దైవభక్తుడు, ధనవంతుడు  క్రీ.పూ. 721లో ఉత్తర యిస్రాయేలు రాజ్యము నుండి నీనెవె నగరానికి బందీలుగా వలస వెళ్ళిన వారిలో ఒకడు.  ఇతను అనేక కష్టాలను ఎదుర్కొని చివరికి అంధుడయ్యాడు.  తన దురదృష్టాల కారణముగా తనను మరణించనీయుమని దేవునికి మొరపెట్టుకున్నాడు. దూరప్రాంతము మాదియాలో తాను దాచిప్టిెన ధనమును తీసుకురమ్మని తన కుమారుడు తోబియాను పంపాడు.  మాదియాలో అదే సమయములో అస్మొదియసు అను దుష్టాత్మచే ఏడుగురు భర్తలను కోల్పోయిన సారా అనే వితంతువు మరణము కొరకు ప్రార్థించెడిది.  చివరికు దేవుని అనుగ్రహము వలన సారా, తోబియాలకు వివాహము జరిగి కథ సుఖాంతమవుతుంది. నీనెవె పట్టణము నాశనము చేయబడిన సంఘటన నుండి వీరిద్దరు తప్పించుకుాంరు.

ముఖ్యాంశములు: గ్రీకు సంస్క ృతి ప్రభావము వలన యూదులు ఒత్తిళ్ళకు, హింసలకు గురై నిరాశపడిన సమయములలో వారిని ఓదార్చి, అన్యభాష, తత్త్వాలను యూదులకు అనుకూలంగా మలచుకోడానికి లేదా వాికి బానిసలు కాకుండ దేవునికి విశ్వసనీయులుగా నుండడానికి ఈ గ్రంథము దోహదపడినది. కష్టాలలోనున్నప్పుడు కూడా దానధర్మాలతో, నీతి ప్రవర్తనలతో దేవునికి ప్రీతిపాత్రులు కాగలమని ఈ గ్రంథము తెలుపును. తల్లిదండ్రులకు విధేయతతో విశ్వాసపాత్రులుగా నుండడము ఉత్తమగుణమని స్పష్టము చేయును. దుష్టాత్మ, పరిశుద్ధాత్మ అనే ఆత్మల గూర్చి చర్చిస్తుంది.

క్రీస్తుకు అన్వయము: మానవుని పూర్వాపరాలకన్నను వాని వ్యక్తిత్వము, నడవడిక వానికి ఔన్నత్యాన్ని సంపాదిస్తాయి. క్రీస్తు మనిషి హృదయాంతరంగాన్ని గుర్తించి, ప్రశంసిస్తారు.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము