మత్స్యము
6 1. తోబియా దేవదూతతో పయనమయ్యెను. అతని కుక్కగూడ అతని వెంటపోయెను. వారు మునిమాపు వరకు నడకసాగించి ిగ్రిసు నదీతీరమున విడిదిచేసిరి.
2. తోబియా కాళ్ళు కడుగుకొనుటకు ఏిలోనికి దిగెను. వెంటనే పెద్ద చేపయొకి నీిలోనుండి దుమికి వచ్చి అతని పాదమును పట్టుకోబోయెను. దానిని చూచి ఆ కుఱ్ఱడు పెద్దగా కేకపెట్టెను.
3. దేవదూత అతనితో ”ఓయి! ఆ మత్స్యమును పట్టుకొనుము, జారిపోనీ యకుము” అనెను. తోబియా ఆ మీనమును పట్టుకొని ఒడ్డుకు లాగెను.
4. దేవదూత ”చేప కడుపును చీల్చి దాని పిత్తమును, కాలేయమును, గుండెను తీసి నీ యొద్ద ఉంచుకొనుము. దాని ప్రేవులను మాత్రము అవతల పారవేయుము” అని చెప్పెను. 5. తోబియా దేవదూత చెప్పినట్లే చేసెను. అతడు చేపలో కొంతభాగ మును కాల్చి భుజించెను. మరి కొంతభాగమును ఉప్పులో ఊరవేసెను. తరువాత వారిరువురు ప్రయాణము సాగించి మాదియా దరిదాపులలోనికి వచ్చిరి.
6. ఆ యువకుడు దేవదూతను చూచి ”నేస్తమా! అసరయా! చేపపిత్తము, కాలేయము, గుండెలతో ఏఏ రోగములను కుదుర్పవచ్చును?” అని అడిగెను.
7. అతడు చేపగుండెను, కాలేయమును కాల్చి పొగ వేసినచో నరులను ప్టిపీడించు భూతముగాని, పిశాచ ముగాని పారిపోవును. ఆ నరులకు మరల పిశాచబాధ సోకదు.
8. పిత్తమును తెల్లనిపొరలు కమ్మినవారి కన్నులకు లేపనముగా ఉపయోగింపవచ్చును. దానిని కింపొరలమీద పూసి వానిమీద ఊదిన చాలు, పొరలు తొలగిపోవును” అని చెప్పెను.
9. వారిరువురు మాదియా దేశమున ప్రవేశించి ఎక్బానా నగరమును సమీపించిరి.
10. అప్పుడు దేవదూత తోబియాను పేరెత్తి పిలువగా అతడు ”చెప్పుము నేను వినుచున్నాను” అనెను. దేవదూత ”నేి రాత్రి మనము నీ బంధువైన రగూవేలు ఇంట బస చేయవలెను. అతనికి సారా అను కుమార్తె కలదు. ఆమె తప్ప అతనికి ఇతర సంతానము లేదు.
11. ఆ కన్య నీకు దగ్గరిచుట్టము కనుక అందరికంటెగూడ అదనముగా నీకు ఆమెను పెండ్లియాడు హక్కు కలదు. ఆమె తండ్రి ఆస్తియును నీకే దక్కును.
12. ఆ యువతి తెలివి కలది, ధైర్యము కలది, చక్కనిది కూడ. సారా తండ్రి చాల మంచివాడు. ఈ రాత్రియే నేనతనితో సారా వివాహముగూర్చి మ్లాడుదును. ఆమెను నీకు ప్రధానము చేయింతును. మనము రాగీసునుండి తిరిగివచ్చునపుడు నీవు ఆ బాలికను వివాహమాడ వచ్చును. రగూవేలు నీ వేడికోలును త్రోసిపుచ్చి కూతు రును మరియొకరికి ఈయజాలడు. అట్లు చేసినచో మోషే ధర్మశాస్త్రము ప్రకారము అతడు చంపదగిన వాడగును. చుట్టరికముబ్టి తన కుమార్తెను పరిణయ మాడుటకు నీకు ఎక్కువ అర్హతకలదని అతనికి తెలియును. కనుక ఇప్పుడు నీవు నా మాట వినుము. ఈ రాత్రియే మేము వివాహవిషయమును ముచ్చ ించి సారాను నీకు ప్రధానము చేయింతుము. మనము రాగీసునుండి తిరిగివచ్చునపుడు ఆమెను మనతో ఇంికి తీసికొనిపోవచ్చును” అనెను.
13. తోబియా రఫాయేలుతో ”నేస్తమా! ఆ యువ తిని ఇదివరకే వరుసగా ఏడుగురు వరులకిచ్చి పెండ్లి చేసిరి. వారిలో ప్రతివాడు మొదిరేయినే శోభనపు గదిలోనే చచ్చెను. ఈ సంగతులెల్ల నాకు తెలియును.
14. ఆమెను ప్టియున్న భూతమే ఆ వరులను సంహరించెననియు వింని. ఆ భూతము సారా క్టిె హానియు చేయదట. ఆమెను సమీపించు పురుషులను మాత్రము ప్టి చంపునట. నా మట్టుకు నాకు ఆ పిశాచమనిన భయముగా ఉన్నది. మా తండ్రికి నేనొక్కడనే కుమారుడను. చావవలెనను కోరిక నాకు లేదు. నేను చనిపోయినచో మా తల్లిదండ్రులు దిగులుతో సమాధి చేరుకొందురు. అప్పుడు వారిని పాతిపెట్టు దిక్కు కూడ ఉండదు” అనెను.
15. దేవదూత ”ఓయి! నీవింతలోనే మీ తండ్రి ఉపదేశమును మరచితివా? అతడు నీవు మీతెగ నుండే వధువును ఎన్నుకోవలెనని చెప్పలేదా? కనుక ఇప్పుడు నా మాట వినుము. ఆ భూతమును తలచు కొని భయపడకుము. సారాను స్వీకరింపుము. ఈ రాత్రియే రగూవేలు ఆ యువతిని నీకు ప్రధానము చేయును.
16. నీవు ఆమెతో పడుక గదిలోనికి పోయి నపుడు చేపగుండెను, కాలేయమును తీసికొని కాలుచున్న సాంబ్రాణి మీద వేయుము.
17. వెంటనే గది అంతట వాసన వ్యాపించును. ఆ వాసనకు భూతము పారి పోవును. అది మరల సారా చెంతకురాదు. నీవు ఆ యువతిని కూడకముందే మీరిరువురు లేచి నిలు చుండి దేవుని ప్రార్థింపుడు. ఆకాశములోని దేవుడు మిమ్ము చల్లనిచూపు చూచి భూతముపీడనుండి కాపాడ వలెనని మనవిచేయుడు. నీవేమాత్రము భయపడ వలదు. సృష్ట్యాదినుండి సారా నీకు వధువుగా నిర్ణ యింపబడినది. ఆమె నీ వెంట మీ ఇంికి వచ్చును. మీకు బిడ్డలు కలుగుదురు. వారిని నీవు అనురాగ ముతో చూచుకొందువు. నా మాట నమ్ముము” అని పలికెను.
తోబియా రఫాయేలు చెప్పిన మాటలు వినెను. తండ్రి వైపున సారా తనకు చుట్టమని గ్రహించెను. అతడు సారాను గాఢముగా ప్రేమించి తన హృదయ మును ఆమెకు అర్పించెను.