వివాహమహోత్సవము

9 1. అటు తరువాత తోబియా రఫాయేలును పిలిచి 2. ”నేస్తమా! నీవు నలుగురు సేవకులను ంండు ఒంటెలను వెంటబెట్టుకొని రాగీసునందలి గబాయేలు ఇంికి పొమ్ము.

3. అతనికి ఈ చేవ్రాలు కల పత్రము చూపి సొమ్మునడుగుము. అతనిని కూడ నీ వెంట వివాహమహోత్సవమునకు తోడ్కొనిరమ్ము.

4. మా నాయన నా కొరకై రోజులు లెక్కపెట్టుకొనుచుండునని నీకు తెలియును. నేను ఒక్క రోజు జాగుచేసిన  అతడు మిగుల దుఃఖించును.

5. మా మామ రగూవేలు నన్నిక్కడ ఇన్నినాళ్ళు ఉండుమని నిర్బంధము చేసెను. అతని మాట నేను కాదనలేకపోతిని” అని చెప్పెను.

6. కనుక రఫాయేలు నలుగురు సేవకులను రెండు ఒంటెలను వెంటనిడుకొని మాదియా దేశములోని రాగీసునకు వెళ్ళెను. దేవదూత గబాయేలు ఇంటనే బసచేసి అతనికి చేవ్రాలుగల పత్రమును చూపించెను. తోబీతు కుమారుడు తోబియా పెండ్లిసంగతి చెప్పి అతనిని వివాహమహోత్సవమునకు ఆహ్వానించెను. వెంటనే గబాయేలు వెండినాణెముల సంచులను లెక్కప్టిె యిచ్చెను. అప్పివరకు వానికి వేసిన ముద్రలు కూడ ఊడిపోలేదు. ఆ సంచులను ఒంటెలమీదికి ఎక్కించిరి. వారు మరుసిదినము వేకువనే  పెండ్లిపండుగకు పయనము క్టిరి. ఆ మిత్రులు రగూవేలు ఇల్లు చేరుకొనునప్పికి తోబియా భోజనము చేయుచుండెను. అతడు లేచి నిలుచుండి గబాయేలునకు స్వాగతము చెప్పెను. గబాయేలు ఆనందభాష్పములు రాల్చుచు తోబీయాను ఇట్లు దీవించెను: ”నాయనా! మీ తండ్రి ధర్మాత్ముడు, ఉదారస్వభావుడు. నీవు ఆ తండ్రికి తగిన కుమారుడవే. ఆకాశమునందలి దేవుడు నిన్ను, నీ ఇల్లాలిని, నీ అత్తమామలను దీవించుగాక! అచ్చముగా నా దాయాది తోబీతువలెనున్న నిన్ను కన్నులారా చూచు భాగ్యమును దేవుడు నాకు దయచేసెను. ఆ ప్రభువునకు కీర్తి కలుగునుగాక!”