యూదితు మొదిసారి హోలోఫెర్నెసును కలిసికొనుట

11 1. హోలోఫెర్నెసు యూదితుతో ”ఓ స్త్రీ! ధైర్యము వహింపుము. నన్ను చూచి భయపడవలదు. లోకాధి పతియైన నెబుకద్నెసరునకు సేవలుచేయువారినెవరిని నేను ఏనాడును శిక్షించి ఎరుగను.

2. ఇప్పుడైనను కొండలలో వసించు మీ ఈ జాతివారు నన్ను చులకన చేసియుండరేని నేను వారిమీద పోరుతలప్టిెయుండను. వారు తమను కట్టు త్రాళ్ళు తామే తెచ్చుకొనిరి.

3. కాని నీవిప్పుడు వారిని విడనాడి మా యొద్దకేల వచ్చి తివి? ఇచికి వచ్చుట వలన నీ ప్రాణములు దక్కించు కొింవి. ఇక భయపడకుము. ఈ రాత్రికి మేము నిన్ను కాపాడుదుము. ఇకమీదటను నీక్టిె హాని కలు గదు.

4. ఇచట నీకెవరును కీడుచేయరు. మా ప్రభువైన నెబుకద్నెసరు దాసులు అందరికి వలె నీకును గౌరవా దరములు లభించును” అనెను.

5. యూదితు అతనితో ”ఏలినవారు నేను మ్లా డుటకు సెలవు దయచేయుడు. తమరీ దాసురాలి పలుకులాలింపుడు. నేన్టెి అబద్ధములను చెప్పను.

6. తమరు ఈ దాసురాలి సలహాను పాింతురేని దేవుడు మీద్వారా ఒక మహత్తరకార్యమును సాధించు ను. అప్పుడు ప్రభువు తలప్టిెన పనినెరవేరును.

7.నేను లోకాధిపతియైన నెబుకద్నెసరురాజు ప్రాణము మీద, బలముమీద ప్రమాణము చేసి చెప్పుచున్నాను. సమస్త ప్రజలను అదుపులోనికి తెచ్చుటకు ఆ ప్రభువు మిమ్ము పంపెను. మీ పరాక్రమమువలన ఒక్క నరులే కాదు, వన్యమృగములును, పెంపుడుజంతువులును, పకక్షులునుగూడ ఆ రాజుకు విధేయములు అగుచు న్నవి. మీ సామర్ధ్యము వలన ఆ రాజునకును, అతని సామ్రాజ్యమునకును అభ్యుదయము చేకూరుచున్నది.

8. మేమెల్లరము ఏలినవారి తెలివితేటలగూర్చివింమి. అస్సిరియా సైన్యమంతిలో సామర్ధ్యమునను, అను భవమునను, చాకచక్యమునను తమరిని మించిన సైన్యాధిపతిలేడని,  లోకమంతయు  ఎరుగును.

9. బెతూలియా ప్రజలు అకియోరు ప్రాణములు కాపా డిరి. అతడు తాను మీ మంత్రాలోచన సభలో ఏమి చెప్పినది మాకు ఎరిగించెను.

10. అయ్యా! అకియోరు చెప్పినది నిజమే. కనుక తమరతని మాటలను చులకన చేయరాదు. అతని సందేశము నమ్మదగినదే. మా ప్రజలు దేవుని ధిక్కరించి పాపము చేసిననే తప్ప ఎవరు వారిని శిక్షింపజాలరు, జయింపజాలరు.

11. అయినను ఇప్పుడు ఏలినవారికి ఎి్ట ఆటంకము గాని, అపజయముగాని కలుగబోదు. మా ప్రజలకిప్పుడు చావుమూడినది. వారు పాపమునకు లొంగిరి. పాపము చేసినపుడెల్ల వారు ప్రభువు కోపమును రెచ్చ గొట్టుదురు.

12. బెతూలియా ప్రజలు సేకరించి ఉంచుకొనిన ఆహారమంతయు అయిపోయినది. వారి నగరమున నీరుకూడ లేదు. ఇపుడా జనులు తమ పశువులమందలను చంపి తిననున్నారు. ఇంకను వారు ధర్మశాస్త్రము నిషేధించిన ఆహారమునుగూడ భుజింపనున్నారు.

13. వారు తమకు పండిన పంట నుండి పదియవ పాలుగా దేవునికర్పించిన గోధుమ లను, ద్రాక్షసారాయమును, ఓలివుతైలమును ఆరగింప నిశ్చయించుకొనిరి. కాని ఇవి పవిత్రమైన భోజన పదార్ధములు. యెరూషలే మున దేవునికి అర్చించు యాజకులు మాత్రమే వానిని భుజింపవచ్చును. సామాన్యజనులు వానిని ముట్టనైన ముట్టరాదు.

14. యెరూషలేము పౌరుల్టి నిషిద్ధవస్తువులను భుజింప మొదలిడిరి. కనుక మా పట్టణము వారును యెరూషలే మునకు దూతలనంపిరి. ఆ దూతలు అచి మహాసభ సభ్యులనుండి ఈ నిషిద్ధవస్తువులను భుజించుటకు అనుమతిని పొంది వత్తురు.

15. వారు తిరిగిరాగానే మా ప్రజలు ఈ వస్తువులను సేవింతురు. అట్లు సేవింపగానే వారెల్లరు మీ చేతికి చిక్కుదురు.

16. ఈ సంగతి తెలియగానే నేను మా జనుల నుండి పారిపోయివచ్చితిని. ఏలినవారి కొక ముఖ్య మైన పనిని చేసి పెట్టుటకు ప్రభువు నన్నిచటకు పంపెను. అది యేమియో తెలిసి కొనినపుడు లోకము లోని జనులెల్లరును విస్తుపోవుదురు.

17. తమ దాసినైన నేను భక్తు రాలను, ఆకాశాధిపతియైన దేవుని రేయింబ వళ్ళు సేవించుదానను. నేనిచటనే యేలినవారి శిబిర మున వసింపగోరెదను. నేను ప్రతిదినము రాత్రి వెలుపలిలోయలోనికి పోయి దేవుని ప్రార్ధించివత్తును. మా ప్రజలు పాపము కట్టుకొనగనే దేవుడు నాకు తెలియజేయును.

18. వారు పాపము చేయగనే నేను వచ్చి తమరికి విన్నవింతును. వెంటనే ప్రభువులవారు సర్వసైన్యముతో పోయి వారిమీద పడవచ్చును. అపుడు యిస్రాయేలీయులు మిమ్ము ఎదిరింపజాలరు.

19. నేను ఏలినవారిని యూదయా మండలముగుండ నడిపించుకొనిపోవుదును. మిమ్ము యెరూషలేమునకు కొనిపోయి ఆ నగర మధ్యమున రాజుగా అభిషే కింతును. అప్పుడు ప్రభువులవారు సొంత కాపరిని కోల్పోయిన గొఱ్ఱెలమందనువలె ఆ జనుల నెల్లరిని చెల్లాచెదరు చేయవచ్చును. ఇక ఒక్క కుక్కకూడ తమరిని చూచి మొరుగుటకు వీలుండదు. దేవుడు నాకీ సంగ తిని ముందుగనే తెలియజేసెను. ఇప్పుడు ప్రభువుల వారికి ఈ సమాచారమును అందించుటకుగాను ఆయన నన్నిటకు పంపెను” అని చెప్పెను.

20-21. హోలోఫెర్నెసు అతని సేవకులు యూదితు పలుకులను మెచ్చుకొనిరి. వారు ఆమె తెలివితేటలను మెచ్చుకొనుచు ఇంత అందగత్తె, ఇంత  మాటకారితనముకల మహిళ ప్రపంచమున ఎందైన గలదా అని ఒకరితో నొకరు చెప్పుకొనిరి.

22. హోలోఫెర్నెసు ఆమెతో ”మాకు విజయము చేకూర్చి పెట్టుటకును, మా ప్రభువైన నెబుకద్నెసరును ధిక్కరించినవారిని సర్వనాశనము చేయుటకును దేవుడు నిన్ను ముందుగా మా చెంతకు పంపెను.

23. నీవు అందగత్తెవు, నేర్పుతో మాటలాడగల దానవు కూడ. నీవు చెప్పినట్లే చేయుదువేని నేనును మీ దేవుని పూజింతును. నీ మట్టుకు నీవు నెబుకద్నెసరు రాణి వాసమున వసించుచు జగత్ప్రసిద్ధిని పొందవచ్చును” అనెను.