13 1. అంతట రాత్రి ప్రొద్దుపోవగా హోలోఫెర్నెసు బంటులెల్లరు వెళ్ళిపోయిరి. బగోవాసు సైన్యాధిపతి సమక్షమున మిగిలి యున్న వారినిగూడ పంపివేసి, వెలుపలి వైపు నుండి గుడారముల తలుపులు మూసివేసెను. విందు ముగియుటకు చాల తడవు ప్టినందున ఎల్లరును అలసిపోయియుండిరి. కావున సేవకులెల్లరు వెంటనే నిద్రింపబూనిరి.

2. గుడార మున యూదితు  ఒక్కతెయే  మిగిలియుండెను. హోలోఫెర్నెసు తప్పత్రాగి మత్తెక్కి పడుకమీద తూలి యుండెను. యూదితు దాసి తన యజమానురాలి కొరకు బయట వేచి యుండెను.

3. యూదితు తాను రోజు వెళ్ళినట్లే ఆనాడు గూడ ప్రార్ధనము చేసికొనుటకు వెలుపలికి వెళ్ళుదుననియు, తనకొరకు గుడారము పడకగది యొద్ద వేచియుండవలెననియు దాసితో చెప్పెను. వాడుక ప్రకారముగా ప్రార్ధన చేసికొనుటకు వెలుపలికి వెళ్ళుదునని ఆమె బగోవాసునకు గూడ చెప్పెను.

4-5. అప్పికే ఎల్లరు సర్వసైన్యాధిపతి గుడారము  నుండి  వెళ్ళిపోయిరి.  యూదితు హోలోఫెర్నెసు పడుకచెంత నిలుచుండి మౌనముగా ఇట్లు ప్రార్ధించెను:

”సర్వశక్తిమంతుడైన ప్రభూ!

యెరూషలేమునకు కీర్తికొనివచ్చుటకుగాను

నేను చేయనెంచినకార్యమును

సఫలము చేయుము. నాకు సాయముచేసి,

మా మీదికి దండెత్తివచ్చిన శత్రువులను

నాశనము చేసి, నీవెన్నుకొనిన ప్రజను

రక్షించుటకు ఇదియే తరుణము.”

6. అంతట ఆమె హోలోఫెర్నెసు తల ప్రక్కనున్న కొయ్యచెంతకు వెళ్ళి దానిమీద వ్రేలాడు ఖడ్గమును తీసికొనెను. 7. మంచము దగ్గరికి వచ్చి అతని తల వెండ్రుకలను గుప్పిట పట్టుకొని ”యిస్రాయేలు దేవుడ వైన ప్రభూ! నాకు బలమును దయచేయుము” అని ప్రార్ధించెను.

8. అటుపిమ్మట కత్తిఎత్తి రెండు మారులు బలముతో హోలోఫెర్నెసు గొంతును నఱుకగా అతని తలతెగిపోయెను.

9. ఆమె అతని మొండెమును పడుక మీదినుండి క్రిందికి దొర్లించెను. మంచపు కఱ్ఱలమీద వ్రేలాడు తెరను లాగితీసికొనెను.

10. పిమ్మట గుడా రము వెలుపలికివచ్చి శిరస్సును దాసిచేతికీయగా ఆమె దానిని ఆహారపదార్ధముల సంచిలో దాచెను. అంతట ఆ మహిళలు ఇరువురు ప్రార్ధనము చేసికొనుటకు పోవుచున్నట్లే నించి శిబిరమును వీడి వెలుపలికొచ్చిరి. పాళెమును దాి లోయగుండ కొంత దూరము నడచి కొండయెక్కి బెతూలియా నగరద్వారము చేరుకొనిరి.

యూదితు శత్రువు శిరస్సును కొనివచ్చుట

11. యూదితు దూరము నుండియే ద్వార సంర క్షకులను బిగ్గరగా పిలిచెను. ”కవాటము తెరవుడు. ప్రభువు మనలనింకను ఆదుకొనుచునే యున్నాడు. అతడు నేడు తన బలమును ప్రదర్శించి యిస్రాయేలు ను సంరక్షించెను. తన శక్తిని జూపి మన శత్రువులను హతమార్చెను” అని పలికెను.

12. ఆమె పలుకులాలించి పురజనులు నగరద్వారము చెంతకు పరుగెత్తుకొని వచ్చిరి. వారు పట్టణపుపెద్దలను పిలువనంపిరి.

13. పెద్దలనక, పిల్లలనక నగరములోని ప్రజలెల్లరును ద్వారము చెంతకు పరుగెత్తుకొని వచ్చిరి. యూదితు తిరిగి వచ్చినదని ఎవరు నమ్మజాలరైరి. ప్రజలు ద్వార ముతెరచి యూదితును ఆమె దాసిని ఆహ్వానించిరి. పెద్దమంటనువేసి ఆ ఇద్దరి చుట్టు గుమిగూడిరి.

14. అంతట యూదితు గొంతెత్తి ”ఎల్లరు ప్రభువును స్తుతింపుడు. ఆయన యిస్రాయేలీయులకు కనికరము చూపుట మానలేదు. ఈ రాత్రి ఆయన నా ద్వారా మన శత్రువులను నాశనము చేసెను” అని పలికెను.

15. అంతట ఆమె సంచిలో నుండి తలను వెలుపలికి తీసి ప్రజలెల్లరికి చూపుచు ”ఇది అస్సిరియా సైన్యాధి పతి హోలోఫెర్నెసు శిరస్సు. ఇది అతడు తప్పత్రాగి తూలిపోయిన పడుక మీది తెర. ప్రభువొక ఆడపడుచు చేత అతనిని మట్టుప్టిెంచెను.

16. ప్రభువు నేను తల ప్టిెన కార్యమున నన్ను సురక్షితముగా కాపాడెను. హోలోఫెర్నెసు నా అందమునకు భ్రమసి వినాశనము తెచ్చుకొనెను. మన దేవునితోడు అతడు నన్ను చెఱపను లేదు, నాకు కళంకము ఆపాదింపను లేదు” అని చెప్పెను.

17.  ఆ మాటలాలించి పౌరులెల్లరును విస్తు పోయిరి. వారుసాష్టాంగపడి ప్రభువును ఆరాధించి ఏకకంఠముతో ”ప్రభూ! నేడు నీవు మా శత్రువులను హతమార్చితివి. కనుక మేము నీకు వందనములు అర్పించుచున్నాము” అని పలికిరి.

18-20. అంతట ఉజ్జీయా యూదితుతో ఇట్లనెను:

కుమారీ! సర్వశక్తిమంతుడైన దేవుడు

నిన్ను లోకములోని స్త్రీలందరికంటె ఎక్కువగా

దీవించెను. భూమ్యా కాశములను సృజించిన

మన దేవుడు స్తుతించి కీర్తింపదగినవాడు.

ఆ ప్రభువు సహాయముతో నీవు,

శత్రునాయకుని తల తెగనరికితివి.

కనుక ప్రభువు మాహాత్మ్యమును వచించు

జనులు అతనిపట్ల నీవు చూపిన విశ్వాసమును

ఏనాడును విస్మరింపజాలరు.

మన ప్రజలు దురవస్థకు గురియైయున్నపుడు

నీవు నీ ప్రాణమును గూడ లెక్కచేయక

దైవమార్గమున నడచి మమ్మెల్లరిని కాపాడితివి

కనుక ప్రభువు నిన్ను హెచ్చుగా దీవించి,

నీ కీర్తిని కలకాలము నిల్పునుగాక”.

ఆ పలుకులాలించి ప్రజలెల్లరును ‘ఆమెన్‌’ అని బదులుపలికిరి.