ఐదవ దర్శనము – దీపస్తంభము
4 1. నాతో మాటలాడు దేవదూత నాయొద్దకు తిరిగివచ్చి నన్ను నిద్రించువానిని లేపినట్లుగా లేపెను.
2. అతడు ”నీ కేమి కనిపించుచున్నది?” అని నన్న డిగెను.
నేను ఇట్లింని: ”నాకు బంగారముతో చేసిన దీపస్తంభము కనిపించుచున్నది. దానిపె నూనెపోయు పాత్రమున్నది. ఆ స్తంభముపై ఏడు దీపములున్నవి. ఒక్కొక్క దీపమునకు వత్తులనుంచు నాలుకలు ఏడున్నవి.
3. దీపస్తంభమునకు కుడిఎడమలందు ఒక్కొక్కి చొప్పున రెండు ఓలివుచెట్లు కలవు.”
4. ఇట్లు చెప్పి, నేను ”అయ్యా! వీని భావము ఏమి?” అని దేవదూత నడిగితిని.
5.”వీని అర్థము నీకు తెలియదా?” అని అతడు నన్ను ప్రశ్నించెను. ”తెలియదు” అని నేనింని.
10 అ1. దేవదూత ”ఏడుదీపములు లోకము నంతిని పరిశీలించి చూచు ప్రభువు ఏడుకన్నులు” అని చెప్పెను.
11. ”దీపస్తంభమునకు ఇరువైపులనున్న రెండు ఓలివుచెట్ల భావమేమి?
12. ఓలివుతైలము కారు చున్న రెండు బంగారుగొట్టముల ప్రక్కనున్న ఆ రెండు ఓలివుకొమ్మల అర్థమేమి?” అని నేనడిగితిని.
13. ”వాని భావము నీకు తెలియదా?” అని అతడు నన్ను ప్రశ్నించెను. ”తెలియదు” అని నేను చెప్పితిని.
14. ”ఈ రెండు సర్వలోకాధిపతియైన ప్రభువు తనను సేవించుటకుగాను అభిషేకించిన యిరువురు మనుష్యులను సూచించును” అని అతడు పలికెను.
సెరుబ్బాబెలునకు ప్రభువు వాగ్ధానము
6. దేవదూత నాతో ఇట్లనెను. సెరుబ్బాబెలునకు ప్రభువు సెలవిచ్చు సందేశమును ఇట్లు చెప్పుమనెను: ”సైన్యబలమువలన కాదు, నీ సొంతబలమువలనను కాదు. కేవలము నా ఆత్మవలననే నీకు విజయము కలుగును- ఇదియే సైన్యములకధిపతియగు ప్రభువు వాక్కు.
7. ఉన్నతపర్వతములు కూడ సెరుబ్బాబెలునకు సమతలమైన ప్రదేశమగును. అతడు ఆలయ నిర్మా ణము చేయును. దానికతడు పైన చివరిరాయి ప్టిెంచు నపుడు జనులందరు ఆనందముతో ‘ఇది వరమే! ఇది వరానుగ్రహమే!’ అని ధ్వానము చేయుదురు.
8. ప్రభువు నాకు మరల తన సందేశమును ఇట్లు వినిపించెను: 9. ”సెరుబ్బాబెలు ఈ మందిరము నకు పునాదులెత్తెను. అతడు దాని నిర్మాణమును పూర్తిచేయును. ఈ కార్యము జరిగినప్పుడు సైన్యము లకధిపతియైన ప్రభువు నిన్ను వారి చెంతకు పంపెనని నా ప్రజలు గ్రహింతురు.
10 ఆ. వారు కొద్దిపాి పనియే జరిగినదని నిరుత్సాహపడుచున్నారు. అయి నను సెరుబ్బాబెలు దేవాలయనిర్మాణమును కొన సాగించుటను చూచి వారు ప్రమోదము చెందుదురు.”