ఆరవ దర్శనము
ఎగురుచున్న గ్రంథపుచుట్ట
5 1. నేను మరల కన్నులెత్తిచూడగా ఆకసమున ఎగురుచున్న గ్రంథపుచుట్ట కనిపించెను.
2. ”నీ కేమి కనిపించుచున్నది” అని దేవదూత నన్నడిగెను. నేను ”ఆకసమున ఎగురు గ్రంథపుచుట్ట కనిపించు చున్నది. అది ఇరువదిమూరల పొడవు పదిమూరలు వెడల్పు కలిగియున్నది” అని చెప్పితిని.
3. అంతట అతడు ఇట్లనెను: ”దీనిపై వ్రాసిన శాపము దేశమంతిమీదికిని పోవును. గ్రంథపుచుట్ట ఒక ప్రక్క ప్రతిదొంగయు దేశమునుండి బహిష్కరింప బడునని చెప్పుచున్నది. మరియొక ప్రక్క అబద్ధ ప్రమాణములు చేయుప్రతివాడును దేశమునుండి బహిష్కరింపబడునని నుడువుచున్నది.
4. సైన్యముల కధిపతియైన ప్రభువు ఇట్లు చెప్పుచున్నాడు: నేనీ శాపమును దేశముమీదికి పంపుదును. అది ప్రతి దొంగయింటను, అబద్ధ ప్రమాణముచేయు ప్రతివాని ఇంటను ప్రవేశించును. అది వారి ఇండ్లలోనుండి పోయి వారి ఇండ్లదూలములను, రాళ్ళనుగూడ నాశనము చేయును.”
ఏడవదర్శనము-దుష్టురాలైన స్త్రీ
5. నాతో మాటలాడు దేవదూత బయల్వెడలి, నాతో ఇట్లనెను: ”నీ కన్నులెత్తి ఆ వచ్చుదానిని చూడుము” అనెను. 6. ”అది ఏమి?” అని నేను ప్రశ్నించితిని. అతడు ”అది ఒక కొలతబుట్ట1. అది భూలోకమంత టను జరుగు వారి వ్యవహారమును సూచించును” అని చెప్పెను.
7. ఆ బుట్టకు సీసపు మూతకలదు. నేను చూచుచుండగా ఆ మూత తీయబడెను. బుట్టలో నొక స్త్రీ కూర్చుండియుండెను.
8. దేవదూత ”ఈ స్త్రీ దుష్టత్వమును సూచించును” అని చెప్పెను. అతడు ఆమెను బుట్టలోనికినొక్కి దానిపై మరల సీసపుమూత బరువు పెట్టెను.
9. నేను చూచుచుండగా ఇరువురు స్త్రీలు నా చెంతకు ఎగిరివచ్చిరి. వారికి సారసపక్షికివలె బలమైన రెక్కలుండెను. వారు ఆ బుట్టను భూమ్యాకా శముల మధ్యకు ఎత్తి మోసికొనిపోయిరి.
10. వారా బుట్టనెచికి తీసికొని పోవుచున్నారని నేను దేవ దూతను ప్రశ్నించితిని.
11. అతడిట్లు చెప్పెను: ”దానిని షీనారు నగరమునకు కొనిపోవుచున్నారు. అచట దానికొక దేవళమును నిర్మింతురు. ఆ దేవళము పూర్తియైనప్పుడు ఆ బుట్టను దానిలోప్టిె పూజింతురు.”