ఎనిమిదవ దర్శనము-నాలుగు రథములు
6 1. నేను కన్నులెత్తిచూడగా ఈ దృశ్యము కనిపించెను. నాలుగు రథములు రెండు కంచుకొండల నుండి వెలుపలికి వచ్చుచుండెను.
2-3. మొది రథమును ఎఱ్ఱగుఱ్ఱములును, రెండవదానిని నల్లగుఱ్ఱ ములును, మూడవదానిని తెల్లగుఱ్ఱములును, నాలు గవదానిని చుక్కలుకలిగిన గుఱ్ఱములును లాగు చుండెను.
4. అపుడు ”అయ్యా! ఈ రథముల భావ మేమి?” అని నేను దేవదూతనడిగితిని.
5. ”ఇవి నాలుగు ఆత్మములు. ఇవి ఇప్పుడే సర్వలోకాధిపతియైన ప్రభువు సమక్షమునుండి వచ్చి నవి” అని అతడు చెప్పెను.
6. నల్లగుఱ్ఱములులాగు రథము ఉత్తరదిక్కున నున్న బబులోనియాకు పోవుచుండెను. తెల్లగుఱ్ఱములు లాగునది దానిననుసరించి వెంటపోవుచుండెను. చుక్కలుగలిగిన గుఱ్ఱములులాగునది దక్షిణదేశమునకు పోవుచుండెను.
7. చుక్కలుకలిగిన గుఱ్ఱములు కాలు కదపి భూమిని పరిశీలింపబోవుటకు త్వరపడుచున్నట్లు కనిపించెను. దేవదూత ”మీరు వెళ్ళి భూలోకమంతట పరీక్షించిచూడుడు” అని వానితో చెప్పెను.
8. అంతట దేవదూత ”ఉత్తరదిక్కుననున్న బబులోనియాకు వచ్చిన అశ్వములు ప్రభువు ఆత్మను ఉపశమింపచేసినవి” అని నాతో చెప్పెను.
యోహోషువకు కిరీటము
9. ప్రభువువాణి నాతో ఇట్లనెను: 10. ”బబులోనియా ప్రవాసమునుండి వచ్చిన హెల్దయి, తోబీయా, యెదాయా అనువారు జెఫన్యా కుమారుడగు యోషీయా ఇంటనున్నారు. వారచట దిగియున్న దిన ముననే నీవు ఆ ఇంికివెళ్ళి, 11. వారినడిగి వెండి బంగారములు తీసుకొని, కిరీటము చేసి యెహోసాదాకు పుత్రుడును, ప్రధానయాజకుడునైన యోహోషువా శిరస్సునలంకరింపుము.
12. సైన్యములకధిపతియైన ప్రభువు ఇలాగు సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుము. ”చిగురు అనబడు నరుడు తానున్నచోటనే వృద్ధి చెందును. అతడు ప్రభువు మందిరమును పునర్ని ర్మించును.
13. ఆ జనుడు దేవళమునుక్టి రాజ గౌరవమును బడసి సింహాసనాసీనుడై పాలించును, సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయును1. ఈ ఇరుబాధ్యతలమధ్య శాంతిసామరస్యములు నెలకొని యుండును.
14. ఆ కిరీటము హెల్దయి, తోబీయా, యెదాయా, యోషీయాల కీర్తికి జ్ఞాపకార్థముగా దేవాలయమున ఉండును.
15. దూరముననున్నవారు తిరిగివచ్చి ప్రభువు దేవాలయ నిర్మాణమున తోడ్పడుదురు. దానిని పునర్ని ర్మించినపుడు సైన్యములకధిపతియైన ప్రభువు నన్ను పంపెనని మీరు గుర్తింతురు. మీరు మీ దేవుడైన ప్రభువు యావే ఆజ్ఞలు పాింతురేని ఇదియంతయు జరుగును”.