ప్రజాపీడకులైన అధికారులు

3 1. మీకా ఇట్లు ప్రకించెను:

               యిస్రాయేలు అధికారులారా! వినుడు!

               మీరు న్యాయము నెరిగియుండవలసినవారుకాదా?

2.           కాని మీరు మంచిని నిరాకరించి, 

               చెడును చేపట్టుచున్నారు.

               నా ప్రజల చర్మమును ఒలిచి

               వారి ఎముకలనుండి

               మాంసమును ఊడబీకుచున్నారు.     

3.           మీరు నా జనులను దిగమ్రింగుచున్నారు.

               వారి చర్మమును ఒలిచి,

               వారి ఎముకలను విరుగగ్టొి,

               ముక్కలుముక్కలుగ నరికి

               వంటపాత్రములో వేయుచున్నారు.

4. మీరు దేవునికి మొరపెట్టుకాలము వచ్చును.

               కాని ఆనాడు ఆయన మీ మనవినాలింపడు.

               మీరు చెడుకు పాల్పడితిరి కనుక

               ఆయన మొగమును చాటుచేసికొనును.

లంచగొండులైన ప్రవక్తలు

5.           నా ప్రజలను అపమార్గమును ప్టించు

               ప్రవక్తను గూర్చి ప్రభువిట్లు నుడువుచున్నాడు:

               తమకు దొరికిన ఆహారమును నములుచూ

               సమాధానమని ప్రకించుచున్నారు

               ఎవడైనను తమనోట ఆహారము పెట్టనియెడల

               యుద్ధము సంభవించునని చెప్పుచున్నారు.

6.           ప్రవక్తలారా! మీ దినము గతించినది.

               మీ సూర్యుడు అస్తమించెను.

               మీరిక దర్శనములు కనజాలరు.

               భవిష్యత్తును తెలియజేయజాలరు.

7.            అప్పుడు ప్రవక్తలు

               అవమానమునకు గురియగుదురు.

               భవిష్యత్తును ఎరిగించువారు తెల్లబోవుదురు.

               ప్రభువు వారికి జవాబీయడు

               కాన వారు భంగపడుదురు.

8.           కాని ప్రభువు నన్ను

               తన ఆత్మతోను, బలముతోను నింపెను.

               నేను యిస్రాయేలీయులకు

               వారి పాపములు ఎరిగించుటకుగాను

               ఆయన నాకు న్యాయదృష్టిని, ధైర్యమును ఒసగెను.

దుష్టులకు శిక్ష, యెరూషలేము పతనము

9.           న్యాయమును ఏవగించుకొని,

               మంచిని చెడుగా మార్చెడు

               యిస్రాయేలు అధికారులారా!

               నా పలుకులు ఆలింపుడు.

10.         మీరు సియోనును రక్తపాతముతోను,

               యెరూషలేమును అన్యాయముతోను 

               నిర్మించుచున్నారు.               

11.           పట్టణాధికారులు లంచముప్టి

               తీర్పులు చెప్పుచున్నారు.

               యాజకులు సొమ్ము తీసికొని

               ధర్మశాస్త్ర అర్థమును ఎరిగించుచున్నారు.

               ప్రవక్తలు డబ్బు తీసికొని

               భవిష్యత్తును తెలియజేయుచున్నారు.

               అయినను వారెల్లరును

               ప్రభువుమీదనే ఆధారపడుచున్నారు.

               ప్రభువు మనతోనున్నాడు కనుక

               మనక్టిె కీడును కలుగదని వాకొనుచున్నారు.

12.          కావున మీ దోషములబ్టి

               సియోనును పొలమువలె దున్నుదురు.

               యెరూషలేము పాడువడి రాళ్ళగుట్టయగును.

               దేవళమున్న పర్వతము అరణ్యమగును.

Previous                                                                                                                                                                                               Next