యిస్రాయేలీయులకు హెచ్చరిక, బెదరింపు

ఎన్నిక, శిక్ష

3 1. యిస్రాయేలీయులారా!

               ప్రభువు మిమ్ము గూర్చి పలికిన

               ఈ సందేశము నాలింపుడు.

               ఆయన ఐగుప్తునుండి కొనివచ్చిన

               ప్రజలెల్లరిని గూర్చిన ఈ వార్తను వినుడు.

2.           భూమిమీద జాతులన్నిలోను

               నేను మిమ్ము మాత్రమే ఎరిగియుింని.

               కావున మీ పాపములన్నికిగాను

               నేను మిమ్ము దండింతును.

ప్రవక్త దేవుని పిలుపును నిరాకరింపజాలడు

3.           ఇరువురు నరులు కలిసి ప్రయాణము చేసినచో వారు ముందుగా ఒప్పందము

               చేసికొని యుండవలెనుగదా!

4.           అడవిలో సింగము గర్జించినచో

               దానికి ఎర దొరికియుండవలెనుగదా!

               గుహలో సింగపు కొదమ బొబ్బరించినచో

               దానికి జంతువు చిక్కియుండవలయునుగదా!

5.           పక్షి ఉరులలో చిక్కుకొనినచో

               దానికి ఎవరో ఎరప్టిెయుండవలెనుగదా!

               ఉచ్చుపైకి లేచినచో

               పక్షి దానిలో తగుల్కొనియుండవలెనుగదా!

6.           నగరమున బాకానూదినచో

               జనులు భయపడకుందురా?

               ప్రభువు కీడు పంపనిదే

               నగరమునకు ఆపదవాిల్లునా?

7.            ప్రభువైన దేవుడు

               తన సేవకులైన ప్రవక్తలకు తెలుపకుండ

               ఎి్ట కార్యమును చేయడు.

8.           సింహము గర్జించినచో భయపడనివాడెవడు?

               ప్రభువైన దేవుడు ఆనతిచ్చినచో

               ప్రవచనము చెప్పనివాడెవడు?

సమరియాకు వినాశనము తప్పదు

9.           అష్దోదు ప్రాసాదములలో నివసించువారికిని

               ఐగుప్తు రాజభవనములలో వసించువారికిని

               ఇట్లు చెప్పుడు. – ”మీరెల్లరును సమరియా

               కొండలపై ప్రోగై ఆ నగరమున జరుగు

               అక్రమములను, పీడనలను గమనింపుడు”.

10. ప్రభువు ఇట్లనుచున్నాడు:

               ఈ ప్రజలు నేరములు, దౌర్జన్యములు చేసి

               తెచ్చుకొనిన సొమ్ముతో

               తమ భవనములను నింపుకొనిరి.

               వీరికి న్యాయవర్తనమ్టెిదో కూడ తెలియదు.

11.           కావున విరోధి ఒకడు వీరి దేశమును చుట్టుమ్టుి

               వీరి కోటలను నాశనము చేయును.

               వీరి భవనములను కొల్లగొట్టును.

12. ప్రభువు ఇట్లనుచున్నాడు:

               గొఱ్ఱెల కాపరి సింహము నోటనుండి

               రెండు కాళ్ళనైనను, చెవి, ముక్కునైనను

               విడిపించుకొనినట్లుగా

               ఇపుడు సుఖప్రదమైన బ్టుాలువేసిన

               శయ్యలపై కూర్చుండియున్న

               సమరియా పౌరులు రక్షింపబడుదురు”.

బేతేలునకు ప్రతికూలముగా

13.          సర్వోన్నతుడు ప్రభువు ఇట్లనుచున్నాడు:

               ”వినుడు, యాకోబు వంశజులను హెచ్చరింపుడు.

14. నేను యిస్రాయేలీయులను

               వారి పాపములకు గాను దండించునపుడు

               బేతేలులోని బలిపీఠములనుగూడ కూల్చివేయుదును

               ఆ బలిపీఠపుకొమ్ములు

               తెగవేయబడి నేలపై బడును.

15.          నేను శీతకాలపు విడిది భవనములు,

               గ్రీష్మకాలపు విడిది గృహములను

               నాశనము చేయుదును.

               దంతము పొదిగిన

               మేడమిద్దెలును   నేలమట్టమగును.

               ఇది ప్రభుని వాక్కు.

Previous                                                                                                                                                                                                     Next  

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము