దర్శనములు

మొది దర్శనము – మిడుతలు

7 1. మహోన్నతుడైన ప్రభువు నాకు ఈ దర్శనము చూపించెను: రాజునకు ఈయవలసిన గడ్డిని కోసిన తదుపరి కడవరి గడ్డి పెరుగు సమయమున ప్రభువు మిడుతలదండును సృజించెను.

2. ఆ దండు నేలమీది పచ్చని మొక్కలనెల్ల తినివేయుచుండెను. అప్పుడు నేను ”సర్వోన్నతుడవైన ప్రభూ! నీవు దయచేసి మన్నింపుము. యాకోబు కొద్ది జనము గలవాడు, అతడేలాగు నిలు చును” అని మనవి చేసితిని.

3. అప్పుడు ప్రభువు మనసు మార్చుకొని ”ఈ కార్యము జరుగదు” అనెను.

రెండవ దర్శనము – అగ్ని

4. మహోన్నతుడైన ప్రభువు నాకీదర్శనము చూపించెను: అతడు తన ప్రజలను శిక్షించుటకు అగ్నిని రప్పించెను. ఆ అగ్ని పాతాళమందలి మహాసముద్ర మును కాల్చివేసి భూమిని కూడ మాడ్చివేయ మొదలు పెట్టెను.

5. అప్పుడు నేను ”సర్వోన్నతుడైన ప్రభూ! నీవు ఈ అగ్నిని ఆపుము. యాకోబు బహుకొద్దిజనము1 గలవాడు. అతడేలాగు నిలుచును?” అని మనవి చేసితిని.

6. అప్పుడు ప్రభువు మనసు మార్చుకొని ”ఈ కార్యము జరుగదు” అనెను.

మూడవ దర్శనము – లంబసూత్రము

7. ప్రభువు నాకు మరియొక దర్శనము చూపెను: ఆయన లంబసూత్రము సహాయముతో నిర్మించిన గోడ ప్రక్కనే నిలుచుండియుండెను. ఆయన చేతిలో లంబ సూత్రముండెను.

8. ఆయన నన్ను ”ఆమోసు! నీకేమి కనిపించుచున్నది?” అని అడిగెను. ”లంబ సూత్రము” అని నేను జవాబు చెప్పితిని. ఆయన ”నేను నా ప్రజలైన యిస్రాయేలీయులను దీనితో కొలుతును. వారు కొలత తప్పిన గోడవలెనున్నారు. నేను మరల మనసు మార్చు కొనను, వారిని శిక్షింపకమానను.

9. ఈసాకు వంశజులు పూజలుచేయుచున్న ఉన్నతస్థలములు పాడగును. యిస్రాయేలీయుల దేవాలయములు నాశనమగును. నేను యరోబాము రాజ వంశమును తుదమ్టుింతును” అని అనెను.

ఆమోసు – అమస్యా

10. అపుడు బేతేలు దేవళమున యాజకుడుగా నున్న అమస్యా యిస్రాయేలురాజైన యరోబామునకు ఇట్లు వర్తమానము పంపెను: ”ఆమోసు ప్రజల నడుమ నీపై కుట్రలు పన్నుచున్నాడు.

11. ‘యరోబాము పోరున కూలుననియు, యిస్రాయేలీయులను తమ దేశమునుండి ప్రవాసమునకు కొనిపోవుదురనియు’ చెప్పుచున్నాడు. అతడి పలుకులను దేశమిక సహింప జాలదు.”

12. అంతట అమస్యా ఆమోసుతో ”దీర్ఘదర్శీ! నీవిక యూదాకు వెడలిపొమ్ము. అచట ప్రవచనము చెప్పి, పొట్టపోసికొనుము.

13. బేతేలు రాజుక్టిన ప్రతిష్టితస్థలమును, రాజధాని పట్టణము అయి యున్నందున దీనిలో నీవిక ప్రవచింపవలదు” అనెను.

 14. ఆ మాటలకు ఆమోసు ఇట్లు బదులు చెప్పెను: ”నేను ప్రవక్తను కాను. ప్రవక్తల సమాజమునకు చెందిన వాడనైనను కాను. నేను మందలు కాయువాడను. అత్తిచెట్లను సాగుచేయువాడను.

15. కాని ప్రభువు మందలకాపరినైన నన్ను పిలిచి ‘నీవు వెళ్ళి యిస్రా యేలీయులకు ప్రవచనము చెప్పుము’ అని ఆజ్ఞాపించెను.

16. కావున నీవు ప్రభువు మాటవినుము. ‘యిస్రా యేలీయులకు ప్రతికూలముగా ప్రవచనము చెప్పవల దనియు, దైవోక్తులు పలుకవలదనియు’ నీవు నాతో చెప్పుచున్నావు.

17. కావున అమస్యా! ప్రభువు నీతో ఇట్లు చెప్పుచున్నాడు. ‘నీ భార్య నగరమున వేశ్యయగును. నీ బిడ్డలు పోరున చత్తురు. అన్యులు నీ పొలమును విభజించి పంచుకొందురు. నీ మట్టుకు నీవు అపవిత్రమైన పరదేశమున చత్తువు. యిస్రాయేలీయులను తప్పక తమ దేశమునుండి బందీలుగా కొనిపోవుదురు’.

Previous                                                                                                                                                                                                     Next  

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము