ఉపోద్ఘాతము:
పేరు: ఈ గ్రంథములోని ప్రధాన వ్యక్తి యెహోషువ పేరును గ్రంథనామముగా ప్టిెరి. (1:1-3). యెహోషువ అనగా ”యావే రక్షిస్తాడు” అని అర్ధము.
కాల వ్యవధి: క్రీ.పూ. 13వ – 12వ శతాబ్దాలు.
రచయిత: పవిత్ర గ్రంథకర్తలు క్రీ.పూ. 6వ శతాబ్దారంభ మరియు బబులోనియా వలసకాలము (క్రీ.పూ. 597-538) మధ్యకాలములో ఈ గ్రంథమును వ్రాసిరని పండితుల అభిప్రాయము. యోహోషువ గ్రంథము, న్యాయాధిపతుల గ్రంథము, 1-2 సమూవేలు గ్రంథములను, 1-2 రాజుల గ్రంథములను కలిపి ద్వితీయోపదేశకారుని చారిత్రాత్మక గ్రంథములుగా చెప్పబడును. యిస్రాయేలీయులకు యావే వాగ్ధానము, రక్షణ, సీనాయి ఒడంబడికపట్ల వారికున్న విశ్వాస్యతపై ఆధారపడివుండునను ద్వితీయోపదేశకారుని సందేశాన్ని ఈ గ్రంథములు వివరించును.
చారిత్రక నేపథ్యము: యిస్రాయేలీయులను వాగ్దత్తభూమిలోనికి నడిపించే భాగ్యము యెహోషువకు దక్కినది. యిస్రాయేలీయులు యోర్దాను నదిని దాి కనానును ఆక్రమించుకొని వాగ్దత్తభూమిలో స్థిరపడిన అంశాలను కూలంకషముగా ఈ గ్రంథము పరిశీలించును.
ముఖ్యాంశములు: ప్రభువైన దేవుడు చేసిన నిబంధనకు అక్షరరూపము ఇచ్చును. (1:1-5:15). యెహోషువ సమర్థనీయమైన నాయకత్వాన్ని చిత్రీకరించును. దేవునికి విధేయించడమే ప్రతి విజయానికి సోపానము అని తెలుపును. వాగ్దత్తభూమిని 12 తెగల మధ్య విభజించడము ప్రత్యేకభాగముగా ఈ గ్రంథము చూపును (అధ్యా. 12-22). దుష్టశిక్షణ, శ్రేష్టజనుల సంరక్షణ బోధనాంశముగా నిలుస్తుంది (6:21; 8:26; 10:28, 40), దేవుడు నమ్మకమైనవాడు (11:23; 21:43-45; 23:14); పరిశుద్ధుడు (3:5; 7:11-13; 23:12), షెకెమునొద్ద నిబంధనమును నూత్నీకరించుట (అధ్యా.24) అనునవి ఈ గ్రంథమునందు ముఖ్యాంశములు.
క్రీస్తుకు అన్వయము: క్రీస్తుని గూర్చి ప్రత్యక్ష ప్రస్తావనలు లేనప్పికి పరోక్ష అన్వయములు వున్నాయి. యెహోషువ క్రీస్తుకు ప్రతీక. అతను దేవుని ప్రజలను వాగ్దత్తభూమికి నడిపించడము, విజయవంతమవడము క్రీస్తును సూచిస్తాయి.