ఉపోద్ఘాతము:

పేరు: ‘విలాపము’ అనగా దుఃఖమును, సంతాపమును వ్యక్తపరచడము. పురాతన గ్రీకు పూర్వనిబంధన ప్రతులలో (సెప్తువజింత) దీన్ని ”యిర్మీయా విలాప వాక్యాలు” గా చెప్పబడెను. ఈ గ్రంథమును క్రైస్తవ సంఘారాధనములో పునరుత్థాన పండుగ దినములలో చదువుట పరిపాి.

కాలము: క్రీ.పూ. 6 వ శతాబ్ధము – 586 తర్వాత: (బబులోనియా ప్రవాసకాలములో క్రీ.పూ. 587-538).

రచయిత: యిర్మీయా అని సాంప్రదాయక అభిప్రాయము. కాని క్రీ.పూ 587లో యెరుషలేము వినాశనము చూసిన వేరొకరని కూడ పండితులు అభిప్రాయపడుచున్నారు.

చారిత్రక నేపథ్యము: యూదులు, బబులోను రాజులకు బందీలైపోయిన పిమ్మట, యెరూషలేము విధ్వంసమును కన్నీి భాషతో ఈ గ్రంథము వర్ణించును. యెరుషలేముపై రాబోవు తీర్పును గూర్చి యిర్మీయా ప్రవక్త ప్రస్తావించెను. యెరూషలేము వినాశనము జరిగిన పిదప యిర్మీయా చేసిన ప్రలాపగీతమే ఈ కావ్యము.

ముఖ్యాంశములు: వినాశనము, శూన్యత, క్షీణతలవల్ల కలిగిన అనుభవాల మధ్య యూదులకు దేవుని వాగ్దానమును, విశ్వసనీయతను ధృవీకరించి వారిలో ఆశాభావాన్ని నింపడము ఈ గ్రంథములోని ప్రధానాంశము. ప్రవక్తల హెచ్చరికలను అజాగ్రత్త చేసిన యూదులలో మార్పుకోసము నిర్ధేశింపబడినది ఈ గ్రంథము. నిరాశ, నిస్పృహల స్థితిలో దేవుని సాక్షాత్కరతను గుర్తు చేయును.  యిర్మీయా           దుఃఖము ప్రజల్లో పశ్చాత్తాపము, సానుభూతిని కలిగించినది. యెరూషలేము దేవాలయ విధ్వంసము దేవుని హృదయాన్ని కలిచివేసినది.  అదే యూదులపట్ల దేవుని కరుణను, కృపను తెలుపుతుంది.

క్రీస్తుకు అన్వయము: యిర్మీయా ప్రవక్త యెరూషలేమును గూర్చి విలపించడము, నూతన నిబంధనములో క్రీస్తు యెరూషలేమును గూర్చి పరితపించడాన్ని ముంగుర్తుగా ఈ గ్రంథము ప్రతిబింబించును (మత్త. 23:37-38). యెరూషలేము వినాశనము గూర్చి విలపించిన క్రీస్తు, పాపమువలన కలిగే నాశనము గూర్చి గుర్తుచేసారు.  క్రీస్తుజీవితము, సేవను గూర్చిన ఆనవాళ్ళను  ఈ గ్రంథములో చూడవచ్చు (1:12; 3:19; 2:15-16; 3:14; 3:30).