ఉపోద్ఘాతము:
పేరు: ఈ గ్రంథములోని ప్రధాన పాత్రధారిణి ‘రూతు’ను బ్టి గ్రంథమునకు ఆ పేరు నిర్ధారించడము జరిగినది. రూతు అనగా ”సహచారిణి” అని అర్థము. ఈమె దావీదుమహరాజు పూర్వీకురాలు. మత్తయివ్రాసిన క్రీస్తుసువార్తలోని వంశావళిలోని ఐదుగురు స్త్రీలలో ఈమెయు ఒకతె (మత్త. 1:5).
రచయిత: ఓ అజ్ఞాతవ్యక్తి. బహుశ విశాలభావములు కలిగిన ఔత్సహికుడైన యూదుడు కావచ్చును.
కాలము: గ్రంథమునందలి ఇతివృత్తాంతము న్యాయాధిపతుల కాలమునకు చెందినదని చెప్పబడెను.
చారిత్రక నేపథ్యము: బబులోను వలసానంతరము ఎజ్రా, నెహెమ్యాలు యూదులు మోవాబీయులను, ఇతర యూదయేతరులను వివాహమాడరాదని కఠిన నిర్ణయాలు చేసారు. (ఎజ్రా. 9-10: నెహె.13:23-29). ఇి్ట వివాహములవలన యూదులు మతభ్రష్టులగుదురని భావించిరి. దానికి ప్రతిస్పందనగ మోవాబీయురాలైనను ‘రూతు’ యావేకు విశ్వాసపాత్రముగనుండుటను రచయిత విశాల దృక్పధముతో క్రీ.పూ. 6-4 శతాబ్దములలో వ్రాయబడినది. నవోమి (నా ప్రసన్నత) ఎలీమెలెకుల కోడలు. నవోమికి ఇద్దరు కుమారులు: మహ్లోను, కిల్యోను. వీరిద్దరు మోవాబీయుల స్త్రీలను పెండ్లియాడిరి. వారు ఓర్ప, రూతు. మోవాబు దేశములో ఉండగా భర్తను, కుమారులిద్దరిని కోల్పోయిన నవోమి స్వదేశములో కరువు ముగిసినదని తెలిసి తిరిగిరావాలని నిశ్చయించుకున్నప్పుడు తన కోడళ్ళలో రూతు మాత్రమే నవోమితో (అత్తగారింకి) వచ్చింది. అచ్చట రూతు బోవాసును వివాహమాడింది. వీరిద్దరి వంశస్థుడే దావీదు. మోవాబు మృతసముద్రానికి తూర్పున వుంటుంది. మోవాబు లోతుకుమారుడు (ఆది. 19:37).
ముఖ్యాంశములు: యావే సర్వమానవాళి రక్షకుడు, కుటుంబములో పరస్పర ఆదరాభిమానములు, దావీదు వంశావళి, దేవర న్యాయము (ఉలిఖీరిజీరిశిలి ఖబిజీజీరిబివీలి ద్వితీ.కా. 25:5; 7-19), యావేదేవుని సార్వభౌమాధికారము.
క్రీస్తుకు అన్వయము: మానవ అడ్డంకులు దేవుని అవకాశాలుగా మారి రక్షణసాధనాలుగా నిలుస్తాయి (ఫిలిప్పి. 1:12). క్రీస్తు వంశావళికి రక్తసంబంధమే అర్హతకాదు. దేవుని చిత్తాన్ని ఆచరించే వారందరు అర్హులే (రోమీ. 1:5; 16:26). రూతుకు క్రీస్తు వంశావళిలో స్థానము లభించినది (మత్త. 1:5). బోవసు బంధువుగా, రక్షకుడుగా, మృతులను జీవింపజేయువానిగా నిలుచును (రూతు 4:10; మత్త. 20:28).