3 1. నేను రాత్రివేళ పడకమీద పరుండి
నా హృదయేశ్వరుని కొరకు గాలించితిని.
కాని ఎంత వెదకినను అతడు దొరకడయ్యెను.
2. నేను లేచి నగరములోనికి వెళ్ళితిని.
పట్టణ వీధులలోను, సందులలోను తిరుగాడితిని.
నా హృదయేశ్వరుని కొరకు వెదికితిని.
కాని ఎంత వెదకినను అతడు కన్పింపడయ్యెను.
3. నగరమునకు కావలికాయువారు నన్ను చూచిరి.
”మీరు నా హృదయేశ్వరుని గాంచితిరా?”
అని నేను వారిని ప్రశ్నించితిని.
4. వారు నన్ను దాి వెడలిపోవగనే
హృదయేశ్వరుడు నా కంటబడెను.
నేనతనిని గ్టిగా పట్టుకొని వదలిపెట్టనైతిని.
మా తల్లి ఇంికి అతనిని తోడుకొనివచ్చితిని.
నేను ప్టుిన గదిలోనికి అతనిని
తీసికొని వచ్చితిని.
ప్రియుడు
5. యెరూషలేము కుమార్తెలారా!
జింకల పేరు మీదుగాను, లేళ్ళ పేరుమీదుగాను,
నేను మీకానవ్టెి చెప్పుచున్నాను.
నా ప్రియురాలు స్వయముగా మేలుకొనువరకు
మీరామెకు నిద్రాభంగము కల్పింపవలదు.
మూడవ గీతము
చెలికత్తెలు
6. ఎడారినుండి ధూమస్థంభమువలె
కదలి వచ్చుచున్న ఇది యేమి?
దానియందు సాంబ్రాణి,
గోపరసముల సువాసనలు ఉన్నవి.
అది వర్తకులమ్ము పరిమళ ద్రవ్యముల
సువాసనలను గుబాళించుచున్నది.
7. అదిగో! సొలోమోనును పల్లకీలో
ఎక్కించుకొని తీసికొని వచ్చుచున్నారు.
యిస్రాయేలీయులలో శ్రేష్ఠులైన సైనికులు
అరువదిమంది అతనికి అంగ రక్షకులుగా నుండి
బరాబరులు చేయుచున్నారు.
8. వారందరును ఖడ్గవిద్యలో నిపుణులు.
యుద్ధమున కాకలుతీరిన యోధులు.
వారిలో ప్రతివాడును ఖడ్గము ధరించి, రాత్రియంద్టెి అపాయము
వాిల్లకుండునట్లు జాగ్రత్తపడును.
9. అది సొలోమోను స్వయముగా
తయారు చేయించుకొనిన పల్లకి.
దానిని లెబానోను కొయ్యతో చేసిరి.
10. దాని గడెలను వెండితో చేసిరి.
బంగారు దారముతో క్టుిన వలువను
దానిమీద కప్పిరి.
యెరూషలేము మహిళలు
అనురాగముతో నేసిన ఊదారంగు బట్టతో
దానిలోని ఆసనమును కప్పిరి.
11. సియోను కుమార్తెలారా!
సొలోమోను రాజును చూచుటకురండు!
ఆ రాజునకు ఆనందదాయకమైన
అతని వివాహ దినమున రాజమాత
అతడి శిరస్సును అలంకరించిన కిరీటమును
అతడిప్పుడు ధరించియున్నాడు.
ఆరోజు బహు సంతోషకరమైన రోజు.