ప్రియుడు
5 1. సోదరీ! వధువా!
నేను నా వనమున ప్రవేశించితిని.
ఇచట గోపరసమును,
సాంబ్రాణి తైలమును సేకరించుకొింని.
మధుకోశమునుండి తేనెనారగించితిని.
ద్రాక్షారసము, పాలు సేవించితిని.
చెలికత్తెలు
ప్రేయసీ ప్రియులారా!
మీరు ప్రేమ వలన మత్తెక్కినవరకు భుజింపుడు,
పానీయములు సేవింపుడు.
నాలుగవ గీతము
ప్రియురాలు
2. నేను నిద్రించుచున్నానేగాని,
నా హృదయము మేలుకొనియున్నది.
అదిగో! నా ప్రియుడు తలుపు తట్టుచున్నాడు.
ప్రియుడు
సోదరీ! ప్రేయసీ! పావురమా! నిష్కళంక సుందరీ! నాకు తలుపు తెరువుము.
నా తల మంచులో తడిసియున్నది.
నా శిరోజములు రేయి కురిసిన
మంచు బిందువులవలన తడిసి ఉన్నవి.
ప్రియురాలు
3. నేను వస్త్రములను తొలగించితిని.
వానిని మరల ధరింపనేల?
పాదములను కడుగుకొింని,
వానిని మరల మురికి చేసికోనేల?
4. నా ప్రియుడు తలుపుసందులో చేయిపెట్టెను.
నా హృదయము ఆనందముతో పొంగిపోయినది.
5. అపుడు నా ప్రియునికి తలుపు తీయుటకుగాను
నేను లేచితిని.
నేను తలుపుగడె తీయబోగా,
గోపరసము నా చేతులమీదినుండి,
వ్రేళ్ళ మీదినుండి కారి ఆ గడెమీద పడెను.
6. నేను ద్వారమును తెరచితిని.
కాని అతడు వెనుదిరిగి వెళ్ళిపోయెను.
అతడు వెడలిపోగా,
నా హృదయము క్రుంగిపోయెను.
నేను అతని కొరకు గాలించితినిగాని,
అతడు కనిపింపలేదు.
అతనిని పిలిచితినిగాని,
అతడు జవాబు చెప్పలేదు.
7. పట్టణమునకు గస్తీ కాయువారు
నాకు ఎదురు వచ్చిరి.
వారు నన్ను క్టొి గాయపరచిరి.
నగరద్వారముచెంత కావలి కాయువారు,
నా పై వస్త్రమును లాగుకొనిరి.
8. యెరూషలేము కుమార్తెలారా!
నేను మీకానవ్టెి చెప్పుచున్నాను.
మీరు నా ప్రియుని చూచెదరేని,
నేను ప్రేమవలన జబ్బుపడియున్నానని చెప్పుడు.
చెలికత్తెలు
9. స్త్రీలలో కెల్ల సొగసైనదానా!
నీ ప్రియునిలోని విశిష్టగుణమేమి?
నీవు మాకిట్లు ఆన పెట్టుటకు
నీ ప్రియుని గొప్పతనమేమి?
ప్రియురాలు
10. నా ప్రియుడు సొగసైనవాడు, ఎఱ్ఱనివాడు,
పదివేలమందిలోను మెరుగైనవాడు.
11. అతని తల మేలిమి బంగారమువలెనుండును.
అతని శిరోజములు
ఖర్జూరపు గెలలవలె వ్రేలాడుచు,
కాకి నలుపుతో నిగనిగ లాడుచుండును.
12. అతని కన్నులు పాలలో స్నానమాడి
పారునీిచెంత వాలియున్న
కపోతములవలె నుండును.
13. అతని చెక్కిళ్ళు సుగంధమూలికలు పెరుగు
మడులవలె సువాసనలొలుకుచుండును.
అతని పెదవులు గోపరసమున తడిసిన
లిల్లీ పూలవలెనున్నవి.
14. అతని హస్తములు రత్నములు తాపించిన
బంగారు కడ్డీలు,
అతని వక్షము నీలమణులు పొదిగిన దంతపుదిమ్మె.
15. అతని పాదములు బంగారపుపాదులో
నెలకొల్పిన చలువరాతి స్తంభములు.
అతడు లెబానోను కొండలవలె,
తమాల వృక్షములవలె చూపట్టును.
16. అతని సంభాషణము
మహామధురముగా ఉండును.
అతడు అన్నివిధముల కాంక్షణీయుడు.
యెరూషలేము కుమార్తెలారా! నా ప్రియుడు,
నా స్నేహితుడు, ఇి్ట గుణములు కలవాడు.