ఉపోద్ఘాతము:
పేరు: దానియేలు గ్రంథమును హీబ్రూ బైబులులో చారిత్రకగ్రంథములలో చేర్చగా, సెప్తువజింత్ (గ్రీకు బైబులు) నందు ప్రవక్తల గ్రంథములలో చేర్చబడినది. దానియేలు అనగా ”దేవుడు నా తీర్పరి”. గ్రంథములో ప్రధాన పాత్రధారుడు దానియేలు కాబ్టి దీనికి ఆ పేరు నిర్ధారించడము జరిగింది.
కాలము: గ్రంథములోని సంఘటనలు క్రీ.పూ. దాదాపు 597-535 నాివి.
రచయిత: క్రీ.పూ. 2వ శతాబ్దములోని ఒకానొక అజ్ఞాత యూదుడు ”దానియేలు గ్రంథము”ను అప్పికే ప్రాచుర్యములోనున్న దార్శనికశైలిలో వ్రాసెను.
చారిత్రక నేపథ్యము: గ్రీకు రాజు 4వ అంియోకసు ఎపిఫానెసు (క్రీ.పూ 167- 164) యూదులను వారి విశ్వాసమును వీడి, గ్రీకుసంస్కృతిని, ఆ మతాచారములను అవలంబించవలెనని అనేక వేదహింసలకు గురిచేసాడు. తిరస్కరించిన వారికి మరణశిక్షను విధించాడు. ఈ పరిస్దితులలో, యూదులను వారి విశ్వాసములో స్ధిరముగా నుండ ప్రోత్సహించానికి, రచయిత కొన్ని చారిత్రక విషయాలను ఆధారము చేసుకొని వారిని బలపరచెను. క్రీ.పూ. 597లో బబులోనియారాజు నెబుకద్నెసరు యెరుషలేమును ముట్టడించి, రాజును అనేకమందిని ప్రవాసులుగా బబులోనియాకు తీసుకు వెళ్ళాడు. వారిలో దానియేలు కూడ వున్నాడు. ఈ సందర్భములో దానియేలు యూదులను తన దర్శనాల ద్వారా ఊరటపరచి వారిలో నమ్మకము, ధైర్యాన్ని నూరిపోసెను.
ముఖ్యాంశములు: బబులోను బందీలుగా చెరలోనున్న యూదులను దేవుడు రక్షించటము దీనిలోని ప్రధానాంశములు. భవిష్యత్తునుగూర్చి నమ్మకము కలిగించెను. దానియేలు తన వ్యక్తిగతజీవితము ద్వారా తన ప్రజలకు ఆదర్శ ప్రాయమైన సాక్ష్యాన్నిచ్చాడు. ధర్మశాస్త్రాన్ని విడనాడిన ప్రజలను తిరిగి దేవునిచిత్తము వైపు ఆకర్షించడానికి ప్రయత్నించాడు. ప్రవాసకాలములో, పరాయిదేశంలో నున్న ప్రజలు దేవుని ప్రజలేనన్న నమ్మకము కలిగించెను. దేవుడు మెస్సయా రాజ్యాన్ని స్థాపించబోతున్నాడని ప్రవచించెను. అన్ని సందర్భాలలో దేవుని ఆధిపత్యము, జీవితలక్ష్యం అనేవి ముఖ్యమని తెలుపును. ఒకని ఓర్పు, సహనము వానిని దేవునికి సన్నిహితుని చేయునని వెల్లడించును.
క్రీస్తుకు అన్వయము: సకలరాజ్యములలో విస్తరించు మెస్సియా భూదిగంత రాజ్యస్థాపనము (2:34,35,44). నిత్యుడగు తండ్రినుండి అధికారము పొందిన మనుష్యుని కుమారుడు (7:13-14). దేవుడు ఎన్నుకొనిన ప్రియుడు (4:25). ప్రభువు ఎన్నుకొనిని అభిషిక్తుడు (9:25-26). దానియేలు దర్శనము (9:25-26) మున్నగు అంశములలో క్రీస్తుని ప్రత్యక్షముగా చూపిస్తుంది.