నెబుకద్నెసరు స్వప్నము, మహావిగ్రహము

రాజు తన జ్ఞానులను ప్రశ్నించుట

2 1. నెబుకద్నెసరు పరిపాలనాకాలము రెండవయేట అతనికొక కల వచ్చెను. అది ఆ రాజును కలవర పెట్టుటచే అతడు నిద్రింపజాలడయ్యెను.

2. కనుక అతడు ఆ స్వప్నమును వివరించుటకుగాను తన మాంత్రికులను, శాకునికులను, గారడీవిద్యగలవారిని, కల్దీయులను పిలువనంపెను. వారెల్లరునువచ్చి అతనియెదుట నిలుచుండిరి.

3. అతడు వారితో ”నేనొక కలగింని. అది నన్ను కలతపెట్టుచున్నది. నేను దాని భావమేమిో తెలిసికోగోరెదను” అనెను. 

4. కల్దీయులు అరమాయికు భాషలో ”ప్రభువుల వారు కలకాలము జీవింతురుగాక! మీరు కనిన కలయేమో తెలియజేసినయెడల మేము దాని భావమును వివరింతుము” అనిరి.

5. రాజు వారితో ”నేను దానిని మరిచిపోతిని గాని, మీరు నాకు నా కలను దాని భావమునుకూడ తెలియజేయనియెడల నేను మిమ్ము ముక్కలు ముక్కలుగా నరికించి, మీ ఇండ్లను నేలమట్టము చేయింతును. 6. కాని మీరు నా స్వప్నమును దాని అర్థమును తెలియచేయుదురేని నేను మిమ్ము బహుమతులతో సత్కరించి సన్మానింతును. కనుక ఇప్పుడు మీరు నా కలను దాని భావమును తెలియజేయుడు” అని పలికెను.

7. వారు రాజుతో మరల ”ప్రభువులవారు తమ కల ఏమో సెలవిచ్చిన మేము దాని భావమును వివ రింపగలము” అనిరి.

8. రాజు వారితో ”నేను మరిచి యుండుట మీరుచూచి, కాలహరణము చేయ జూచు చున్నారు.

9. నా కలను ఎరిగింపరేని మీకెల్లరికిని ఒకటే శిక్షపడును. మనము అబద్ధములు చెప్పి కాలము గడపవచ్చునని అంతలో పరిస్థితులు మారునని మీలో మీరు కూడబలుకుకొింరి. మీరు నా కల ఏమిో చెప్పుడు. అప్పుడు మీకు దాని భావమును తెలియ జేయుటకు మీకు సామర్ధ్యము కలదని నేను తెలిసి కొందును” అనెను.

10. కల్దీయులు రాజుతో ”ప్రభువులవారికి తామెరుగగోరిన విషయమును చెప్పగలవాడెవడును ఈ భూలోకమునలేడు. ఏ రాజును ఏనాడును, ఎంత గొప్పవాడైనను, ఎంత శక్తిమంతుడైనను, తన మాంత్రి కులను,  శాకునికులను,  గారడీవిద్యగలవారిని, కల్దీయులను ఇి్ట ప్రశ్న అడిగియుండలేదు.

11. ప్రభువుల వారడుగునది కష్టమైనప్రశ్న. దేవతలేగాని నరులెవ్వరును దానికి జవాబు చెప్పలేరు. ఆ దేవతలు నరలోకమున వసింపరు” అని జవాబు చెప్పిరి.

12. ఆ మాటలకు రాజు మహాఆగ్రహముచెంది బబులోనియా జ్ఞానులనెల్ల వధింపుడని ఆజ్ఞాపించెను.

13. కనుక జ్ఞానులనెల్ల వధింపవలెనని శాసనమును ప్రకించిరి. అందుచే దానియేలును అతని మిత్ర బృందమునుగూడ చంపగోరి వారికొరకు వెతకిరి.

దేవుడు దానియేలునకు స్వప్నభావమును ఎరిగించుట

14. అంతట దానియేలు రాజసంరక్షకులకు నాయకుడైన అర్యోకునొద్దకు పోయెను. జ్ఞానులను చంపించువాడతడే. దానియేలు తెలివితోను, నేర్పు తోను మాటలాడుచు, 15. రాజు ఇి్ట కఠినశాసనము ఏల జారీచేసెను” అని అర్యోకు నడిగెను. అతడు జరిగిన సంగతిని చెప్పెను.

16. వెంటనే దానియేలు, రాజు సమక్షమునకు పోయి స్వప్నార్థమును తెలియజేయుటకు కాల వ్యవధిని దయచేయుడని అడిగి, అనుమతి పొందెను.

17. అటుపిమ్మట అతడు ఇంికిపోయి తన మిత్రులైన హనన్యా, మిషాయేలు, అజరయాలకు జరిగిన సంగతి పూసగ్రుచ్చినట్లు చెప్పెను.

18. అతడు వారితో ”మనము పరలోకమందున్న దేవునికి ప్రార్థన చేయుదము. అతడు మనపై దయచూపి ఈ రహస్యమును మనకు తెలియచేయవలెనని వేడుకొందము. అపుడు మనము బబులోనియాలోని జ్ఞానులతోపాటు చావనక్కరలేదు” అని చెప్పెను.

19. ఆ రాత్రియే దేవుడు ఒక దర్శన ములో దానియేలునకు ఆ రహస్యమును తెలియ జేసెను. కనుక అతడు పరలోకయధిపతియైన దేవుని ఇట్లు స్తుతించెను:

20. ”దేవునకు సదాస్తుతి కలుగునుగాక!

               ఆయన జ్ఞానమును, బలమును కలవాడు.

21.          కాలమును, ఋతువులును

               ఆయన ఆధీనమున ఉండును.

               ఆయన రాజులను

               గద్దెనెక్కించును, కూల ద్రోయును.

               నరులకు జ్ఞానమును,

               వివేకమును దయచేయును.

22.        ఆయన నిగూఢమైన రహస్యములను

               తెలియజేయును.

               అంధకారమున దాగియున్న సంగతులు

               ఆయనకు తెలియును.

               వెలుగు ఆయనను ఆవరించియుండును.    

23.        మా పితరులదేవా!

               నేను నిన్ను స్తుతించి కీర్తింతును.

               నీవు నాకు వివేకమును,

               బలమును దయచేసితివి.

               నీవు మా ప్రార్థన ఆలించి రాజు తెలిసికోగోరిన

               సంగతిని మాకు ఎరిగించితివి”.

దానియేలు రాజుకలను, దాని భావమును రాజునకు ఎరిగించుట

24. అంతట దానియేలు అర్యోకువద్దకు వెళ్ళెను. జ్ఞానులనువధింప రాజతనిని ఆజ్ఞాపించియుండెను. దానియేలు అతడితో ”మీరు జ్ఞానులను సంహరించ నక్కరలేదు. నన్ను రాజుసముఖమునకు కొనిపొండు. నేనతనికి స్వప్నమును, దాని భావమును వివరింతును” అని చెప్పెను.

25. వెంటనే అర్యోకు దానియేలును రాజు సమక్షమునకు కొనిపోయి, ”నేను ప్రభువులవారి స్వప్న భావమును వివరింపగల యూదాప్రవాసి నొకనిని కనుగొింని” అని చెప్పెను.

26. రాజు బెల్తెషాజరు అను మారుపేరుగల దానియేలుతో ”నీవు నా కలను, దాని అర్థమును తెలియజేయగలవా?” అని అడిగెను.

27. దానియేలు రాజుతో దేవరవారడిగిన రహస్య మును జ్ఞానులు, శాకునికులు, మాంత్రికులు తెలియ జేయలేరు.

28. కాని రహస్యములెరిగించు దేవుడు పరలోకమున ఉన్నాడు. ఆయన భవిష్యత్తులో ఏమి జరుగునో దేవరవారికి తెలియజేసెను. ఏలినవారు పడుకపై పరుండియున్నప్పుడు కలలోగాంచిన దర్శనమిది.

29. ఏలిక నిద్రించునపుడు భవిష్యత్తును గూర్చి కలగింరి. రహస్యములనెరిగించు దేవుడు జరుగబోవు కార్యములను తమకు తెలియజేసెను. 30. నేను ఇతరులకంటె తెలివైనవాడనని దేవుడు నాకు ఈ రహస్య మును తెలియజేయలేదు. ప్రభువులవారు తమ స్వప్నా ర్థమును ఎరుగుటకును, తమ ఆలోచనల భావమును గ్రహించుటకును ఆయన నాకు ఈ సంగతిని వెల్లడి చేసెను.

31. ఏలికదర్శనమున ఒక మహావిగ్రహము తమముందట నిలిచియుండుట గాంచితిరి. అది తళతళమెరయుచు భీతిగొలుపుచుండెను.

32. దాని తలను మేలిమి బంగారముతో చేసిరి. వక్షమును చేతులను వెండితో చేసిరి. ఉదరమును తొడలను కంచుతో చేసిరి.

33. కాళ్ళను ఇనుముతో చేసిరి. పాదములను కొంతవరకు ఇనుముతోను, కొంత వరకు మ్టితోను చేసిరి.

34. తమరు ఆ బొమ్మవైపు చూచుచుండగా, చేతిసహాయము లేకుండగనే తీయ బడిన ఒకరాయి, ఇనుముతో మ్టితో చేసిన ఆ బొమ్మ కాళ్ళకు తగిలి ఆ కాళ్ళను ముక్కలు ముక్కలు చేసెను.

35. వెంటనే ఇనుము, మన్ను, కంచు, వెండి, బంగార ములు పిండి అయ్యెను. అవి వేసవిలో కళ్ళమున కనిపించు పొట్టువలెనయ్యెను. గాలికి ఆ పిండి లేచి పోయెను. తరువాత ఆ ప్రతిమ జాడకూడ కనిపింప లేదు. కాని విగ్రహమును పడగ్టొిన ఆ రాయి కొండవలె పెరిగి భూలోకమంతటను వ్యాపించెను.

36. ఇది కల. ఇక ప్రభువుల వారికి ఈ కల భావమును వివరింతుము.

37. ఏలిక రాజులకు రాజు, పరలోకమందున్న దేవుడు తమరిని చక్రవర్తిని చేసెను. మీకు అధికారమును, శక్తిని, కీర్తిని దయచేసెను.

38. ఆయన మిమ్ము నరలోకమునకును, జంతు పక్షికోటుల కును రాజును చేసెను. ఆ బొమ్మ బంగారుతల మీరే.

39. మీ తరువాత మీ సామ్రాజ్యముకంటె చిన్నది మరియొకి వచ్చును. దాని తరువాత మూడవదిగా కంచుసామ్రాజ్యము వచ్చును. అది లోకమంతిని ఏలును.

40. దాని తరువాత ఇనుమువలె బలమైన నాల్గవ సామ్రాజ్యము వచ్చును. అది అన్నిని పడగ్టొి ముక్కలుచేయును. ఇనుము అన్నిని బ్రద్దలు చేయు నట్లే అది పూర్వపు సామ్రాజ్యములన్నింని పడగ్టొి ముక్కలుచేయును.

41. మీరు విగ్రహము పాదములు కొంతవరకు ఇనుముతోను, కొంతవరకు మ్టితోను చేయబడియుండుటను చూచితిరి. అట్లే ఆ నాలుగవ సామ్రాజ్యము రెండుగా చీలిపోవును. మ్టిని ఇనుముతో కలిపిరి. కనుక ఆ రాజ్యమునకు ఇనుమునకు ఉన్నంత బలముండును.

42. బొమ్మ పాదాలవ్రేళ్ళలో ఇనుము, మన్ను కలిసియున్నవికదా! అట్లే సామ్రాజ్యమున కొంతభాగము బలముగ కొంతభాగము దుర్బలముగ ఉండును.

43. మీరు ఇనుము మ్టితోకలసియుండు టను చూచితిరి. అట్లే ఆ సామ్రాజ్యములోని ఉభయ భాగముల రాజులు వివాహసంబంధము ద్వారా ఐక్యము కాగోరుదురు. అయినను ఇనుము మ్టితో కలియనట్లే ఆ ఉభయ రాజ్యములరాజులు కలియరు.

44. ఆ రాజుల కాలమున పరలోకాధిపతియైన దేవుడు అంతములేని సామ్రాజ్యమును నెలకొల్పును. అది అజేయమై ఆ రాజ్యములన్నిని కూలద్రోసి శాశ్వతముగా మనును.

45. మీరు కొండనుండి చేతిసహాయము లేకయే రాయితగులుటను చూచితిరి. అది ఇనుము, కంచు, మన్ను, వెండి, బంగారము లతో చేసిన విగ్రహమును పడగొట్టుటను గాంచితిరి. మహాదేవుడు భవిష్యత్తులో ఏమిజరుగునో మీకు తెలియజేయుచున్నాడు. నేను మీకలను దానిభావ మును యథాతథముగా తెలియజేసితిని”.

రాజు దానియేలును బహూకరించుట

46. అపుడు నెబుకద్నెసరురాజు దానియేలు ముందటసాగిలపడెను. అతనికి బలిని అర్పించి సాంబ్రాణిపొగ వేయవలెనని ఆజ్ఞాపించెను.

47. అతడు దానియేలుతో ”నిక్కముగా నీ దేవుడు దేవాధి దేవుడు, రాజాధిరాజు, రహస్యములను బయలు పరచువాడు. నీవు ఈ రహస్యమును వెల్లడి చేయు టయే అందుకు నిదర్శనము” అనెను.

48. అతడు దానియేలునకు ఉన్నతపదవినొసగి ప్రశస్తమైన బహు మతులనిచ్చెను. అతనిని బబులోనియా సంస్థానము నకు అదిపతిగా చేసెను. బబులోనియా జ్ఞానులెల్లరికిని  పెద్దను చేసెను.

49. దానియేలు వేడుకోలుపై రాజు షడ్రకును, మేషకును, అబేద్నెగోను బబులోనియా దేశమునకు పర్యవేక్షకులుగా నియమించెను. దానియేలు మాత్రము రాజు ఆస్థానముననే ఉండెను.

Previous                                                                                                                                                                                                    Next