దానియేలు దర్శనములు

నాలుగు మృగముల దర్శనము

7 1. బెల్షస్సరు బబులోనియాను ఏలిన మొదియేట దానియేలు పడుకపై పరుండి కలగనెను. రేయి దర్శన మును చూచెను. ఆ కలను సంక్షేపముగా వ్రాసి పెట్టెను. దాని వృత్తాంతమిది: 2. ”ఆ రేయి నేను చూచిన దృశ్యమిది. నాలుగు దిక్కులనుండి వాయు వులు బలముగా వీచుచు మహాసాగరమును అల్లకల్లోలము చేయుచుండెను.

3. ఆ సాగరము నుండి వేరువేరు ఆకారములుగల గొప్పమృగములు నాలుగు వెలుపలికి వచ్చెను.

4. మొదిది సింహము వలె నుండెను. కాని దానికి గరుడపక్షి రెక్కలు కలవు. నేను చూచుచుండగనే దాని రెక్కలు విరిగిపోయెను. ఆ మృగమును పైకెత్తగా అది నరునివలె నిలుచుండెను. దానికి నరునివిం మనస్సు ఇవ్వబడెను.

5. రెండవమృగము వెనుకి కాళ్ళపై నిలుచున్న ఎలుగుబింవలె నుండెను. దాని కోరల మధ్య మూడు ప్రక్కటెముకలుండెను. ఒక శబ్ధము దానితో ”నీవు నీ ఇష్టము వచ్చినంత మాంసమును భక్షింపుము” అని చెప్పెను.

6. నేను చూచుచుండగా మరియొక మృగము కనిపించెను. అది చిరుతపులివలె నుండెను. కాని దాని వీపుపై పక్షిరెక్కల విం రెక్కలు నాలుగుండెను. దానికి నాలుగు శిరస్సులుండెను. ఆ మృగము అధికారమును బడసెను.

7. నేను చూచుచుండగా నాలుగవ మృగము కనిపించెను. అది మిక్కిలి బలముగను, భీకరముగను, ఘోరముగను ఉండెను. అది ఇనుపపండ్లతో తన యెరలను చీల్చితినెను. మిగిలిన భాగములను నజ్జు నజ్జుచేసి కాళ్ళతోత్రొక్కెను. ఇతర మృగములవలె గాక దానికి పదికొమ్ములుండెను.

8. నేను ఆ కొమ్ముల వైపు పారజూచుచుండగా వాని నడుమ మరియొక చిన్నకొమ్ము పుట్టెను. అది అంతకు పూర్వమున్న కొమ్ము లను మూడింని సమూలముగా పెరికివేసెను. ఈ కొమ్మునకు నరుల కన్నులును, ప్రగల్భములు పలుకు నోరును ఉండెను.

శాశ్వతజీవి, మనుష్యకుమారుని గూర్చిన దర్శనము

9.           నేను చూచుచుండగా

               సింహాసనములను అమర్చిరి.

               శాశ్వతజీవి ఒకడు

               సింహాసనముపై ఆసీనుడయ్యెను.

               అతని వస్త్రములు మంచువలె తెల్లగా నుండెను. తలవెంట్రుకలు  తెల్లని ఉన్నివలె

               నిర్మలముగా నుండెను.

               అగ్నివిం చక్రములపైనున్న అతని సింహాసనము

               అగ్నివిం జ్వాలలతో మండుచుండెను.

10.         ఆ సింహాసనమునుండియు,

               అతని ఎదుినుండియు

               అగ్నివిం ప్రవాహము పారుచుండెను.

               వేనవేలుబంటులు అతనికి

               ఊడిగము చేయుచుండిరి.

               లక్షలకొలది సేవకులు

               అతని ఎదుట నిలిచియుండిరి.

               అంతట న్యాయస్థానమున

               పని ప్రారంభముకాగా గ్రంథములను విప్పిరి.

11. నేను చూచుచుండగా ఆ చిన్నకొమ్ము ఇంకను గొప్పలు చెప్పుకొనుచుండెను. నేను చూచు చుండగా వారు ఆ నాలుగవ మృగమును చంపినట్లు కనబడెను. దాని కళేబరమును మంటలలోపడవేసి నాశనము చేసిరి.

12. మిగిలిన ఆ మృగములు తమ అధికారమును కోల్పోయెను. కాని సమయము ఆసన్న మగువరకు అవి సజీవులమధ్య ఉండవలెనని, నిర్ణ యింపబడెను.

13.          నేను ఆ రాత్రి కలిగిన దృశ్యమును

               ఇంకనూ చూచుచుండగ మేఘారూఢుడైన మనుష్య కుమారుని పోలినవాడు వచ్చుటను గాంచితిని.

               అతడు ఆ శాశ్వతజీవి1 సన్నిధిని ప్రవేశింపగా

               అతడిని ఆ శాశ్వతజీవి

               సముఖమునకు కొనిపోయిరి.

14.          ఆ మనుష్యకుమారుడు పరిపాలనమును,

               మహిమను, రాజ్యాధికారమును బడసెను.

               సకల దేశములకును, జాతులకును,

               భాషలకును చెందిన ప్రజలెల్లరును

               ఆయనను సేవించిరి.

               ఆయన పరిపాలన శాశ్వతమైనది.

               అది ఎన్నికిని తొలగిపోదు.

               ఆయన రాజ్యమునకు అంతములేదు.

దర్శన భావమును ఎరిగించుట

15. ఆ దర్శనమును చూచి నేను భీతితో కంపించితిని.

16. నేనచట నిలుచున్న వారిలో ఒకని చెంతకుపోయి వీని భావమును వివరింపుమింని. అతడు ఆ దృశ్యముల అర్థమును వివరించుచు నాతో ఇట్లనెను: 17. ‘ఈ నాలుగు గొప్పమృగములను భూమిమీద నెలకొననున్న నలుగురు రాజులు.

18. అయితే మహోన్నతుని పవిత్రప్రజలే రాజ్యాధికార మును స్వీకరింతురు. వారు ఆ రాజ్యమును యుగ యుగములవరకు శాశ్వతముగా ఏలుదురు.’

19. అంతట నేను ఇతర మృగములకంటెను భిన్నముగానున్న ఆ నాలుగవ మృగమును గూర్చి ఎక్కువగా తెలిసికోగోరితిని. ఆ భయంకరమృగము కంచు గోళ్ళతోను, ఇనుపపండ్లతో తన ఎరలను చీల్చి తినుచుండెను. తినగా మిగిలిన భాగములను నజ్జునజ్జు చేసి కాళ్ళతో త్రొక్కుచుండెను.

20. ఇంకను నేను దాని తలమీది పదికొమ్ములను గూర్చి తెలిసికో గోరి తిని. వాని తరువాత మరియొక కొమ్ము ఎందుకు ప్టుినదో, అది మూడు కొమ్ములనెందుకు పెరికి వేసినదో యెరుగగోరితిని. ఆ కొమ్మునకు కన్నులు, ప్రగల్భములు పలుకు నోరును ఉన్నది. అది ఇతర కొమ్ములకంటె భీకరముగా కన్పించినది.

21. నేను చూచుచుండగా ఆ కొమ్ము దేవుని పవిత్రప్రజపై యుద్ధముచేసి వారినోడించెను.

22. అంతా శాశ్వతజీవివచ్చి మహోన్నతుని పవిత్ర ప్రజ లకు అనుకూలముగా తీర్పుచెప్పెను. దేవుని పవిత్ర ప్రజలు రాజ్యాధికారమును స్వీకరించు సమయము ఆసన్నమైనదని నేను గ్రహించితిని.

23. నేనడిగిన వ్యక్తి నా ప్రశ్నకిట్లు బదులు చెప్పెను: ‘ఈ నాలుగవ మృగము నేలపై నెలకొననున్న నాలుగవ రాజ్యము. అది ఇతర రాజ్యములకంటెను భిన్నముగా నుండును. అది భూమినంతిని నలగగ్టొి తన కాళ్ళతో త్రొక్కును.

24. పదికొమ్ములు ఆ రాజ్య మునేలు పదిమంది రాజులను సూచించును. అటు పిమ్మట మరియొక రాజు వచ్చును. అతడు పూర్వ రాజులకంటె భిన్నముగానుండును. ఆ రాజులలో ముగ్గురిని కూల్చివేయును.

25. అతడు మహోన్న తుడైన దేవునికి వ్యతిరేకముగా మాటలాడును. ఆ ప్రజల నియమములను పండుగలను మార్చజూచును. పవిత్రప్రజలు మూడున్నర ఏండ్లపాటు అతని ఆధీన మున ఉందురు.

26. అంతట దేవుడు న్యాయసభను జరిపి అతని అధికారమును రూపుమాపి అతనిని మట్టుపెట్టును.

27. మహోన్నతుడైన దేవుని పవిత్ర ప్రజలు ఆ రాజ్యమును, అధికారమును, భూమిమీది సకల రాజ్యముల వైభవమును స్వీకరింతురు. వారి రాజ్యము శాశ్వతముగా నిలిచియుండును. భూమిమీది పాలకులు వారిని సేవించి వారికి విధేయులగుదురు’.                    

28. ఆ వృత్తాంతముయొక్క ఆంతర్యమిది. దానియేలు అయిన నాకు సంబంధించినంత వరకు, నేను మిక్కిలిగా భీతిల్లి వెలవెలపోతిని. ఈ సంగతిని నా మనస్సులోనే ఉంచుకొింని”.

Previous                                                                                                                                                                                                   Next