మహాదర్శనము, కోపకాలము నారబట్టల నరుని దర్శనము

10 1. కోరెషు పారశీకమునకు రాజుగానున్న కాలమున మూడవయేట బెల్తెషాజరు అను మారుపేరు గల దానియేలునకు ఒక సందేశము తెలియపరప పడెను.అది నిజమైనదేగాని దానిభావమును గ్రహించుట మాత్రము చాలకష్టము. దాని భావము అతనికి దర్శన మున తెలియచేయబడెను.

2. ఆ సమయమున నేను మూడువారముల కాలము శోకించుచుింని.

3. మంచి భోజనమును గాని, మాంసమునుగాని భుజింపలేదు. ద్రాక్షాసారాయ మును సేవింపలేదు. అభ్యంగనము చేసికోలేదు.    

4. సంవత్సరము మొది నెల ఇరువది నాలుగవ దినమున నేను తిగ్రిసు నదిఒడ్డున నిలిచియుింని.    

5. నేను పైకి చూడగా నారబట్టలు తాల్చి, మేలిమి బంగారపు నడికట్టు ధరించిన నరుడొకడు కనిపించెను.

6. అతని శరీరము రత్నమువలె మెరయుచుండెను. ముఖము మెరుపువలె మెరయుచుండెను. కన్నులు అగ్నివలె వెలుగుచుండెను. కాలుచేతులు మెరుగు ప్టిెన కంచువలె ప్రకాశించుచుండెను. స్వరము పెద్ద జనసమూహము స్వరమువలెనుండెను.     

7. దర్శనమును చూచినవాడను నేనొక్కడినే. నాతోనున్న వారికేమియు కనిపింపలేదు.కాని వారు భయపడి పారిపోయి దాగుకొనిరి.

8. నేను ఒక్కడనే మిగిలియుండి ఆ మహాదర్శనమును చూచితిని. నా బలము సన్నగిల్లెను.నా ముఖరూపము పూర్తిగా మారెను.

9. నేను అతని స్వరమువిని నేలపై బోరగిలపడి స్పృహ కోల్పోతిని.

10. అంతట ఒక చేయి నన్ను పట్టుకొని క్రిందపడియున్న నన్ను మోకాళ్ళ మీదికి, చేతుల మీదికి లేపెను. నేనింకను వణకుచునే యుింని.

11. అతడు ”దానియేలూ! దేవునికి నీవనిన ఇష్టము. నీవు పైకి లేచి నేను చెప్పునది జాగ్రత్తగా వినుము. దేవుడు నన్ను నీ చెంతకు పంపెను” అనెను. అతడిట్లు పలుకగా నేను లేచి నిలుచుింని. కాని యింకను వణకుచునే యుింని.

12. అంతటతడు నాతో ”దానియేలూ! భయపడ కుము. జ్ఞానమును బడయుటకుగాను నీవు దేవుని ఎదుట వినయము ప్రదర్శించిన మొదినాి నుండియు ప్రభువు నీ మొర వినెను. నీ ప్రార్థననుబ్టి నేను వచ్చి తిని.

13. పారశీక రాజ్యమునకు కావలికాయు దేవదూత ఇరువది ఒక్క దినములు నన్ను ఎదిరించెను. నేను  పారశీక దేశమున  ఒంటరిగానుండుట  చూచి మిఖాయేలు అను దేవదూత నాకు సాయము చేసెను.

14. నీ ప్రజలకు భవిష్యత్తులో ఏమి జరుగునో నీవు గ్రహించుటకుగాను నేను ఇచ్చికివచ్చితిని. ఇది భవిష్యత్తును గూర్చిన దర్శనము” అని అనెను.

15. అతడిట్లు చెప్పగా నేనేమియు బదులు పలుకక నేలవైపు చూడసాగితిని.

16. అంతట నరాకృతిలో నున్న ఆ దేవదూత చేయిచాచి నా పెదవులుముట్టెను. నేన తనితో ”అయ్యా! ఈ దర్శనము నన్ను మిక్కిలి బలహీ నుని చేసెను. నేను నా వణకును ఆపుకోజాలకున్నాను.

17. నాస్థితి బానిస తనయజమానిముందు నిలిచి యున్నట్లున్నది. నాకు ఊపిరాడుటలేదు. బలము నులేదు. ఇక నేను నీతో ఎట్లు మ్లాడగలను?” అంిని.

18. మరల అతడు నన్ను తాకెను. నాకు బలము వచ్చెను.

19. అతడు ”దేవునికి నీవు అనిన ఇష్టము కనుక నీవు దేనికి భయపడకుము. చింతింప కుము” అని చెప్పెను. అతడట్లు పలుకగా నాకెక్కువ సత్తువ కలిగెను. నేనతనితో ”అయ్యా! నీవు  నన్ను ధైర్యపరచితివి, కనుక ఇపుడు నీవు ఆజ్ఞ ఇమ్ము” అని అంిని.

20-21. అతడిట్లనెను: ”నేను నీ చెంతకెందుకు వచ్చితినో నీకు తెలియునా? సత్యగ్రంథమున ఏమి వ్రాయబడియున్నదో  నీకు  తెలియజేయుటకొరకే. నేనిపుడు తిరిగిపోయి పారశీకదేశమునకు కావలి కాయు దేవదూతతో పోరాడవలెను. తరువాత గ్రీకు దేశమునకు కావలికాయు దేవదూతతో పోరాడవలెను. యిస్రాయేలు దేశమునకు కావలికాయు మిఖాయేలు తప్ప నాకు తోడ్పడువారు ఎవరును లేరు.

Previous                                                                                                                                                                                                    Next