బేలు దేవత, ఘటసర్పము

దానియేలు, బేలు పూజారులు

14 1. అస్తువాగేసురాజు మరణానంతరము పారశీ కుడైన కోరెషు అతని రాజ్యమునేలెను.

2. దానియేలు అతడి ఆప్తమిత్రులలోనొకడు. రాజు తన సలహాదారు లందరిలోను దానియేలును ఉత్తమునిగా గణించెను.       

3. బబులోనీయులకు బేలు అను విగ్రహము కలదు. ప్రతిదినము ప్రజలు ఆ ప్రతిమకు పండ్రెండు కుంచముల మేలిమిపిండిని నలువది గొఱ్ఱెలను, ఏబది కూజాల ద్రాక్షారసమును అర్పింపవలెను.

4. కోరెషు బేలుని దేవునిగా గణించి ప్రతిదినము అతడిని ఆరాధించుటకు వెళ్ళెడివాడు. కాని దానియేలు తన దేవుని మాత్రమే పూజించుచుండెను.

5. ఒకనాడు రాజు ”నీవు బేలునెందుకు పూజింపవు?” అని దానియేలునడిగెను. అతడు ”నేను నరమాత్రులు చేసిన బొమ్మలను కొలువను. భూమ్యా కాశములను సృజించినవాడును, నరులందరికి అధి పతియును, సజీవుడైన దేవునిమాత్రమే ఆరాధింతును” అని బదులు చెప్పెను.

6. అందుకు రాజు ”బేలు సజీవుడైన దేవుడని నీవు నమ్మవా? అతడు ప్రతిదినమును ఏపాి అన్న పానీయములు పుచ్చుకొనునో నీకు తెలియదా?” అని ప్రశ్నించెను.

7. దానియేలు ఫక్కున నవ్వి ”ప్రభువుల వారు మోసపోకుందురుగాక! మీరు సేవించు ఈ బేలు బండారము లోపలమన్ను బయటకంచు మాత్రమే. అతడేనాడును అన్నపానీయములను ముట్టుకొని యెరుగడు” అని పలికెను.

8-10. ఆ మాటలకు రాజు కోపము తెచ్చుకొని  బేలు పూజారులను పిలిపించి వారితో ”వినుడు! ఈ అర్పణములన్నిని బేలుదేవత ఆరగించుచున్నాడని రుజువు చేయరేని మీరెల్లరును చత్తురు. వీనిని బేలు దేవతయే భుజించుచున్నాడని నిరూపింతురేని, అతడు దేవుడుకాడని పలికినందుకు నేను దానియేలును చంపింతును”అని చెప్పెను. దానియేలు ఆ షరతుకు అంగీకరించెను. బేలు పూజారులు, వారి ఆలుబిడ్డలు కాకయే డెబ్బదిమంది ఉండిరి.

11. రాజు దానియేలుతో బేలుగుడిలో ప్రవే శించెను. అచట పూజారులు రాజుతో ”ఏలికా! మేమందరము బయికి పోయెదము. మీరే భోజన మును బల్లపైపెట్టుడు. ద్రాక్షారసమును కలుపుడు. మీరు బయికి వెళ్ళిన పిదప గుడి తలుపులు బిగించి వానికి రాజముద్ర వేయింపుడు.

12. ఉదయము మీరు తిరిగివచ్చిన పిమ్మట బేలు ఆ పదార్థము లన్నింని భక్షించియుండడేని మీరు మా తలలు తీయింపుడు, కాని అతడు వానిని భక్షించియుండెనేని, మామీద నేరములు మోపినందులకు దానియేలు తల క్టొింపుడు” అని అనిరి.    

13. ఈ మాటలు చెప్పుటకు పూజారులు ఏ మాత్రమును భయపడలేదు. ఎందుకన, వారు దేవళ ములోని బల్లక్రింద రహస్యద్వారమును తయారు చేసి కొని ప్రతిరాత్రి దేవాలయములోనికి పోయి నైవేద్య ములను ఆరగించుచుండిరి.

14. పూజారులు వెళ్ళిపోయిన తరువాత రాజు బేలు దేవతకు భోజనమర్పించెను. అంతట దానియేలు బూడిదను తెచ్చి దేవళములోపల చల్లుడని తన సేవకు లను ఆజ్ఞాపించెను. సేవకులు బూడిద చల్లుటను రాజుతప్ప మరియెవరును చూడలేదు. అటుపిమ్మట అందరు వెలుపలికి పోయి దేవాలయ ద్వారమును మూసి రాజముద్రవేసి వెళ్ళిపోయిరి.

15. ఆ రేయి పూజారులు అలవాటు ప్రకారము తమ ఆలుబిడ్డలతో రహస్యద్వారముగుండ దేవాల యములోనికి వచ్చి దేవతకర్పింపబడిన భోజనము నారగించి పానీయమును త్రాగిరి.

16. మరుసిరోజు వేకువనే రాజు, దానియేలును మందిరమునకు పోయిరి.

17. రాజు ”రాజముద్రలు భద్రముగానున్నవా?” యని దానియేలు నడిగెను. ‘ఉన్నవి’ అని అతడు జవాబు చెప్పెను.

18. గుడి తలుపులు తెరువగనే రాజు ఖాళీ బల్లలను చూచి ”బేలు దైవమా! నీవు నిక్కముగా గొప్ప వాడవు. నీ యందు మోసమేమియు లేదు” అని బిగ్గరగా అరచెను.  

19. కాని దానియేలు నవ్వి ”ప్రభువుల వారు దేవళములోనికి పోవుటకు ముందు ఈ నేలవైపు పార జూచి ఇచి పాదముద్ర లెవరివో గుర్తింపుడు”అనెను.

20. రాజు ”ఇచట పురుషుల, స్త్రీల, పిల్లల పాదముద్రలు కనిపించుచున్నవి” అని చెప్పెను.

21. అంతట అతడు మిగుల ఆగ్రహము చెంది పూజా రులను, వారి కుటుంబసభ్యులను బంధించి నా యెదు ికి కొనిరండని ఆజ్ఞాపించెను. వారు తాము ప్రతిరాత్రి బల్లమీద ప్టిెన భోజనమును తినుటకు దేవళ ములోనికి ప్రవేశించు రహస్యద్వారమును రాజునకు చూపించిరి.

22. రాజు ఆ పూజారులను చంపించి బేలుదేవత విగ్రహమును దానియేలు వశము చేసెను. అతడు ఆ ప్రతిమను, దేవళమును గూడ నాశనము చేయించెను.

దానియేలు ఘటసర్పమును చంపుట

23. బబులోనియా దేశములో పెద్దసర్పమొకి యుండెను. ఆ దేశ ప్రజలు దానిని ఆరాధించెడివారు.

24. రాజు దానియేలుతో ”నీవు ఈ సర్పము సజీవ మైన దైవముకాదని అనజాలవుకదా! కావున దీనిని పూజింపుము” అని అనెను.

25.  దానియేలు ”నేను ప్రభువును ఆరా ధించెదను. ఆయన మాత్రమే సజీవుడైన దేవుడు.

26. ఏలినవారు అనుమతినిత్తురేని నేను ఖడ్గమును గాని, దండమునుగాని వినియోగింపకయే ఈ సర్పమును చంపుదును” అని పలికెను. రాజు ”నేను నీకు అను మతిని ఇచ్చితిని” అని అనెను.

27. దానియేలు కీలును క్రొవ్వును వెంట్రుకలను కలిపి ఉడుకబెట్టెను. ఆ పదార్థమును ఉండలుచేసి పాముచే తినిపించెను. ఆ ఉండలను తినగా ఘట సర్పము పొట్టపగిలెను. అంతట దానియేలు రాజుతో ”మీరు పూజించు దైవముల్టివారే” అనెను.

28. బబులోనీయలు ఈ సంగతి తెలిసికొని ఆగ్రహముతో రాజుపై తిరుగబడిరి ”ఈ రాజు యూదుడయ్యెను. ఇతడు మొదట బేలుదేవతను నాశ నముచేసి పూజారులను చంపించెను. ఇప్పుడు మన ఘటసర్పమునుగూడ చంపించెను” అని అరచిరి.

29. వారు రాజును సమీపించి ”నీవు దానియేలును మాకు అప్పగింపుము. లేదేని మేము నిన్నును, నీ కుటుంబ మును హతము చేయుదుము” అని బెదరించిరి.

30. వారు రాజును ఒత్తిడిచేయగా అతడు తప్పించు కోజాలక దానియేలును వారికప్పగించెను.

సింహముల గుంటలో దానియేలు

31. ఆ ప్రజలు దానియేలును సింహముల గుంటలో పడద్రోయగా అతడు ఆరురోజులపాటు అందే ఉండెను.

32. ఆ గుంటలో ఏడు సింహము లుండెను. వానికి ప్రతిరోజు ఇద్దరు నరులను, రెండు గొఱ్ఱెలను ఆహారముగా వేసెడివారు. కాని ఈ ఆరు దినములు వానికి ఎి్టతిండియు పెట్టరైరి. అవి దానియేలును తప్పక మ్రింగివేయవలెనని అట్లు చేసిరి.

33. ఆ కాలమున హబక్కూకు ప్రవక్త యూద యాలో నుండెను. అతడు పులుసు వండి రొట్టెను ముక్కలుగాత్రుంచి దానిలో పడవేసెను. ఆ పులుసును పాత్రములో పోసికొని పొలమున పంటకోయు పని వారికి వడ్డించుటకు తీసికొని పోవుచుండెను.

34. అపుడు దేవదూత అతడితో ”ఓయి! నీవీ పులుసును తీసికొనిపోయి బబులోనియా దేశమున సింహముల గుంటలోనున్న దానియేలున కిమ్ము” అని చెప్పెను.

35. హబక్కూకు ”అయ్యా! నేనెప్పుడును బబులోనియాను చూడలేదు. ఆ సింహముల గుంట జాడయే నాకు తెలియదు” అని పలికెను.

36. దేవదూత ప్రవక్త తలవెంట్రుకలు పట్టుకొని అతనిని వాయువేగముతో బబులోనియాకు కొని పోయి సింహముల గుంటప్రక్కన దింపెను.

37. హబక్కూకు ”దానియేలూ! దానియేలూ! నీవు దేవుడు పంపిన ఈ భోజనమును ఆరగింపుము” అనెను.

38. ఆ మాటలు విని దానియేలు ”దేవా! నీవు నన్ను స్మరించుకొింవి. నిన్ను ప్రేమించువారిని నీవేనాడును చేయి విడువవుగదా!” అని ప్రార్థించెను.

39. అంతటతడు లేచి ఆ పులుసును ఆరగించెను. వెంటనే దేవదూత హబక్కూకును స్వీయదేశమునకు చేర్చెను.

40. దానియేలును సింహములకు మేతగా వేసిన తరువాత ఏడుదినముల పిమ్మట రాజు అతనికొరకు శోకించుటకుగాను సింగములగుంట యొద్దకు వెళ్ళెను. అతడు ఆ గుంటలోనికి తొంగిచూడగా దానియేలు దానిలో కూర్చుండియుండెను.

41. ఆ రాజు ”దానియేలు దేవుడవైౖన ప్రభూ! నీవెంత గొప్పవాడవు! నీవుతప్ప మరియొకదేవుడు లేడు” అని అరచెను.

42. అతడు దానియేలును బయికి లాగెను. దానియేలుపై కుట్రపన్నినవారిని ఆ గుంటలోనికి త్రోయించెను. అతడు చూచు చుండగనే సింహములు వారిని మ్రింగివేసెను.

Previous