6 1. సూర్యునిక్రింద నరులను వేధించు మరియొక అనర్థ కార్యమును గూడ నేను చూచితిని. ఇది వీరిపై బలముగా పని చేయుచున్నది.
2. దేవుడు ఒకనికి సంపదలు, భూములు, కీర్తిప్రతిష్టలు మొదలైన వాని నెల్ల దయచేసెననుకొందము. ఇక అతడు కోరుకొనున దేమియు లేదు. కాని భగవంతుడు అతనిని ఈ సొత్తు అనుభవింపనీయడు. అన్యుడొకడు దానిననుభవించును. ఇదియును వ్యర్థము, అక్రమము.
3. ఒకనికి నూరుగురు బిడ్డలుండవచ్చును. అతడు చాల యేండ్లు జీవింపవచ్చును. అయినను అతడు సుఖములను అనుభవింపక, గౌరవ ప్రదముగా భూస్థాపనము గావింపబడనియెడల, వాని గతికంటె పడిపోయిన పిండముయొక్క గతి మెరుగుకదా?
4. అది చీకినుండి వచ్చును,
మరల చీకిలోనికి వెడలిపోవును.
చీకి దాని పేరును కమ్మివేయును.
5. అది వెలుగును చూడజాలదు.
మరియేమియు తెలిసికోజాలదు.
అయినను పై నరునికంటె
దాని గతి నెమ్మది గలది.
6. ఆ నరుడు రెండువేల యేండ్లు జీవించినను, సుఖములను అనుభవింపడేని ఏమి లాభము? కడన అందరును ఒకే తావును చేరుకొందురుకదా!
7. నరుని కృషియంతయు పొట్టకూి కొరకే.
అయినను అతని మనస్సు
ఏనాడును సంతృప్తినొందదు.
8. బుద్ధిహీనునికంటె విజ్ఞాని యేమి మెరుగు? జీవి తమునెట్లు గడపవలయునో తెలిసికొనినంత మాత్ర మున పేదవానికి ఒరిగినదేమి?
9. ఇదియునువ్యర్థము, గాలికై ప్రయాసపడుటయే. మనకు లేని దానిని ఆశించుటకంటె, ఉన్నదానితో సంతృప్తి చెందుటమేలు.
10. ఇప్పుడు జరుగునదంతయు ఇంతకు పూర్వమే నిర్ణయింపబడినది. దాని స్వభావము మనకు తెలియును. నరుడు తనకంటె బలవంతుడైన వానితో వాదింపజాలడు.
11. ఎక్కువగా మ్లాడుట నిక్కముగా నిష్ప్రయోజనము. దానివలన ఎి్ట లాభమునులేదు.
12. నరుడు కొద్ది కాలము మాత్రమే జీవించును. అదియును అర్థము లేని జీవితము. అతనిజీవితము నీడవలె గతించును. ఈ హ్రస్వకాలపు మనుగడలో అతనికేది మేలో ఎవడు చెప్పగలడు? అతడు గతించిన తరువాత లోకములో ఏమి జరుగునో వానికెవడు చెప్పగలడు?