ఉపోద్ఘాతము:
పేరు: నెహెమ్యా హకల్యా కుమారుడు (1:2). బబులోను చెరలోనుండగా పర్షియా రాజు పరిచారకుడు (2:1). కోరేషు శాసనముననుసరించి యెరూషలేము వెళ్ళి పునరావాసము పొందుతున్న యూదుల క్షేమ సమాచారాలు తరచు సేకరించెడివాడు. వారికొరకు ప్రార్థిస్తూ, వారి యోగక్షేమాలను కాంక్షించువాడు.
కాలము: క్రీ.పూ. 445 – 432 మధ్యకాలపు బబులోను ప్రవాసానంతర వృత్తాంతములు ఉన్నాయి.
రచయిత: హీబ్రూ బైబులులో, గ్రీకు బైబులులో ఎజ్రా, నెహెమ్యా ఒకే గ్రంథముగా వుాంయి. క్రీ.శ 4వ శతాబ్ధములో లాిన్ బైబులులో వాిని రెండుగా విభజించిరి.
చారిత్రక నేపథ్యము: క్రీ.పూ. 537లో జెరుబ్బాబెలు నాయకత్వములో మొది నిర్వాసితులగుంపు యెరూషలేమునకు తిరిగివచ్చినది. 458లో రెండవ నిర్వాసితులగుంపు తిరిగివచ్చినది. ఈ రెండవ నిర్వాసితగుంపుకు ఎజ్రా నాయకత్వము వహించెను. 445లో చివరి సమూహానికి నెహెమ్యా నాయకత్వము వహించెను. నెహెమ్యా ఈ గ్రంథాన్ని తన ఆత్మకథగా వ్రాసుకున్నాడని పండితుల అభిప్రాయము. నెహెమ్యా గ్రంథము తర్వాత, క్రీస్తుపూర్వము 430 నుండి మలాకి గ్రంథము వరకు మనకు పూర్వనిబంధనచరిత్ర వివరాలు తెలియవు.
ముఖ్యాంశములు: ఎజ్రా గ్రంథము యెరూషలేము దేవాలయ నిర్మాణానికి, బలిఅర్పణల పునఃవ్యవస్థీకరణకు ప్రాధాన్యతనివ్వగా, నెహెమ్యా గ్రంథము శిధిలమైన యెరూషలేము పట్టణ ప్రాకారాలను కట్టుదిట్టము చేయుటకు ప్రాధాన్యతనిచ్చెను. ఇందునిమిత్తము నెహెమ్యా రాజును ప్రసన్నము చేసుకొని యెరూషలేము ప్రధానాధిపతిగా నియమింపబడెను. తన పలుకుబడినంతా వినియోగించి సమరీయులు, వారి అధిపతి సన్బల్లటు కల్పించిన ప్రతి అవరోధాన్ని ఎదిరించి తనపని పూర్తిచేసెను. అందుకే యూదులలో సముచితస్థానాన్ని పొందెను.
క్రీస్తుకు అన్వయము: బబులోను చెరలోనున్న యూదయ ప్రజలను విడిపించి యెరూషలేమునకు తిరిగి రప్పించడము, నెహెమ్యా తన ప్రజల వేదనలలో మమేకమై ప్రజలతరపున నిలిచి, యెరూషలేము నగరప్రాకారాల పునఃప్రతిష్ఠ పనులు చేపట్టడము క్రీస్తు తనవారితో మమేకమై యుండుటను ప్రతిబింబించును.