12 1. కనుక నీవు యువకుడుగానున్నపుడే, ఈ జీవితము మీద నాకిక ఆసక్తిలేదని నుడువవలసిన దుర్దినములు ప్రాప్తింపకమునుపే, నీ సృష్టికర్తను స్మరించుకొనుము.
2. ఆ కాలమున నీకు సూర్యచంద్ర నక్షత్రాదుల కాంతి స్పష్టముగా కన్పింపదు. జోరున కురియు విషాద మేఘములు ఏనాడును విడిపోవు.
3. అపుడు ఇంతవరకు నిన్ను కాపాడిన చేతులు వణకును.
ఇంతదనుక బలముగానున్న నీ కాళ్ళు కూలబడును. నీ పండ్లురాలిపోవును.
నీ కన్నులు వెలుతురును సరిగా చూడజాలవు.
4. వీధిలోని తలుపులు శబ్దములను చేయవు.
తిరుగిరాళ్ళ ధ్వని తగ్గిపోవును.
పిట్టకూతకు ఒకడు లేచును.
సంగీతమును చేయు స్త్రీలు,
నాదము చేయువారందరును
నిశ్శబ్దముగా ఉందురు.
5. అపుడు నీవు మెరకలను ఎక్కజాలవు.
అటునిటు కదలుటగూడ ప్రమాదకరమగును.
నీ తల వెంట్రుకలు నెరసి తెల్లనగును.
నీవు కష్టముతోగాని అటునిటు కదలజాలవు.
నీ యెదలోని కోర్కెలన్నియు సమసిపోవును.
అపుడు నరుడు తన శాశ్వతనివాసమునకు వెడలి పోవును. అతని కొరకు శోకించువారు వీధులలో ఇటు నటు తిరుగాడుదురు.
6. అపుడు వెండి గొలుసు తెగిపోవును.
బంగారు గిన్నె బద్ధలైపోవును.
ఊటయొద్ద కుండ ముక్కలైపోవును.
బావిమీద గిలక విరిగిపోవును.
7. నరుని దేహము ఏ మ్టినుండి వచ్చినదో ఆ మ్టిలోనికి తిరిగిపోవును. అతని ఆత్మ దానిని దయచేసిన దేవుని చేరుకొనును.
8. కనుక అంతయు వ్యర్థమే. సర్వము వ్యర్థమేనని ఉపదేశకుడు చెప్పు చున్నాడు.
తుదిపలుకులు
9. ఉపదేశకుడు విజ్ఞాని. అతడు తనకు తెలిసిన విజ్ఞానమును తోడి ప్రజలకుగూడ బోధించెను. ఆ జ్ఞాని చాలసామెతలను పఠించి వాని భావమును జాగ్రత్తగా పరిశీలించిచూచెను.
10. అతడు చదువరు లకు ప్రీతినిగొల్పు భాషలో గ్రంథము వ్రాసెను. అతడు వ్రాసినది సత్యమే.
11. విజ్ఞానులవాక్యములు కాపరులు గొఱ్ఱెల మందలను అదలించుటకు వాడు ములుకోలల వింవి. అవి నేలలో లోతుగా నాిన మేకులవలె స్థిరముగా నుండిపోవును.
12. కుమారా! కడన ఒక్క హెచ్చరిక చేయు చున్నాను. పుస్తకరచనకు అంతములేదు. అధిక పఠనము అలసట తెచ్చిపెట్టును.
13. ఇంతవరకు చెప్పినదాని సారాంశమేమనగా – దేవునికి భయపడి ఆయన ఆజ్ఞలను పాింపుము. నరుని ప్రధాన ధర్మమిదియే.
14. నరులు చేసిన పనులు మంచివికావచ్చును, చెడ్డవికావచ్చును. కాని వాని కన్నికిని దేవుడు తీర్పుతీర్చును.