1. ప్రభువు మోషేతో ఇట్లు నుడివెను: 2. ”ఎవడైన తోి యిస్రాయేలీయుడు తనకు అప్పగింపబడిన దానిని, కుదువప్టిెన సొమ్మును అతనికి తిరిగి ఈయక పోవుటవలనగాని, లేక అతని సొమ్మును అపహరించుటవలనగాని, లేక బలవంతముగా లాగు కొనుటవలనగాని, 3. లేక దొరికిన సొమ్ము దొరక లేదని బొంకుటవలనగాని, మనుష్యులు ఏమి చేసిన యెడల పాపులగుదురో వాటన్నింలోను దేని విషయ మైనను అబద్ధపుప్రమాణము చేసినయెడల 

4. అతడు ప్రభువునకు విరోధముగా పాపము కట్టుకొని అపరాధి యగును. ఎవడైన పైరీతిగా పాపము కట్టుకొనిన యెడల ఆ సొమ్మును తిరిగి ఇచ్చివేయవలయును.

5. అతడు తన తప్పిదమును గుర్తింపగనే నష్టపడిన వానికి పూర్తిగా సొమ్ము చెల్లింపవలయును. దానిలో ఐదవవంతు భాగము అదనపు సొమ్ముకూడ బలి అర్పించు దినమున ముట్టజెప్పవలయును.

6. అతడు నీవు ఏర్పరచిన వెల చొప్పున మందనుండి అవలక్షణములు లేని పొట్టేలును, యాజకునివద్దకు దోషపరిహారబలిగా కొనిరావలయును.

7. యాజకుడు ప్రభువు సమక్షమున అతనికి ప్రాయశ్చిత్తము చేయగా అతని దోషము పరిహారమగును.”

యాజకులు – బలులు

1. సంపూర్ణ దహనబలి

8. ప్రభువు మోషేతో ఇట్లు చెప్పెను: 9. ”దహన బలిని గూర్చి అహరోనును అతని కుమారులను ఇట్లు ఆజ్ఞాపింపుము. ఆ బలిని ఉదయమువరకును, రేయి అంతయు బలిపీఠముమీదనే వదలివేయవలయును. బలిపీఠముమీది అగ్ని దానిని దహించివేయును.

10. యాజకుడు నారబట్టలుతాల్చి బలిపీఠముమీది క్రొవ్వును కాల్చగా ఏర్పడిన బూడిదను తొలగించి బలిపీఠము ప్రక్కన పోయవలయును.

11. పిమ్మట అతడు నారబట్టలు తొలగించి మామూలు దుస్తులు తాల్చి ఆ బూడిదను శిబిరమువెలుపలికి కొనిపోయి శుభ్రమైనస్థలమున పోయవలయును.

12. బలిపీఠముమీది అగ్ని ఆరిపోరాదు. ప్రతి ఉదయము యాజకుడు దానిమీద కట్టెలుపేర్చును. ఆ నిప్పులమీద దహనబలిని అర్పించును. సమాధాన బలులలోని క్రొవ్వును కాల్చును.

13. బలిపీఠముమీది నిప్పు ఎప్పుడును మండుచునే ఉండవలయును, అది ఆరిపోరాదు.

2. ధాన్యబలి

14. ధాన్యబలి అర్పించు చట్టము ఇది. అహరోను కుమారులు ప్రభువుసన్నిధికి దానిని బలిపీఠము ఎదుికి కొనివచ్చును.

15. దానిలో పిడికెడు పిండిని, చేరెడునూనెను, మొత్తము సాంబ్రాణిని తీసికొని బలిపీఠము మీద కాల్చివేయును. ఆ బలి సువాసన వలన ప్రభువు సంతుష్టిచెందును. దహింపబడిన ఆ కొద్దిభాగము మొత్తము అర్పణకు సూచికయగును.

16. బలిలో మిగిలిన భాగముతో అహరోను పుత్రులు పొంగనిరొట్టెలు చేసికొని, సమావేశపు గుడారము యొక్క ఆవరణలో పవిత్రస్థలమున భుజింతురు.   

17. ఇది పొంగనిరొట్టెలుగా దహనబలినుండి ప్రభువు యాజకులకు ఇచ్చు భాగము. పాపపరిహారబలుల వలె, దోషపరిహార బలులవలె ఈ బలికూడ పరమ పవిత్రమైనది.

18. అహరోను వంశజులైన పురుషు లందరు ఈ దహనబలి నైవేద్యమును భుజింప వచ్చును. మీ తరతరములకు ఇది శాశ్వతమైన నియమము. ఈ భోజనమును ముట్టుకొను వారంద రును పవిత్రులగుదురు.”

19. ప్రభువు మోషేతో ఇట్లు చెప్పెను: ”అహరోను కుమారులైన యాజకులను అభిషేకించు తీరు ఇది.

20. అభిషేకదినమున యాజకుడు తూమెడు గోధుమపిండిలో పదియవవంతు, ఉదయమున సగము, సాయంకాలమున సగము అర్పింపవలయును.

21. ఆ పిండిలో నూనెకలిపి దానిని పెనముమీద కాల్చి రొట్టె చేయవలయును. ఆ రొట్టెను ముక్కలుచేసి ప్రభువునకు అర్పింపవలయును. దాని సువాసన వలన ప్రభువు సంతుష్టి చెందును.

22. అహరోను కుమారులైన యాజకులు అభిషేకదినమున ఈ నియమమును కలకాలము పాింపవలయును. ఈ బలిని పూర్తిగా దహింపవలయును.

23. యాజకుడు స్వయముగా సమర్పించుకొను ధాన్యబలిని సంపూర్ణ ముగా దహింపవలయునేగాని భుజింపరాదు.”

3. పాపపరిహారబలి

24. ప్రభువు మోషేతో ఇట్లనెను: ”నీవు అహరోను వంశజులైన యాజకులతో పాపపరిహారబలిని గూర్చి ఇట్లు చెప్పుము.

25. పాపపరిహారబలిలో అర్పించు బలిపశువులనుగూడ, దహనబలిలో అర్పించు బలి పశువులను వధించుచోటనే వధింపవలయును. ఇది మహాపవిత్రమైన బలి అగును.

26. ఈ బలిపశువును అర్పించు యాజకుడు సమావేశపుగుడారము యొక్క ఆవరణలో పవిత్రస్థలమున దానిని భుజింపవలయును.

27. ఈ బలిపశువు మాంసము సోకిన ప్రతి వస్తువు పరిశుద్ధమగును. దాని నెత్తురువలన బట్టలు మరకలైతే వానిని పవిత్రస్థలమున కడుగుకోవల యును.

28. బలిపశువు మాంసమును మ్టికుండలో వండినయెడల దానిని బ్రద్దలు చేయవలయును. ఇత్తడిపాత్రలో వండినయెడల దానిని తోమి జాగ్రత్తగా శుద్ధి చేయవలయును.

29. యాజకవంశజులైన పురుషులు ఈ బలిని భుజింపవచ్చును. ఇది మహా పవిత్రమైన బలి.

30. కాని ఏ పాపపరిహారపుబలిగా అర్పించు పశువునెత్తురును గుడారములోనికి కొని పోయి పాపములకు ప్రాయశ్చిత్తము చేయుటకు వినియోగింతురో ఆ పశువు మాంసమును మాత్రము భుజింపరాదు. దానిని అగ్నిలో దహింపవలయును.

Previous                                                                                                                                                                                                   Next  

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము