4. దోషపరిహార బలి

1. దోషపరిహారబలి పరమపవిత్రమైనది. దానిని అర్పించు విధానము ఇది.

2. సంపూర్ణ దహనబలులు అర్పించునప్పుడు పశువులను వధించుచోటనే దోష పరిహారబలి పశువును వధింపవలయును. దాని రక్తమును పీఠముచుట్టు చల్లవలయును.

3-4. దాని క్రొవ్వునంతిని – తోకకు అంటుకొనియున్న క్రొవ్వును, ప్రేవులమీది క్రొవ్వును, మూత్రగ్రంథులను మరియు వానిమీది క్రొవ్వును, కాలేయమునందలి క్రొవ్వును పీఠముమీద కాల్చివేయవలయును.

5. యాజకుడు ఈ క్రొవ్వునంతిని కాల్చి దహనబలిగా అర్పింపవలయును. ఇది దోషపరిహారబలి అగును.

6. ఈ బలి నైవేద్యమును యాజకుల కుటుంబ ములకు చెందిన పురుషులు మాత్రమే పవిత్ర స్థలమున భుజింపవలెను. ఇది పరమపవిత్రమైన నైవేద్యము.

యాజకుల భాగములు

7. పాపపరిహార బలికిని, దోషపరిహార బలికిని ఒకే నియమము వర్తించును. బలిపశువు మాంసము ప్రాయశ్చిత్తముచేయు యాజకునికి చెందును. 8. సంపూర్ణదహనబలిగా అర్పింపబడు పశువుచర్మము యాజకునిదే అగును. 9. పొయ్యిమీద వండినగాని, పెనముమీదగాని, బాణలిలోగాని వేయించిన ధాన్యబలి అర్పణచేయు యాజకునికి ముట్టును. 10. కాని అటుల వేయింపని ధాన్యబలి, దానిలో నూనె కలిపినను కలుపకున్నను, అహరోను కుమారులైన యాజకు లందరికి చెందును. వారందరును దానిని సమాన ముగా పంచుకొందురు.

5. సమాధాన బలి

1. కృతజ్ఞతాపూర్వకమైన బలి

11. ప్రభువునకు సమర్పించు సమాధానబలిని గూర్చిన నియమమిది.

12. ఎవడైనను కృతజ్ఞతా పూర్వకముగా బలిని అర్పింపగోరెనేని బలితోపాటు పొంగనిరొట్టెలుకూడ కొనిరావలయును. ఇవి నూనె కలిపిన లావుపాి రొట్టెలైనను కావచ్చును. నూనె రాసిన పలుచని రొట్టెలైనను కావచ్చును, నూనె కలిపిన మామూలు రొట్టెలైనను కావచ్చును.

13. సమాధానబలిరూపమైన కృతజ్ఞతాబలిలో పులిపిడి పదార్ధము కలిపిన పొంగిన రొట్టెలనుకూడ కొని రావలయును.

14. ఈ రొట్టెలలో ఒక్కొక్క రకమునకు ఒక్కొక్క దానిని దేవునికి ప్రతిష్టార్పణముగా అర్పింపవల యును. ఇవి బలిపశువు నెత్తుిని పీఠముమీద చిలుకరించు యాజకునికి చెందును.

15. బలిపశువు మాంసమును దానిని బలియిచ్చిననాడే భుజింప వలయును. మరునాికి ఏమియును అి్టపెట్టు కొనరాదు.

2. మ్రొక్కుబడి బలి

16. ఎవడైనను మ్రొక్కుబడిచేసిగాని, స్వేచ్ఛా పూర్వకముగాగాని సమాధానబలిని అర్పింపగోరెనేని బలిపశువును అర్పించిననాడే తినవలెను. మిగిలినది మరునాడుగూడ భుజింపవచ్చును. 17. కాని మూడవ నాికి మిగిలియున్న మాంసమును కాల్చివేయ వలయును.

సామాన్య నియమములు

18. ఎవడైనను బలిపశువు మాంసమును మూడవనాడు కూడ భుజించెనేని వాని బలిచెల్లదు.  అతనికి బలిఫలము లభింపదు. అది అపవిత్రమైన బలియగును. అి్ట మాంసమును భుజించినవాడు తన పాపఫలమును అనుభవించును.

19. బలిపశువు మాంసము అపవిత్రమైన వస్తువును తాకెనేని మైలపడును. అి్ట మాంసమును నిప్పులో కాల్చివేయవలయునేగాని భుజింపరాదు. శుద్ధిగానున్నవాడు ఎవడైనను సమాధానబలులందలి మాంసమును భుజింపవచ్చును.

20. కాని శుద్ధిలేనివాడు అి్ట మాంసమును భుజించినయెడల ప్రభువుసమాజమునుండి వెలివేయ బడును. 21. ఎవడైన నరులకుగాని, జంతువులకు గాని చెందిన అశుచికరమైన పదార్థములను ముట్టుకొని సమాధాన బలులందలి మాంసమును భుజించిన యెడల సమాజమునుండి వెలివేయబడును.”

22. ప్రభువు మోషేతో ఇట్లు చెప్పెను: ”నీవు యిస్రాయేలు ప్రజలతో ఇట్లు నుడువుము.

23. మీరు ఎద్దు, గొఱ్ఱె, మేకల క్రొవ్వును తినకూడదు.

24. ఏదైన జంతువు చనిపోయినపుడుగాని లేక వన్యమృగములచే చంపబడినపుడుగాని మీరు దాని క్రొవ్వును భుజింప రాదు. అయినను ఆ క్రొవ్వును ఇతర కార్యములకు వాడుకొనవచ్చును.

25. ప్రభువునకు దహనబలిగా అర్పింపబడిన బలిపశువుక్రొవ్వును భుజించువాడు ప్రభువు సమాజము నుండి వెలివేయబడును.

26. యిస్రాయేలీయులు ఎచట వసించినను పక్షి, జంతురక్తమును భోజనము నకు ఉపయోగించుకోరాదు. 27. ఈ నియమమును మీరినవాడు ఎవడైనను ప్రభువు సమాజమునుండి వెలివేయబడును.”

యాజకుని భాగములు

28. ప్రభువు మోషేతో ఇట్లు చెప్పెను: ”నీవు యిస్రాయేలీయులతో ఇట్లనుము.

29. ప్రభువునకు సమాధానబలిని అర్పించువాడు ఆ బలిలో కొంతభాగ మును ప్రభువునకు ప్రత్యేకముగా అర్పింపవలయును.

30. ఆ భాగమును అనగా బలిపశువు రొమ్ముమీది క్రొవ్వును దహింప అతడు స్వహస్తములతో కొనిరావ లెను. ప్రభువు సాన్నిధ్యమున అల్లాడింపబడు అర్పణగా దానిని అల్లాడించుటకు ఆ రొమ్ముతో దానిని కొనిరావ లెను.

31. యాజకుడు ఆ క్రొవ్వును పీఠముమీద దహించును. కాని రొమ్మును మాత్రము తాను తీసి కొనును.

32. మీరు సమాధానబలులు అర్పించిన పుడు బలిపశువు కుడితొడను యాజకునకు ఈయవల యును. 33. అహరోను సంతతిలోని ఏ యాజకుడు సమాధానబలిపశువు నెత్తురును, క్రొవ్వును దేవునకు అర్పించునో ఆ యాజకునకే కుడితొడ చెందును.

34. యిస్రాయేలీయులు అర్పించు సమాధానబలులలో బలిపశువు కుడితొడ, రొమ్ము నాకు ప్రత్యేకముగా ముట్టవలసిన భాగములు. నేను వానిని యాజకులకు ఇచ్చితిని. ఇది యిస్రాయేలీయులకు శాశ్వతనియమము కావలయును.

ముగింపు

35. దహనబలులందు ప్రభువునకు అర్పింప బడు ప్రత్యేకమైనభాగము ఇది. అహరోనుకుమారులు అభిషేకము పొందినపుడు ఈ భాగము వారికి అంకిత మైనది.

36. యాజకులు అభిషేకము పొందినపుడు పైన పేర్కొనబడిన భాగము వారికి చెందునని ప్రభువు ఆజ్ఞాపించెను. ఈ ఆజ్ఞ యిస్రాయేలీయులకు తర తరముల వరకు చెల్లును.”

37. సంపూర్ణ దహనబలికి, ధాన్యబలికి, పాప పరిహారబలికి, దోషపరిహారబలికి, యాజకుల అభిషేకమునకు, సమాధానబలికి చెల్లు నియమములు ఇవి.

38. ప్రభువు యిస్రాయేలు ప్రజలను బలులు అర్పింపుడని ఆదేశించినపుడు ఎడారిలోని సీనాయి కొండమీద మోషేకు ఈ ఆజ్ఞలను దయచేసెను.

Previous                                                                                                                                                                                                     Next  

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము