2. యాజకులకు అభిషేకము అభిషేక విధి

1. ప్రభువు మోషేతో ఇట్లనెను: 2. ”అహరోనును, అతని కుమారులను సమావేశపుగుడారము చెంతకు పిలువుము. యాజకులు ధరించువస్త్రములను, అభిషేక తైలమును, పాపపరిహారబలికి ఒక కోడెను, రెండు పొట్టేళ్ళను, గంపెడు పొంగనిరొట్టెలను అచికి కొని పొమ్ము.

3. ప్రజలనందరిని అచట ప్రోగుజేయుము.”

4. మోషే ప్రభువు ఆజ్ఞాపించినట్లుగా ప్రజలను సమావేశపుగుడారము వద్ద ప్రోగుచేసెను.

5. అతడు వారితో ”నేను ప్రభువు ఆజ్ఞాపించినట్లే ఈ కార్యము చేయుచున్నాను” అని పలికెను.

6. మోషే అహరోనును అతని కుమారులను ముందుకు రండని పిలిచి వారిని జలముతో శుద్ధి చేయించెను. 7. అతడు అహరోనునకు చొక్కాయిని తొడిగించి, ద్టీని క్టి, నిలువుటంగీని తొడిగించెను. అతనిని యాజకవస్త్రముతో (ఎఫోదు) కప్పి దాని కుచ్చులను ఎఫోదు నడికట్టునకు బిగించెను.

8. అతని రొమ్మున వక్షఃఫలకము నిలిపి దానిలో యాజకత్వ సంబంధిత ఊరీము, తుమ్మీములను ఉంచెను. 9. అతని శిరస్సుమీద తలపాగా పెట్టెను. సువర్ణఫలక మును అహరోను నొసిభాగమున ఉంచెను. ఆ ఫలకమును పెట్టుమని ప్రభువు మోషేను ముందుగనే ఆజ్ఞాపించియుండెను.

10. అంతట మోషే తైలముతో మందిరమును, దానిలోని ప్రతిభాగమును అభిషేకించి వానిని ప్రభువు నకు నివేదించెను.

11. అతడు దానిలో కొంచెము ఏడుపర్యాయములు బలిపీఠముమీద చిలుకరించి, బలిపీఠమును దానిఉపకరణములన్నింని, గంగాళము దానిపీటను ప్రభువునకు నివేదించెను.

12. అటుపిమ్మట అహరోను అతని శిరస్సుమీద తైలముపోసి అతనిని అభిషేకించెను.

13. పిమ్మట మోషే అహరోను కుమారులను ముందుకు రప్పించెను. ప్రభువు ఆజ్ఞాపించినట్లే వారికి చొక్కాలుతొడిగించి, ద్టీలుక్టించి, ోపీలు ప్టిెంచెను.

14. అటు తరువాత పాపపరిహారబలికి కోడెను కొనివచ్చిరి. అహరోను, అతని కుమారులు దానిమీద చేతులు చాచిరి.

15. మోషే దానిని వధించెను. దాని నెత్తురును కొద్దిగా తీసికొని వ్రేళ్ళతో బలిపీఠము కొమ్ము లకు పూసి ఆ బలిపీఠమును దేవునికి నివేదించెను. మిగిలిన నెత్తురును బలిపీఠము అడుగున పోసి దానిని ప్రతిష్ఠించెను. ఆ రీతిగా అతడు బలిపీఠమునకు ప్రాయశ్చిత్తముచేసి దానిని దేవునికి నివేదించెను.

16. ఆ పిమ్మట అతడు కోడె ప్రేవులమీది క్రొవ్వును, కాలేయములోని క్రొవ్వును, రెండు మూత్ర గ్రంథులను, వానిమీది క్రొవ్వును తొలగించి పీఠముమీద కాల్చి వేసెను.

17. ప్రభువు ఆజ్ఞాపించినట్లే కోడె చర్మమును, మాంసమును, పేడను శిబిరము వెలుపల కాల్చివేసెను.

18. తరువాత దహనబలిగా పొట్టేలును కొని వచ్చిరి. అహరోను, అతని కుమారులు దాని తలమీద చేతులుచాచిరి.

19. మోషే దానిని వధించెను. దాని రక్తమును బలిపీఠము చుట్టు చల్లెను.

20. పొట్టేలును ముక్కముక్కలుగా కోసెను. దాని ప్రేవులను కాళ్ళను శుభ్రముగా కడిగెను. ఆ మీదట దాని తలను, క్రొవ్వును, ఆ పొట్టేలునంతిని పీఠము మీద దహించెను.

21. ఇది ప్రభువు మోషేను అర్పించుమనిన దహనబలి. ఆ బలి సువాసనవలన ప్రభువు సంతుష్టిచెందెను.

22. తదనంతరము యాజకాభిషేకబలికి రెండవ పొట్టేలును కొనివచ్చిరి. అహరోను, అతని కుమారులు దాని తలమీద చేతులుచాచిరి.

23. మోషే దానిని వధించెను. దాని నెత్తురును కొద్దిగాతీసికొని అహరోను కుడిచెవి అంచుమీద, కుడిచేతి బొటనవ్రేలిమీద, కుడికాలి బొటనవ్రేలి మీద పూసెను.

24. అహరోను కుమారులనుగూడ ముందుకు రప్పించి ఆ నెత్తురును వారి కుడిచెవి అంచులకు, కుడిచేతి బొటనవ్రేళ్ళకు, కుడికాలి బొటనవ్రేళ్ళకు పూసెను. మిగిలిన నెత్తురును బలిపీఠము చుట్టు చల్లెను.

25. ఆ పిమ్మట పొట్టేలు క్రొవ్వునంతిని, అనగా దానితోకకు అంటుకొనియున్న క్రొవ్వును, ప్రేవులమీది క్రొవ్వును, కాలేయమునందలి క్రొవ్వును, మూత్ర గ్రంథులను, వానిమీది క్రొవ్వును, దాని కుడితొడను తొలగించెను.

26. ప్రభువుయెదుట వుంచిన పొంగని రొట్టెల గంపనుండి ఒక పెద్ద రొట్టెను, నూనెతో కాల్చిన వేరొక రొట్టెను, ఒక పలుచని రొట్టెను గైకొనెను. ఆ రొట్టెలను పొట్టేలు క్రొవ్వుమీద, దాని కుడితొడమీద పేర్చి 27. వానినన్నిని అహరోను చేతులలో, అతని కుమారుల చేతులలో ఉంచెను. వారు ఆ పదార్థ ములన్నింని పైకెత్తి ప్రభువునకు అల్లాడించు అర్పణ ముగా అర్పించిరి.

28. మోషే ఆ పదార్థములన్నింని వారి చేతులలోనుండి తీసికొని దహనబలితోపాటు వానిని కూడ బలిపీఠముమీద కాల్చివేసెను. ఇది యాజక అభిషేకబలి. ఈ దహనబలి సువాసనవలన ప్రభువు సంతుష్టి చెందెను.

29. ఆ పిమ్మట మోషే పొట్టేలు రొమ్మును పైకెత్తి ప్రభువునకు అల్లాడించు అర్పణగా అర్పించెను. ప్రభువు ముందుగా ఆజ్ఞాపించి నట్లే అభిషేకబలిగా అర్పించిన పొట్టేలు మాంసములో ఈ రొమ్ము మోషేకు లభించెను.

30. మోషే పీఠము మీది కొంతతైలమును, రక్తమును తీసికొని వానిని అహరోనుమీదను, అతని కుమారుల మీదను, వారి దుస్తులమీదను చిలుకరించెను. ఆ రీతిగా అతడు వారిని, వారి దుస్తులను దేవునికి నివేదించెను.

31. మోషే అహరోనుతో అతని కుమారులతో ”ప్రభువు ఆజ్ఞాపించినట్లుగనే మీరు ఈ మాంసము కొనిపోయి సమావేశపు గుడారము ప్రవేశద్వారము చెంత వండుకొనుడు. అభిషేకబలికిగా అర్పించిన రొట్టెలతో అచట దానిని భుజింపుడు.

32. మీరు భుజింపగా మిగిలిన మాంసమును, రొట్టెలను కాల్చి వేయుడు.

33. ఏడుదినములవరకు మీరు సమావేశపు గుడారప్రవేశద్వారము వీడరాదు. అప్పికి మీ అభిషేక విధి పూర్తియగును.

34. ప్రభువు ఆజ్ఞాపించినట్లే నేడు మీకు ప్రాయశ్చిత్తము జరిపితిని.

35. మీరు ఏడు నాళ్ళపాటు రేయింబవళ్ళు సమావేశపుగుడార ప్రవేశ ద్వారమువద్దనే ఉండి ప్రభువు విధిని పాింపుడు. ఇట్లు చేయుదురేని మీకు ప్రాణాపాయము కలుగదు. ప్రభువునుండియే నేను ఈ ఆజ్ఞను స్వీకరించితిని” అని చెప్పెను.

36. అహరోను, అతని కుమారులును ప్రభువు మోషే ముఖమున ఆజ్ఞాపించినట్లే చేసిరి.

Previous                                                                                                                                                                                              Next  

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము