కుష్ఠను గూర్చిన నియమములు
1. వాపులు, పొక్కులు, రంగుమార్పు
13 1. ప్రభువు మోషే, అహరోనులతో ఇట్లనెను: 2. ”ఎవని శరీరము మీదనైనా వాపుగాని, పొక్కులు గాని, నిగనిగలాడు పొడగాని కనిపించి కుష్ఠయేమో అను శంక కలిగించినయెడల అతనిని అహరోను వంశపు యాజకునియొద్దకు కొనిపోవలయును.
3. యాజకుడు అతని చర్మవ్యాధిని పరిశీలించును. వ్యాధి సోకినచోట వెంట్రుకలు తెల్లబారినను, లేక దేహ చర్మముకంటె ఆ చోటు పల్లముగా కనబడినను అది కుష్ఠమే. యాజకుడు అి్ట నరుని అశుద్ధునిగా నిర్ణయించవలయును.
4. కాని దేహముమీద తెల్లని మచ్చమాత్రము కనిపించి, చర్మముక్రుంగుట, వెంట్రు కలు తెల్లబారుట అను లక్షణములు కనిపింపవేని యాజకుడు రోగిని ఏడునాళ్ళపాటు కడన ఉంచ వలయును.
5. ఏడవనాడు రోగిని మరల పరిశీలింప వలయును. ఆ పొడ ఆలాగునేయుండి దేహమునందు వ్యాపింపకుండ ఉండినయెడల రోగిని మరి ఏడు దినములపాటు కడన ఉంచవలయును.
6. ఏడవ నాడు మరల రోగిని పరీక్షింపవలయును. క్షీణించిన పొడ దేహమునందు వ్యాపింపక ఉండినయెడల యాజకుడు రోగిని శుద్ధునిగా నిర్ణయింపవలెను. అది వ్టి పొక్కు మాత్రమే. రోగిబట్టలు ఉతుకుకొని శుద్ధినిపొందును.
7. కాని యాజకుడు రోగిని పరీక్షించి శుద్ధునిగా నిర్ణయించినపిదప అతని దేహమందు పొడ వ్యాపించె నేని అతడు మరల యాజకుని చూడవలయును.
8. యాజకుడు రోగిని పరీక్షించి పొడ వ్యాపించియుండిన యెడల అతనిని అశుద్ధునిగా నిర్ణయించవలెను. అది కుష్ఠమే.
2. పుండ్లు గల కుష్ఠ మాత్రమే అంటువ్యాధి
9. ఎవరికైనను కుష్ఠసోకినయెడల వానిని యాజకుని వద్దకు కొనిపోవలయును.
10-11. యాజకుడు రోగిని పరీక్షించును. అతని దేహముమీద తెల్లనివాపు, తెల్లబారిన వెంట్రుకలు, పచ్చిగ కన్పించె నేని దానిని పూర్వమునుండే ఉన్న కుష్ఠగా నిర్ణయింప వలయును. రోగిని అశుద్ధునిగా నిర్ణయింపవల యును. అి్ట రోగిని పరీక్షార్థము ఊరినుండి వెలుపలికి పంపనక్కరలేదు. అతడు నిస్సందేహముగా అశుద్ధుడు.
12-13. కాని రోగి దేహమంతట శిరస్సునుండి పాదమువరకు కుష్ఠ వ్యాపించియుండెనేని యాజకుడు అతనిని పరిశీలింపవలయును. రోగి దేహమంతట కుష్ఠ వ్యాపించియుండెనేని యాజకుడు అతనిని శుద్ధునిగా నిర్ణయింపవలయును. రోగి దేహమందంత తెల్లబారెను కనుక అతడు శుద్ధుడు.
14. కాని ఆ రోగి చర్మముమీద పుండు లేవగనే అతడు అశుద్ధుడు అగును.
15. యాజకుడు రోగి పుండును పరీక్షించి అతనిని అశుద్ధునిగా నిర్ణయింపవలయును. పుండు కుష్ఠకు గుర్తు. పుండు కలవాడు అశుద్ధుడు.
16. కాని ఆ పుండు తెల్లబారెనేని రోగి యాజకునివద్దకు వెళ్ళవలయును.
17. యాజకుడు రోగిని పరీక్షించి కుష్ఠ తెల్లబారినదని గుర్తించెనేని అతనిని శుద్ధునిగా నిర్ణయింపవలయును. అతడు శుద్ధుడే.
3. బొబ్బలు
18-19. ఎవరికైన బొబ్బలేచి అది నయమైన పిదప ఆ తావున తెల్లని వాపుకాని, ఎరుపు, తెలుపు రంగుల పొడగాని కనిపించినయెడల అతడు యాజకునివద్దకు వెళ్ళవలయును.
20. యాజకుడు రోగిని పరీక్షించి చూచి, తెల్లని రోమములు, చర్మము పల్లముగా ఉండుట అను లక్షణములు కనిపించినచో అతనిని అశుద్ధునిగా నిర్ణయింపవలయును. అతనికి బొబ్బమీద కుష్ఠ సోకినట్లు. 21. కాని పై రెండు లక్షణములు కన్పింపక వ్యాధి సోకిన తావున రంగు మాత్రమే మారియుండెనేని యాజకుడు రోగిని ఏడు నాళ్ళపాటు వేరుగా ఉంచవలయును.
22. పొడ వ్యాపించునేని యాజకుడు రోగిని అశుద్ధునిగా నిర్ణయింపవలయును. అతనికి కుష్ఠ సోకినది.
23. కాని పొడ వ్యాపింపదేని అది బొబ్బమచ్చ మాత్రమే. కనుక యాజకుడు రోగిని శుద్ధునిగానే నిర్ణయింప వలయును.
4. కాలుపులు
24. ఎవరికైనను దేహము కాలి, ఆ కాలిన భాగమున తెల్లనిమచ్చగాని లేక తెలుపు, ఎరుపు రంగుల మచ్చగాని ఏర్పడినచో, 25. యాజకుడు అతనిని పరీక్షింపవలయును. వెంట్రుకలు తెల్లబడుట, చర్మము క్రుంగుటయను లక్షణములు కనిపించెనేని కుష్ఠ సోకినట్లే. యాజకుడు అతనిని అశుద్ధునిగా నిర్ణయింపవలయును. అది కుష్ఠయే.
26. కాని పై రెండు లక్షణములు కన్పింపక వ్యాధి సోకిన తావున రంగుమాత్రమే మారియుండెనేని యాజకుడు రోగిని ఏడునాళ్ళపాటు వేరుగ ఉంచవలయును.
27. ఏడవనాడు, రోగిని మరల పరీక్షించిచూచి పొడ వ్యాపించియున్నచో అతనిని అశుద్ధునిగా నిర్ణ యింపవలయును. అది కుష్ఠయే.
28. కాని పొడ వ్యాపింపక రంగును కోల్పోవుచుండెనేని దానిని కాలుపులవలన వచ్చిన వాపుగా నిర్ణయింపవల యును. యాజకుడు రోగిని శుద్ధునిగా గణింప వలయును. అది కేవలము వాపువలన కలిగినమచ్చ.
5. తల మీద, గడ్డము మీద కుష్ఠ
29-30. స్త్రీ పురుషులలో ఎవరికైన తలమీద నైనను, గడ్డముమీదనైనను పొడలేచినచో యాజకుడు ఆ వ్యక్తిని పరీక్షింపవలయును. అచట చర్మము క్రుంగి యుండి వెంట్రుకలు సన్నబారి పసుపురంగు కలిగి యుండినచో యాజకుడు రోగిని అశుద్ధునిగా నిర్ణయింప వలయును. అది తలమీదనో, గడ్డము మీదనో వచ్చెడి కుష్ఠ.
31. కాని యాజకుడు పరీక్షింపగా పై రెండు లక్షణములు కన్పింపవేని రోగిని ఏడునాళ్ళపాటు వేరుగ ఉంచవలయును.
32-33. ఏడవనాడు రోగిని మరల పరీక్షింపవలయును. పొక్కిన పుండు వ్యాపింపక, చర్మము క్రుంగక, వెంట్రుకలు పసుపురంగు పొందక ఉండెనేని రోగి ఆ కురుపు లేచిన భాగము చుట్టు వెంట్రుకలు గొరిగించుకోవలెను. అతడు ఇంకను ఏడునాళ్ళపాటు ఊరికి వెలుపల వసింపవలయును.
34. యాజకుడు రోగిని మరల ఏడవనాడు పరీక్షింప వలయును. కురుపు దేహమునందు వ్యాపింపక, చర్మము క్రుంగక ఉండెనేని యాజకుడు రోగిని శుద్ధునిగనే గణింపవలయును. అతడు దుస్తులు ఉతుకుకొని శుద్ధినిపొందును.
35-36. కాని రోగిని శుద్ధునిగా నిర్ణయించిన పిమ్మట కురుపు వ్యాపించెనేని యాజకుడు అతనిని మరల పరీక్షింపవలయును. అది వ్యాపించియుండెనేని ఇక వెంట్రుకలు పసుపుగానున్నవా లేవా అని పరీక్షింపనక్కరలేదు. అతడు అశుద్ధుడే.
37. కాని యాజకుని దృష్టిలో కురుపు వ్యాపింపకయుండి ఆ తావున నల్లని వెంట్రుకలు పెరుగుచుండెనేని రోగికి వ్యాధినయమైనట్లే. యాజకుడు అతనిని శుద్ధునిగా నిర్ణయింపవలయును.
6. దద్దులు
38-39. స్త్రీ పురుషులలో ఎవరి చర్మముమీదనైన తెల్లనిపొడలు ఏర్పడినచో యాజకులు ఆ వ్యక్తిని పరీక్షింప వలయును. ఆ పొడలు మసకగానున్న తెల్ల మచ్చలు మాత్రమే అగునేని అవి వ్టి దద్దులు. ఆ రోగి శుద్ధుడు.
7. వెంట్రుకలు రాలిపోవుట
40. ఎవరికైనను తలమీద వెంట్రుకలు రాలి పోయినచో అది బట్టతల మాత్రమే అగును. అతడు అశుద్ధుడు కాడు.
41. అతని తల ముందిభాగమున వెంట్రుకలు రాలిపోయినచో ఆ భాగము బట్టతల అగును. అతడు అశుద్ధుడు కాడు.
42. కాని అతని బట్టతల మీద తెలుపు. ఎరుపు రంగులుగల కురుపు లేచెనేని అది కుష్ఠ.
43-44. యాజకుడు రోగిని పరీక్షించి అతని తలమీద ఎరుపు, తెలుపు రంగులు గల వాపును గుర్తించెనేని అతనిని అశుద్ధునిగా నిర్ణయింపవలయును. అది తలమీద వచ్చెడు కుష్ఠ.
కుష్ఠరోగులకు నియమములు
45. కుష్ఠరోగి చినిగిన బట్టలు తాల్చి, తల విరబోసికొనవలయును. అతడు పై పెదవి మీద చేయి మోపి ”అశుద్ధుడను, అశుద్ధుడను” అని కేకలిడ వలయును.
46. కుష్ఠరోగిగా ఉన్నంతకాలము అతడు అశుద్ధుడే. అతడు ఏకాంతముగా శిబిరము వెలుపల జీవింపవలయును.
కుష్ఠ సోకిన దుస్తులు
47-49. ఉన్ని, నూలు దుస్తులకుగాని, చర్మ సామాగ్రికి కాని కుష్ఠసోకి వానిమీద పచ్చనిపొడ కనిపించిన యెడల వానిని యాజకునికి చూపింపవలయును.
50. యాజకుడు ఆ వస్తువుల మీది బూజును పరీక్షించి, వానిని ఏడు రోజులపాటు ఒక ప్రక్కన ప్టిెంచును. 51. అతడు ఏడవనాడు మరల పరీక్షించినపుడు ఆ వస్తువులమీద బూజు వ్యాపించియుండెనేని అది కుష్ఠయే. ఆ వస్తువులు అశుద్ధములు.
52. కనుక యాజకుడు వానిని దహింపవలయును. అది వ్యాప్తిచెందు కుష్ఠ కనుక దానిని నిప్పుతో కాల్చివేయవలయును.
53-54. కాని ఆ వస్తువులమీద బూజు వ్యాపింపదేని వానిని కడిగి ఏడునాళ్ళపాటు ఒక ప్రక్కన పెట్టవలయును.
55. అతడు వానిని మరల పరీక్షించి నపుడు బూజు వ్యాపింపకపోయినను, అవి పూర్వపు రంగుతోనే యుండినయెడల ఆ వస్తువులను అశుద్ధము లుగా గణింపవలయును. బూజు పూర్తిగా లోపటను, వెలుపటను సోకినది కనుక వానిని నిప్పుతో కాల్చి వేయవలయును.
56. కాని యాజకుడు మరల పరీక్షించినపుడు బూజు తగ్గియుండెనేని ఆ బూజుప్టిన భాగమును మాత్రము కోసివేయవలయును.
57. ఆ వస్తువుల మీద బూజు మరల కన్పించెనేని కుష్ఠ ప్రబలమైనట్లు. కనుక యాజకుడు వానిని కాల్చివేయవలయును.
58. కాని ఆ వస్తువులను ఒకమారు కడిగిన తరువాత వానిమీది బూజు పోయెనేని వానిని మరల కడుగ వలయును. అప్పుడు అవి శుద్ధములగును.
59. ఉన్ని, నూలు దుస్తులకు, చర్మసామాగ్రికి సోకిన కుష్ఠను గూర్చిన నియమములివి.”