కుష్ఠ రోగులను శుద్ధిచేయుట

14 1. ప్రభువు మోషేతో ఇట్లు చెప్పెను: 2. ”కుష్ఠనయమైనవానిని శుద్ధిచేయు విధానమిది. శుద్ధిని పొందుదినమున అతనిని యాజకునివద్దకు కొని రావలయును.

3-4. యాజకుడు అతనిని శిబిరము వెలుపలికి కొనిపోయి అచట పరీక్షచేయును. రోగికి కుష్ఠనయమయ్యెనేని యాజకుడు అతనిచే రెండు శుద్ధమైన పకక్షులు, కొంచెము దేవదారు కొయ్య, ఒక ఎఱ్ఱదారము, హిస్సోపురెమ్మ తెప్పించును.

5. అటు పిమ్మట యాజకులు శుభ్రమైన ప్రవాహజలముపై మ్టిపాత్రలో ఒక పక్షిని చంపించును.

6. రెండవ పక్షిని, కొయ్యను, దారమును, హిస్సోపురెమ్మను మొది పక్షి నెత్తురులో ముంచును.

7. యాజకుడు శుద్ధిని పొందవలసిన వానిమీద పక్షినెత్తురును ఏడు సార్లు చిలుకరించి అతడు శుద్ధుడయ్యెనని పలుకును.  రెండవపక్షిని వదలివేయగా అది పొలములోనికి ఎగిరిపోవును.

8. రోగి దుస్తులు ఉతుకుకొనును. వెంట్రుకలన్ని గొరిగించుకొని స్నానము చేయును. అప్పుడతడు శుద్ధినిపొందును. ఆ పిమ్మట అతడు శిబిరములోనికి ప్రవేశింపవచ్చును. కాని ఏడునాళ్ళ పాటు తన గుడారము వెలుపల ఉండి పోవలయును.

9. ఏడవనాడు మరల తల, గడ్డము, కనుబొమ్మలు, మిగిలిన రోమములు గొరిగించుకొని, దుస్తులు ఉతుకు కొని, స్నానము చేయవలయును. అప్పుడతడు శుద్ధిని పొందును.

10. ఎనిమిదవనాడు అతడు ఏడాది ఈడుగలవి, అవలక్షణములు లేనివి రెండు మగగొఱ్ఱెపిల్లలను, ఒక ఆడుగొఱ్ఱెపిల్లను, నూనెతో కలిపిన మూడు కుంచముల గోధుమపిండిని, ఒక గిన్నెడు ఓలివునూనెను కొని రావలయును.

11. యాజకుడు అతనిని అతని కానుకలను సమావేశపుగుడార ప్రవేశ ద్వారము వద్దకు కొనిపోవును. 12.యాజకుడు ఒక మగగొఱ్ఱెపిల్లను ఓలివుతైలమును దోషపరిహారబలిగా వానిని తెచ్చి ప్రభువునెదుట అల్లాడింపబడు అర్పణగా అర్పించును.

13. పాపపరిహారబలులు, దహనబలులు సమర్పించు పవిత్రస్థలముననే ఆ గొఱ్ఱెపిల్లను వధింపవలయును. పాపపరిహారబలివలె ఈ దోషపరిహారబలిలో చంప బడిన గొఱ్ఱెపిల్ల యాజకునికే చెందును. అది పరమ పవిత్రమైన నైవేద్యము.

14. యాజకుడు ఆ గొఱ్ఱె పిల్లనెత్తుిని కొద్దిగా తీసికొని శుద్ధిపొందువాని కుడిచెవి అంచుమీదను, కుడిచేతి బొటనవ్రేలి మీదను, కుడికాలి బొటనవ్రేలి మీదను పూయవలయును.

15. అతడు నూనెబుడ్డిని తీసికొని తన ఎడమఅరచేతిలో కొంచెము తైలము పోసికోవలయును.

16. కుడిచేతి వ్రేలితో ఆ ఎడమచేతిలోని తైలమును కొద్దిగా తీసికొని ఏడుసార్లు దేవుని సన్నిధిలో చిలుకరింపవలయును.

17. ఎడమఅరచేతిలోని తైలమును కొద్దిగా తీసికొని శుద్ధినిపొందువాని కుడిచెవి అంచుమీద, కుడిచేతి బొటనవ్రేలిమీద, కుడికాలి బొటనవ్రేలి మీద పూయ వలయును. దోషపరిహారార్ధబలి నెత్తురును పూసినట్లే ఈ తైలమును పూయవలయును.

18. యాజకుడు తన చేతిలో మిగిలియున్న తైలమును, శుద్ధిని పొందువాని తలమీద పోయును. ఈ రీతిగా అతడు ప్రభువు సన్నిధిలో ప్రాయశ్చిత్తము చేయవలయును.

19-20. అటుపిమ్మట యాజకుడు పాపపరిహార బలిని అర్పించి శుద్ధిజరుపును. కడన దహనబలికి ఉద్దేశింపబడిన గొఱ్ఱెపిల్లను వధించి దానిని ధాన్య బలితోపాటు పీఠముమీద దహించును. ఈ రీతిగా ప్రాయశ్చిత్తము చేయగా కుష్ఠనయమయినవాడు శుద్ధినిబడయును.

21. శుద్ధి పొందువాడు పేదవాడైనచో దోష పరిహారబలికిగాను ఒక్క మగగొఱ్ఱెపిల్లను కొనివచ్చిన చాలును. దానిని ప్రభువు ఎదుట అల్లాడింపబడు అర్పణగా అర్పింపవలయును. నూనె కలిపిన ఒక కుంచెడు గోధుమపిండిని, ఒక బుడ్డిలో మూడవ వంతు ఓలివునూనెను కొనివచ్చిన చాలును.

22. ఇంకను అతడు  తన తాహతుకు తగినట్లుగా రెండు తెల్లగువ్వలనో లేక రెండు పావురపుపిల్లలనో కొని రావలయును. వానిలో ఒకి పాపపరిహారబలికి మరియొకి దహనబలికి.

23. అతడు శుద్ధిచేయించు కొనమొదలుప్టిెన ఎనిమిదవనాడు వానినన్నిని గుడారప్రవేశద్వారమునొద్ద ఉండు యాజకుని వద్దకు కొనితేవలయును.

24. యాజకుడు దోషపరిహార గొఱ్ఱెపిల్లను, ఒక గిన్నెలో నూనెను గైకొని ప్రభువు ముందట అల్లాడింపబడు అర్పణగా అర్పించును.

25. గొఱ్ఱెపిల్లను వధించి దాని నెత్తుిని కొంత తీసుకొని శుద్ధినిబడయువాని కుడిచెవి అంచునకు, కుడిచేతి బొటనవ్రేలికి, కుడికాలి బొటనవ్రేలికి పూయవల యును.

26-27. యాజకుడు నూనెను తన ఎడమ అరచేతిలో పోసికొని, కుడిచేతి వ్రేలితో దానిని  ఏడుసార్లు ప్రభువు సన్నిధిలో చిలుకరించును.

28. ఆ నూనెను కొంత శుద్ధిపొందువాని కుడిచెవి అంచుమీదను, కుడిచేతి బొటనవ్రేలి మీదను, కుడికాలి బొటనవ్రేలిమీదను పూయును. దోషపరిహారబలి రక్తమును పూసినట్లే ఈ నూనెను కూడ పూయ వలయును.

29. యాజకుడు తన ఎడమచేతిలో మిగిలి యున్న నూనెను శుద్ధిని బడయువాని తలమీద పోసి అతనికి ప్రాయశ్చిత్తము చేయవలయును.

30-31. తరువాత అతడు తన తాహతుకు తగినట్లుగా ఒక పావురమునుగాని లేక ఒక తెల్లగువ్వనుగాని పాప పరిహారబలిగా సమర్పించును. రెండవ దానిని ధాన్య బలితో పాటు దహనబలిగా అర్పించును. ఈ రీతిగా యాజకుడు ప్రాయశ్చిత్తము చేయును.

32. కుష్ఠనుండి విముక్తిచెందిన పిదప ప్రాయశ్చిత్తమునకు గాను పశువులను అర్పింపలేని పేదవానిని గూర్చిన నియ మములివి.”

కుష్ఠ సోకిన గృహములు

33. ప్రభువు మోషే అహరోనులతో ఇట్లనెను: 34-35. ”మీరు నేను వారసత్వముగా ఈయనున్న కనాను మండలమును చేరుకొనిన తరువాత నేనట మీలో ఎవరి ఇంికైన కుష్ఠ సోకునట్లు చేయుదునేని ఆ ఇంి యజమానుడు యాజకునివద్దకు వెళ్ళి తన ఇంికి కుష్ఠ సోకినదని తెలియజేయవలయును.

36. యాజకుడు ఆ ఇంిని పరీక్షించుటకు వెళ్ళకముందు ఆ ఇంియందలి వస్తువులన్నిని వెలుపల ప్టిెంచును. లేదేని ఆ ఇంిలోని వస్తువులన్ని అశుద్ధములగును. అటుతరువాత అతడు ఆ ఇంిలోనికి పోవును.

37-38. ఆ ఇంట ఎఱ్ఱని పొడలుగాని లేక తెల్లని పొడలు గాని గోడలను తినివేయుచున్నచో, అతడు ఆ ఇంినుండి వెలుపలికివచ్చి, దానిని ఏడునాళ్ళపాటు మూయించును.

39. ఏడవనాడు ఆ ఇంిని మరల పరీక్షించును. పొడలు గోడలమీద వ్యాపించిఉన్నచో, 40. ఆ పొడలు సోకిన రాళ్ళను గోడలలోనుండి తొలగించి పట్టణము వెలుపల ఏదైన అశుద్ధమైన తావున పడవేయుడని ఆజ్ఞాపింపవలయును.

41. అటుపిమ్మట గోడల లోపలి భాగములను గోకివేసి ప్రోగైన అలుకుడు మ్టిని నగరము వెలుపల ఏదైన అశుద్ధమైన తావున పోయింప వలయును.

42. తొలగించిన రాళ్ళకు బదులుగా క్రొత్త రాళ్ళనుపేర్చి గోడలను మరల అలుకవలయును.

43. రాళ్ళను తొలగించి గోడలను గోకి క్రొత్తగా అలికిన తరువాతకూడ పొడలు మరల కన్పించెనేని

44. యాజకుడు వచ్చి ఇంిని పరీక్షింపవలయును. పొడలు మరల వ్యాపించియుండెనేని ఆ ఇంికి కుష్ఠ సోకినట్లు. అది అశుద్ధమైన ఇల్లు.

45. కనుక ఆ ఇంిని పడగ్టొవలయును. దాని రాళ్ళను, కొయ్యను, అలుకుడు మ్టిని ఎత్తి నగరము వెలుపల ఏదైన అశుద్ధమైన తావున పడవేయవలయును.

46. అశుద్ధముగా ఉన్నందున మూసివేయబడి యున్న ఇంిలో ఎవడైనను అడుగుపెట్టెనేని అతడు సాయంకాలము వరకు అశుద్ధుడగును.

47. దానిలో నిద్రించువాడుకాని, అన్నము తినువాడుకాని బట్టలు ఉతుకు కోవలయును.

48. కాని యాజకుడు ఇంిని పరీక్షింపవచ్చినప్పుడు, కొత్తగా అలికిన తరువాత అందలి పొడలు వ్యాపించియుండవేని అతడు దానిని శుద్ధముగా నిర్ణయింపవలయును. ఎందుకన గోడల మీది కుష్ఠ సమసిపోయినది.

49. యజమానుడు ఇంిని శుద్ధి చేయించుటకు గాను దోషపరిహారార్ధబలికి రెండు పకక్షులను, దేవదారు కొయ్యను, ఎఱ్ఱనిదారమును, హిస్సోపురెమ్మను కొనిరావలయును.

50. స్వచ్ఛమైన ప్రవాహజలము మీద ఒక పక్షిని మ్టిపాత్రలో చంపవలయును.

51. దేవదారు కొయ్యను, హిస్సోపురెమ్మను, దారమును, బ్రతికియున్న పక్షిని అన్నిని ప్రవహించు జలముపై చంపిన పక్షి నెత్తురులో మరియు ప్రవాహజలములో ముంచి, వాితో ఇంిని ఏడుసార్లు చిలుకరింపవల యును.

52. ఈ రీతిగా అతడు పక్షిరక్తముతో, స్వచ్ఛమైననీితో, బ్రతికియున్న పక్షితో, దేవదారు కొయ్య, ఎఱ్ఱనిదారము, హిస్సోపురెమ్మతో ఇంిని శుద్ధిచేయవలయును.

53. తరువాత వెలుపలి పొలములోనికి ఎగిరిపోవుటకు రెండవపక్షిని వదలి వేయవలయును. ఈ రీతిగా కుష్ఠసోకిన ఇంికి ప్రాయశ్చిత్తముచేయగా నిర్మలమగును.

54-56. నరులకు, ఇండ్లకు, బట్టలకు సోకెడు కుష్ఠను గూర్చి, వాపులు, పొక్కులు, నిగనిగలాడు పొడలు మొదలగువానిని గూర్చి నియమములివి.

57. ఒకడు ఎప్పుడు అపవిత్రుడగునో, ఎప్పుడు పవిత్రు డగునో తెలియజేయుటకు కుష్ఠమును గూర్చిన విధి యిదియే.

Previous                                                                                                                                                                                               Next  

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము