ఆరాధన, న్యాయము

19 1-2. ప్రభువు మోషేతో యిస్రాయేలీయులకు ఈ రీతిగా చెప్పుమనెను. ”మీ దేవుడను ప్రభుడనైన నేను పవిత్రుడను. కనుక మీరును పవిత్రులైయుండుడు.

3. మీలో ప్రతివాడు తన తల్లిదండ్రులను గౌరవింప వలయును. విశ్రాంతిదినమును పాింపవలయును. నేను మీ దేవుడనైన ప్రభుడను.

4. మీరు విగ్రహములను ఆరాధింపరాదు. లోహముతో విగ్రహములనుచేసి వానిని పూజింప రాదు. నేను మీ దేవుడనైన ప్రభుడను.

5. మీరు ప్రభువునకు సమాధానబలిని అర్పించున పుడు మొదట నేను ఆజ్ఞాపించిన బలి నియమములను పాించి దానిని యోగ్యముగా సమర్పింపుడు.

6. ఆ బలినైవేద్యమును మొదినాడో లేక రెండవనాడో భుజింపవలయును. మూడవనాికి మిగిలియున్న దానిని కాల్చివేయవలెను.

7. ఆ నైవేద్యమును మూడవ నాడు కూడ భుజింతురేని అది అశుచికరమగును. అి్ట బలిని నేను అంగీకరింపను.

8. దానిని మూడవ నాడు భుజించువాడు నాకు అర్పింపబడిన పవిత్ర వస్తువును సామాన్య వస్తువువలె చూచినట్లగును. కనుక అతడు నా ప్రజలనుండి వెలివేయబడును.

9. మీరు పండిన పైరును కోసికొనునపుడు, గట్టుదాక కోయకుడు. పొలములోని పరిగలను అట్లే వదలివేయుడు.

10. మీ తోటలలో ద్రాక్షాపండ్లను కోయునపుడు రాలిన పండ్లను ఏరుటకు మరలి పోకూడదు.  పేదలకు, పరదేశులకు వానిని వదలి వేయుడు. నేను మీ ప్రభుడనైన దేవుడను.

11. మీరు దొంగతనము, మోసము చేయకుడు. అబద్ధమాడకుడు.

12. నా నామమున అసత్య ప్రమాణ మును చేయకుడు. నా నామమును అమంగళము చేయకుడు, నేను ప్రభుడను.

13. మీ పొరుగువానిని వేధింపకుడు. వాని సొత్తు దోచుకొనకుడు, దొంగి లింపకుడు. మరునాికి మునుపే మీరు కూలికి కుదుర్చుకొనినవాని కూలి చెల్లింపుడు.

14. మూగ వానిని శపింపకుడు. గ్రుడ్డివాడు నడచు త్రోవలో దేనినైనను అడ్డము ప్టిె అతడు పడునట్లు చేయకుడు. మీరు మీ ప్రభువునకు భయపడుడు. నేను మీ ప్రభుడను.

15. మీరు తగవులు తీర్పుచెప్పునప్పుడు న్యాయ మును పాింపుడు. పేదలకు పక్షపాతము చూపకుడు. సంపన్నులను అభిమానింపకుడు. న్యాయము ప్రకారము తీర్పుచెప్పుడు.

16. ఇరుగుపొరుగుయెడల వ్యతిరేక ముగా తిరుగాడుచు చాడీలు చెప్పకుడు. నీ సోదరునికి ప్రాణహానిచేయకుడు. నేను ప్రభుడను.

17. నీ హృదయ ములో పొరుగువానిమీద ద్వేషము పెట్టుకొనకుడు. అతని తప్పిదమును గూర్చి అతనిని మందలింపుడు. అప్పుడు అతనిమూలమున నీవు పాపము మూటకట్టు కొనకుందువు.

18. పొరుగువారి మీద పగతీర్చు కొనకుడు. వైరము పెట్టుకొనకుడు. నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపుడు. నేను ప్రభుడను.

19. మీరు నా ఆజ్ఞలను పాింపుడు. ఒకరకపు జంతువుతో మరియొక రకపు జంతువును కలయ నీయకుడు. ఒకే పొలములో రెండురకముల విత్తన ములు వెదజల్లకుడు. నూలు ఉన్ని కలిపి నేసిన బట్టలు తాల్పకుడు.

20. ఒకనికి ఒక బానిసపిల్ల ప్రధానము చేయబడిన దనుకొనుము. ఆమెకు ఇంకను స్వాతంత్య్రము లభింపలేదు. అి్ట యువతిని మరియొకడు కూడెనేని వారిరువురిని శిక్షింపవచ్చునుగాని వధింపరాదు. ఆమె స్వేచ్ఛలేని బానిసకదా! 21. ఆమెను కూడినవాడు పాపపరిహారబలిగా ఒక పొట్టేలును సమావేశపు గుడార ప్రవేశద్వారము వద్దకు కొనిరావలయును.

22.యాజకుడు ఆ పొట్టేలును బలి ఇచ్చి అతని పాపమునకు ప్రాయశ్చిత్తము చేయును. ప్రభువు అతని తప్పిదమును మన్నించును.

23. మీరు ఆ వాగ్ధాన దేశమున ప్రవేశించి, అచట మేలైన ఫలవృక్షములు నాినచో, మూడేండ్ల పాటు వానిఫలములను అశుచికరముగా భావింపుడు. కనుక మూడేండ్లవరకు వానిని భుజింపవలదు.

24. నాలుగవయేడు కాచిన పండ్లన్నిని ప్రభువునకు సమర్పించి స్తుతింపుడు.

25. ఐదవయేడు మీరు ఆ పండ్లు ఆరగింపవచ్చును. ఇట్లు చేయుదురేని మీ చెట్లు అధికముగా కాయును. నేను మీ ప్రభుడనైన దేవుడను.

26. నెత్తురు ఉన్న మాంసమును భుజింపకుడు. మంత్రతంత్రములను వాడకుడు.

27. మీ తలకు ముందు గుండ్రముగా జుట్టు గొరిగించుకొనకుడు. అట్లే గడ్డపుపక్కలు కత్తిరించుకొనకుడు.

28. మృతుల కొరకు మీ శరీరములను కత్తులతో కోసికొనకుడు, పచ్చలు పొడిపించుకొనకుడు. నేను ప్రభుడను.

29. మీ దేశము వ్యభించరింపకయు, దుష్కామ ప్రవర్తనతో నిండకయు ఉండునట్లు, నీ కుమార్తె వ్యభి చారిణి అగుటకై ఆమెను వేశ్యగా చేయకుడు.

30. మీరు నేను నియమించిన విశ్రాంతిదినము లను పాింపుడు. నా మందిరమును గౌరవింపుడు. నేను ప్రభుడను.

31. చచ్చినవారితో సఖ్యసంబంధములు పెట్టు కొను భూతవైద్యులను సంప్రదింపకుడు. సోదెగాండ్లను వెదకి వారివలన అపవిత్రత కలుగజేసుకొనకూడదు. అటులచేయుదురేని మీరు అశుచిమంతులగుదురు. నేను మీ ప్రభుడనైన దేవుడను.

32. వృద్ధులను సన్మానించి గౌరవింపుడు. ప్రభువు పట్ల  భయభక్తులతో  మెలగుడు. నేను ప్రభుడను.

33. మీ చెంత వసించు పరదేసులను హింసింప కుడు.

34. వారిని స్వజాతీయులవలె ఆదరింపుడు. మిమ్ము మీరు ప్రేమించుకొనునట్లే వారిని గూడ ప్రేమింపుడు. మీరు కూడ ఐగుప్తున పరదేశులై యుింరికదా! నేను మీ ప్రభుడనైన దేవుడను.

35. మీరు సరియైన కొలమానములను వాడుడు. కొలుచునపుడు కాని, తూకము వేయునపుడు కాని ఎవరిని మోసగింపకుడు.

36. సరియైన తక్కెడలను, తూనికరాళ్ళను, మానికలను ఉపయోగింపుడు. నేను మిమ్ము ఐగుప్తునుండి తోడ్కొనివచ్చిన ప్రభుడను.

37. మీరు నా ఆజ్ఞలను, చట్టములను పాింపుడు. నేను ప్రభుడను.”

Previous                                                                                                                                                                                                 Next  

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము