నియమములను మీరిన వారికి శిక్షలు

1. ఆరాధన నియమములను మీరుట

20 1-2. ప్రభువు మోషేను యిస్రాయేలీయులతో ఇట్లు చెప్పుమనెను: ”మీలోగాని మీతో వసించు పరదేశులలోగాని ఎవడైన తన పిల్లలను మోలెకు దేవతకు అర్పించెనేని, సమాజమంతయు అతనిని రాళ్ళతోక్టొి చంపవలయును.

3. అతడు తన పిల్లలను మోలెకునకు అర్పించుటవలన నా మందిర మును అపవిత్రము చేయును. నా నామమును అమంగళపరచును. కనుక నేనతనికి విరోధినై అతనిని నా సమాజమునుండి వెలివేయుదును. 4-5. యిస్రా యేలు సమాజము అతని చెయిదమును ఉపేక్షించి అతనిని సంహరింపదేని నేను స్వయముగా అతనికిని అతని కుటుంబమునకు విరోధిని అగుదును. నన్ను విడనాడి అతనితోగూడి మోలెకును ఆరాధించిన వారికందరికి నేను శత్రువును అగుదును. వారిని వారి సమాజమునుండి వెలివేయుదును.

6. ఎవరైన చనిపోయిన వారితో ఆవాహనము చేయు మాంత్రికులను సంప్రదింతురేని నేను వారికి విరోధిని అగుదును. అి్టవారిని వారి సమాజమునుండి వెలివేయుదును.

7. కనుక మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై ఉండుడు. నేను మీ ప్రభుడనైన దేవుడను.

2. కుటుంబ ధర్మములను మీరుట

8. నా ఆజ్ఞలను పాింపుడు. మిమ్ము పవిత్రుల నుగా చేయునది నేనే.

9. తల్లినిగాని తండ్రినిగాని శపించువాడు చంప దగినవాడు. అతని చావునకు అతడే బాధ్యుడగును.

10. ఎవడైన ఇతరుని భార్యతో వ్యభిచరించెనేని ఆ ఇరువురిని చంపవలసినదే.

11. ఎవడైన తన తండ్రి భార్యను కూడెనేని ఆ తండ్రిని అవమాన పరిచినట్లే. కనుక అతనిని ఆమెను ఇద్దరిని చంపవల యును. వారి మరణమునకు వారే పూచీపడుదురు.

12. ఎవడైన కోడలిని కూడెనేని వారిరువురిని చంప వలయును. అది వావివరసలులేని లైంగికసంబంధము. వారి చావునకు వారే బాధ్యులు.

13. ఎవడైన తోడి వానితో స్వలింగమైథునమునకు పాల్పడెనేని వారు జుగుప్సాకరమైన కార్యము చేసినట్లగును. కనుక వారిరువురిని చంపవలయును. వారి చావునకు వారే పూచీపడుదురు.

14. ఎవడైన ఒక పడుచును, ఆమె తల్లినిగూడ పెండ్లియాడెనేని అది దుష్క్రియ. కావున ఆ మువ్వురిని అగ్నిలో కాల్చివేయవలయును. అది వావివరసలు లేని సంబంధము. ఇి్ట దుష్ప్రవర్తన మీకు తగదు.

15. ఎవడైన జంతుసంపర్కము చేసిన అతనిని, దానినికూడ చంపవలసినదే.

16. ఏ స్త్రీ అయినను జంతువును కూడుటకు దానిని సమీపించిన ఇరువురిని చంపవలసినదే. వారి చావునకు వారే బాధ్యులగుదురు.

17. ఎవడైన సొంత తండ్రికిగాని, తల్లికిగాని ప్టుిన మారుసోదరిని పెండ్లియాడి పరస్పర దిసమొల లను చూచినయెడల వారిరువురు ఒకరినొకరు అవ మానపరచుకొన్నట్లగును. ఆ ఇద్దరిని అందరి ఎదుట బహిరంగముగా చంపవలయును. మానాచ్ఛా దనము తీసి సోదరిని కూడినవాడు తన దోషమునకు తగిన ప్రతిఫలము అనుభవింపవలయును.

18. ఎవడైన ముట్టుతనుకూడెనేని అనగా, ఆమె రక్తమునకు ఆధారమైన ఆమె మర్మాంగముమీది బట్టలు అతడు తొలగించెనేని, అందులకు ఆమె అంగీకరించెనేని వారి రువురిని సమాజమునుండి వెలివేయవలయును.

19. ఎవడైన తన మేనత్తనుగాని, పినతల్లిని గాని కూడెనేని రక్తసంబంధులను అవమానపరచినట్లగును. కనుక వారిరువురు ఆ పాపఫలమును అనుభవింతురు.

20. ఎవడైన పినతల్లిని కూడెనేని పినతండ్రినే అవమానపరచినట్లగును. వారిరువురును ఆ పాప ఫలమును అనుభవింతురు. ఆ ఇరువురు సంతాన హీనులై మరణింతురు.

21. ఎవడైన తన సోదరుని భార్యను పెండ్లియాడెనేని అది అశుచితమగును. అతడు తన సోదరుని అవమానపరచినట్లగును. అతనికి ఆమెకు సంతానము కలుగదు.

3. ప్రాణులలో శుచికరములు, అశుచికరములు

22. మీరు నా ఆజ్ఞలను, చట్టములను తు.చ. తప్పకుండ పాింపవలయును. అప్పుడు నేను మిమ్ము కొనిపోనున్న దేశమున మీరు నిలుతురు.

23. నేను మీ చెంతనుండి వెళ్ళగ్టొిన అన్యజాతి ప్రజల ఆచార ములను మీరు పాింపరాదు. వారు హేయమైన కార్యములు చేసి నాకు అసహ్యము ప్టుించిరి. కనుక నేను వారిని వెడలగ్టొితిని.

24. పాలుతేనెలు జాలువారు వారి దేశమును మీకిత్తునని మాట యిచ్చితిని. నేనే దానిని మీకు భుక్తము చేయుదును. నేను మీ దేవుడనైన ప్రభుడను. నేనే మిమ్ము అన్య జాతులనుండి వేరుచేసితిని.

25. కనుక మీరు జంతువులలోను, పకక్షులలోను శుచికరమైనవేవో, అశుచికరమైనవేవో గుర్తింపవలయును. మీరు అశుచి కరములైన జంతువులను, పకక్షులను, కీటకములను వేరుచేయవలయును. వాివలన మీరు అశుద్దులు కాకూడదు. నేనే వానిని అశుచికరములైన ప్రాణులుగా నిర్ణయించితిని.

ఉపసంహారము

26. మీరు పవిత్రులైయుండుడు. ప్రభుడనైన నేను పవిత్రుడను. నేను మిమ్ము వివిధ జాతులనుండి వేరుపరిచి నావారిని చేసికొింని. నా ప్రజలై యుండుడు.

27. మీలో ఏ పురుషుడైన, ఏ స్త్రీ అయినా చచ్చినవారి భూతములను ఆవాహము చేసెనేని, సోదెగాండ్రునైననేమి వారిని రాళ్ళతో క్టొి చంపుడు. వారి చావునకు వారే పూచీపడుదురు.”

Previous                                                                                                                                                                                              Next  

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము