మత్తతీయ పవిత్రయుద్ధమును ప్రారంభించుట

మత్తతీయ, అతని కుమారులు

2 1. ఆ రోజులలో యోరీబు తెగకు చెందిన యాజకుడు మత్తతీయ యెరూషలేమును విడనాడి మోదెయీను అను నగరమున నివాసము ఏర్పరచు కొనెను. అతని తండ్రి తాతలు యోహాను, సిమియోను.

2-5. అతనికి ఐదుగురు కుమారులు కలరు. వారు గద్ది అను మారుపేరు కల యోహాను, తస్సి అను మారుపేరు కల సీమోను, మక్కబీయు అను మారుపేరుకల యూదా, అవరాను అను మారుపేరు కల ఎలియాసరు, అప్ఫూసు అను మారుపేరు కల యోనాతాను.

6-7. మత్తతీయ యూదయాలో, యెరూషలేమున జరుగు అపచార ములను చూచి పరితాపముచెంది యిట్లనెను:

               ”అయ్యో! నేన్టి ఘోరకార్యములను

               గాంచుటకే ప్టుితినాయేమి?

               మన పరిశుద్ధ నగరమును,

               ప్రజలును నాశనమైరి.

               ఈ నగరము శత్రువుల పాలై,

               ఈ దేవళము అన్యజాతుల వశముకాగా,

               నేనిచట చేతులు ముడుచుకొని

               కూర్చుండవలసినదేనా?

8.           ఈ దేవాలయము కీర్తిని కోల్పోయిన 

               నరునివలె నున్నది.

9.           శత్రువులు దాని ఉపకరణముల నెల్ల దోచుకొనిరి.

               మన పిల్లలను వీధులలో చంపివేసిరి.

               మన యువకులు విరోధుల కత్తివాతబడిరి.

10.         ప్రతి జాతియు మన నగరమును ఆక్రమించుకొని,

               దాని సొత్తు దోచుకొనెను.

11.           నగర అలంకారములన్నియు నిర్మూలమయ్యెను.

               స్వాతంత్య్రముపోయి బానిసత్వము వచ్చినది.

12.          సుందరము, వైభవోపేతమైన

               దేవాలయము పాడుబడెను.

               అన్య జాతులవారు దానిని అమంగళము చేసిరి.

13.          ఇక మనము దేని కొరకు జీవింపవలయును?”

14. మత్తతీయ అతని కుమారులు విచారముతో బట్టలు చించుకొని గోనె కట్టుకొనిరి.

మోదేనున బలిని అర్పించుటకు నిర్బంధము

15. యిస్రాయేలీయులను యూదమతము నుండి త్రిప్పనెంచిన రాజకీయాధికారులు మోదెయీను నగరముకు వచ్చి అచి ప్రజలను విగ్రహములకు బలిఅర్పింపవలెనని నిర్బంధము చేసిరి.

16. చాల మంది యిస్రాయేలీయ ప్రజలు వారి పక్షమును అవలంభించిరి. మత్తతీయ అతని కుమారులు మాత్రము వారితో కలియక ఒక బృందముగా ఏర్ప డిరి.

17. రాజోద్యోగులు మత్తతీయతో ”నీవిచట పేరు ప్రతిష్ఠలుగల నాయకుడవు. నీ కుమారులును, బంధువులును నీకు అండగానున్నారు.

18. ఈ నగర మున రాజాజ్ఞను పాించు వారిలో నీవే మొది వాడవు కావచ్చునుగదా? అన్యజాతులు, యూదయా నివాసులు, యెరూషలేమున మిగిలియున్న పౌరులు రాజునకు లోబడిరి. మేము చెప్పినట్లు చేయుదువేని నీవును నీ కుమారులును ‘రాజమిత్రులు’ అను బిరుద మును పొందవచ్చును. మీకు వెండి, బంగారములు ఇతర బహుమతులు లభించును” అనిరి.

19. కాని మత్తతీయ గొంతెత్తి వారితో ”ఈ దేశములోని అన్య జాతి వారెల్లరును రాజాజ్ఞకు లొంగి, వారి పితరుల మతము విడనాడినప్పికి, 20. నేనును నా కుమా రులు మా బంధువులు మాత్రము మా పూర్వుల నిబంధననే పాింతుము.

21. దేవుని అనుగ్రహము వలన మేము ధర్మశాస్త్రమును, దాని విధులను ఏ మాత్రము మీరకుందుముగాక.

22. మేము రాజాజ్ఞలు పాింపదలచుకోలేదు, మా మతనియమములను ఏ మాత్రము మీరదలచుకోలేదు” అని స్పష్టము చేసెను.

23. అతడు తన మాటలను ముగింపగనే అచి యూదులలో ఒకడు ముందుకు వచ్చి రాజాజ్ఞ ప్రకా రము మోదెయీను పీఠముపై విగ్రహములకు బలిని అర్పింపబూనెను. 

24.  ఆ  సంఘటన  చూడగనే మత్తతీయకు ఆవేశము పుట్టెను. అతడు ఆగ్రహమును పట్టజాలక సముచితమైన కోపముతోనే పోయి ఆ యూదుని మీదబడి వానిని ఆ పీఠము మీదనే మట్టు బెట్టెను.

25. ఇంకను అతడు బలినర్పించుటకు ప్రజ లను నిర్బంధముచేసిన రాజకీయాధికారినిగూడ సంహ రించి పీఠమును కూలద్రోసెను.

26. ఆ సమయమున మత్తతీయ ధర్మశాస్త్రముపట్ల చూపిన అభిమానము పూర్వము సాలు కుమారుడైన సిమ్రీని చంపినపుడు ఫీనెహాసు చూపిన అభిమానము వింది.

27. అటు తరువాత మత్తతీయ ”మీలో ధర్మము పట్ల అభిమానముగలవారు, నిబంధనను పాింప గోరు వారు నా వెంట రండు” అని బిగ్గరగా అరచుచు నగర వీధులగుండ తిరిగెను.

28. ఆ పిమ్మట అత డును, అతని కుమారులును తమ ఆస్తిపాస్తులను నగర ముననే వదలిప్టిె పర్వతములకు పారిపోయిరి.

అరణ్యమున విశ్రాంతిదినమును పాించుట

29-30. ఆ రోజులలోనే యూదమతమునకు, ధర్మశాస్త్రమునకు కట్టుబడి జీవించు నిష్ఠాపరులు కొందరు శత్రువులు పెట్టు ఘోరబాధలను భరింప జాలక తమ పశువులను, పిల్లలను, భార్యలను తీసి కొని అరణ్యమునకు వెళ్ళిపోయి అచట వసింప  మొద లిడిరి.

31. రాజు ఆజ్ఞను ధిక్కరించిన యూదులు కొందరు అరణ్యమునకు పారిపోయి అచట తలదాచు కొనుచున్నారని రాజు ఉద్యోగులకును, యెరూషలేము దగ్గరనున్న సైనికులకును వార్త చేరెను.

32. కనుక వారిని పట్టుకొనుటకు ఒక పెద్ద సైనిక బృందము పోయెను. ఆ సైనికులు యూదులు దాగుకొనియున్న చోికి వచ్చి వారి చెంత విడిది చేసిరి. విశ్రాంతి దిన మున వారి మీదపడ నిశ్చయించుకొనిరి.

33. ఆ సైనికులు యూదులను చూచి ”తరుణమింకను మించి పోలేదు, మీరు దాగియున్న తావు నుండి వెలుపలికి వచ్చి రాజాజ్ఞకు తలయొగ్గుడు. మేము మీ ప్రాణము కాపాడుదుము” అని కేకలుప్టిెరి.

34. కాని ఆ యూదులు ”మేము ఇచినుండి వెలుపలికిరాము. మేము రాజు ఆజ్ఞను పాింపము. విశ్రాంతి దిన మును అమంగళము చేయము” అని బదులపలికిరి.

35. శత్రు సైనికులు వెంటనే వారి మీదపడిరి.

36. కాని యూదులు విరోధులనెంత మాత్రము ఎదిరింపక మెదలకుండ ఉండిపోయిరి. వారు శత్రువుల మీద రాళ్ళు విసరనులేదు. తాము దాగియున్న కొండ బిల ములను మూసివేయను లేదు.

37. ”మేము నిర్దో షులుగా ప్రాణములు విడుతుము. మీరు మమ్ము అన్యాయముగా సంహరించుచున్నారని భూమ్యాకా శములు సాక్ష్యము పలుకును” అని మాత్రము నుడివిరి.

38. అంతట శత్రుసైనికులు విశ్రాంతి దినమున ఆ యూదులను, వారి భార్యలను, పిల్లలను, పశువులను సంహరించిరి. అచట చనిపోయిన వారు మొత్తము వేయిమంది.

మత్తతీయ అతని అనుచరుల తిరుగుబాటు కార్యాచరణ

39. మత్తతీయ, అతని అనుచరులు ఆ వార్త విని మిగుల సంతాపము చెందిరి.

40. వారు తమలో తాము ‘శత్రువులు వచ్చినపుడు మనమును ఈ యూదుల వలె మెదలకుండ ఉండి పోవుదమేని, మన ప్రాణములను, మతమును కాపాడుకొనుటకుగాను ఈ అన్యజాతులతో పోరాడకుందుమేని, వీరు మనలను అనతికాలముననే నేల మీది నుండి తుడిచి పెట్టు దురు” అని అనుకొనిరి.

41. కనుక వారు అక్కడికక్కడే ఈ క్రింది నిర్ణయము చేసికొనిరి. ‘శత్రువులెవరైన విశ్రాంతిదినమున తమ మీదికి దాడి చేసినచో తాము ఆ శత్రువులను ఎదిరింపవలయును. తమ తోి యిస్రాయేలీయులవలె తాము దాగుకొన్న తావుల లోనే నాశనమై పోగూడదు.’

42. అటు తరువాత యిస్రాయేలీయులలోని హాసిదీయులను భక్తులు మత్తతీయ పక్షమున చేరిరి. వారు మహావీరులు, ధర్మ శాస్త్రమును నిలబెట్ట వలె నను పట్టుదల కలవారు.

43. ఇంకను మతహింస లకు గురియైనవారు కూడ వచ్చి మత్తతీయ బృంద ముతో చేరిపోగా వారి బలము హెచ్చెను.

44. వీరందరు కలిసి ఒక సైనికబృందముగా ఏర్పడిరి. ఆ బృందము వారు మహాకోపముతో యూద మతమును విడనాడిన వారిని శిక్షింపగా వారు పారిపోయి అన్యజాతి ప్రజల మరుగుజొచ్చిరి.

45. మత్తతీయ అతని స్నేహితులు దేశమంతట సంచారములు చేసి అన్యదైవముల పీఠ ములను కూలద్రోసిరి. 46. యిస్రాయేలు దేశమున సున్నతిపొందని పిల్లలందరికి బలవంతముగా సున్నతి చేయించిరి.

47. వారు పొగరుబోతుతనముతో మిడిసిపడు శత్రునాయకులను కూడ హతమార్చి విజయము బడసిరి.

48. ఆ రీతిగా ఆ బృందమువారు అన్యజాతి ప్రజలయు, వారి రాజులయు బెడదనుండి ధర్మశాస్త్రమును కాపాడిరి. దుష్టుడైన ఆంియోకసు రాజు కోరలను ఊడబెరికిరి.

మత్తతీయ తుదిసందేశము, మరణము

49. అంతట మత్తతీయకు కాలముచెల్లి మర ణము ఆసన్నముకాగా అతడు కుమారులతో ఇట్లనెను: ”నాయనలారా! గర్వాత్ములు అధికారము లోనికి వచ్చి మనలను హేళనచేయుచున్నారు. ఇది ద్వేషమునకును, సంతాపమునకును నిలయమైన దుష్టకాలము.

50. కుమారులారా! మీరిపుడు ధర్మశాస్త్రముపట్ల ఎనలేని భక్తి చూపవలయును. ప్రభువు మన పితరులతో చేసి కొనిన నిబంధనమును నిలబెట్టుటకు మీ ప్రాణము లను అర్పించుటకైనను వెనుకాడకుడు.

51. మన పితరులు వారి తరములలో సాధించిన కార్యములను జ్ఞప్తికి తెచ్చుకొనుడు.

                              వాి మూలమున మీకును శాశ్వతమైన గౌర వము, కీర్తి అబ్బును.

52. ప్రభువు అబ్రహాముని పరీక్షకు గురిచేయగా అతడు తన విశ్వసనీయతను ప్రదర్శించుకొని న్యాయ వంతునిగా గణింపబడలేదా?

53. యోసేపు ఆపత్కాలమునకూడ ధర్మశాస్త్ర మును పాించినందున ఐగుప్తునకు ప్రభువయ్యెను.

54. మన పితరుడైన ఫీనెహాసు మహాభక్తిని ప్రద ర్శించుటచే తరతరములదాక యాజకత్వమను ఒడంబ డికను బహుమతిగా పొందెను.

55. యెహోషువ ధర్మశాస్త్రమునకు విధేయుడై నందున యిస్రాయేలీయులకు న్యాయాధిపతి అయ్యెను.

56. కాలెబు యిస్రాయేలు సమాజమునకు మంచి వార్తలు కొనివచ్చి, దానిని బలపరచినందున వాగ్దత్త భూమిలో పాలుపొందెను.   

57. దావీదు దయార్ధ్రహృదయుడు కనుక అతడు, అతని తనయులు, శాశ్వతముగా రాజ్యము ఏలిరి.

58. ఏలీయా ధర్మశాస్త్రముపట్ల అపారభక్తి ప్రద ర్శించినందున పరమునకు కొనిపోబడెను.

59. హననీయ, అజర్యా, మిషాయేలు విశ్వాసము వలన నిప్పుమంటలను తప్పించుకొనిరి.

60. దానియేలు వినమ్రుడు కనుక ప్రభువతనిని సింహము కోరలనుండి విడిపించెను.

61. ఈ రీతిగా ఆయా తరములందు ప్రభువును నమ్మిన భక్తులు తమ శక్తినే ఏమాత్రము కోల్పోరైరి.   

62. మీరు దుష్టుల బెదిరింపులకు భయపడవలదు. వారెల్లరును చత్తురు, వారి శవములను పురుగులు తినివేయును.

63. నేడు వైభవోపేతులుగా ఉన్నను రేపికి వారు మిగులరు. వారెల్లరును మ్టి పాలగుదురు. వారి కుతంత్రములన్ని వమ్మగును.

64. కుమారులారా! మీరు ధైర్యముతో నిలిచి ధర్మ శాస్త్రమును కాపాడుడు.

                              దాని మూలమున  మీరు కీర్తిబడయుదురు.      

65. ఇదిగో మీ సహోదరుడైన సీమోను.  ఇతడు తెలివైనవాడు. కనుక మీరు నా మాటవలె ఇతడి మాటను పాింపుడు. అతడు మీకు తండ్రిలాిం వాడు.

66.యూదా మక్కబీయుడు బాల్యమునుండియు బలశాలి. ఇతడు మీకు నాయకుడై శత్రువులతో యుద్ధము చేయును.

67. మీరు ధర్మశాస్త్రమును పాించువారి నందరిని మీ పక్షమున చేర్చుకొనుడు. మన ప్రజలకు అపకారము చేసినందులకుగాను శత్రువులను శిక్షింపుడు.

68. అన్యజాతులకు తగిన శాస్తిచేయుడు. ఎల్లపుడు ధర్మశాస్త్రమును జాగ్రత్తగా పాింపుడు.”

69. ఈ మాటలను చెప్పిన పిదప మత్తతీయ కుమారులను దీవించి ప్రాణములు విడచెను.

70. అతనిని మోయిదెనులోని తమ కుటుంబ సమాధిలో పాతిప్టిెరి. యిస్రాయేలీయులు అతని మృతికి మిగుల శోకించిరి. ఈ సంఘటనము గ్రీకు శకము 146వ యేట (క్రీ.పూ 166) జరిగెను.