రోము స్పార్టా నగరములతో పొత్తు

12 1. ఎల్లకార్యములును తనకు అనుకూల ముగా జరుగుచున్నవని గ్రహించి యోనాతాను రోము నకు దూతలనంపెను. అతడు రోమీయులతో సఖ్య సంబంధములను స్థిరము చేసికోగోరెను.

2. ఆ ఉద్ధేశ ముతోనే స్పార్టాకును, ఇతర స్థలములకును గూడ లేఖలు పంపెను.

3. అతని దూతలు రోము చేరుకొని అచి రాజ్యసభను ప్రవేశించిరి. రోముతో పూర్వపు సఖ్యసంబంధములను, సంధిని కొనసాగించుకొను టకుగాను ప్రధానయాజకుడగు యోనాతాను, యూదులు తమను పంపిరని సభాసదులకు తెలియజేసిరి.

4. రోమీయులు ఆ దూతలను సురక్షితముగా యూదయాకు తిరిగి పోనీయవలెనని ఆయా తావులలోని అధికా రులకు జాబులు వ్రాసి యిచ్చిరి.     

5. యోనాతాను స్పార్టా పౌరులకు పంపిన కమ్మ ఇది:

6. ”ప్రధానయాజకుడు యోనాతాను, పెద్దల సమాజము, యాజకులు, యూదయా పౌరులు స్పార్టా యందలి తమసోదరులకు శుభములుపలికి వ్రాయునది.

7. పూర్వము మీ రాజు అరియాసు మా ప్రధాన యాజకుడగు ఓనియాసునకు లేఖ పంపెను. మీరును మేమును ఒకే జాతివారమని అతడు ఆ జాబులో పేర్కొనెను. మేము మీకు పంపుచున్న ఆ లేఖ ఈ అంశమును రుజువు చేయును.

8. ఓనియాసు మీ రాయబారిని గౌరవాదరములతో ఆహ్వానించి మీరు పంపిన లేఖను స్వీకరించెను. మీరు మాతో సంధి చేసికొని మాకు మిత్రులు కాగోరితిరని ఆ జాబులో పేర్కొనబడినది.

9. ఇప్పుడు మాకు అి్ట సంధితో అవసరము లేదు. మా చెంతనున్న పవిత్రగ్రంథములే మాకు ఓదార్పు చేకూర్చి పెట్టుచున్నవి.

10. అయి నను మాకు మీతోగల సోదరభావమును, స్నేహమును పెంపొందించుకొనుటకు ఇప్పుడు ఈ లేఖ వ్రాయు చున్నాము. మేము మీకు అపరిచితులముగా ఉండ దలచు కోలేదు. మీరు మాకు జాబు వ్రాసి కూడ చాల యేండ్లయినది.

11. ఏడాది పొడుగున మా పండుగలలోను, ఇతర సందర్భములలోను మేమ ర్పించు బలులందును, ప్రార్థనలందును మేము మిమ్ము స్మరించుకొనుచున్నాము. సోదరప్రజను జ్ఞప్తికి తెచ్చు కొనుట సముచితమే కదా!

12. మీరు కీర్తిని గడించి తిరని విని మేము సంతసించుచున్నాము.

13. మామట్టుకు మేమిచట చాల యుద్ధముల కును, ఉపద్రవములకు గురియైతిమి. మా చుట్టు పట్ల గల జాతులు మాతో నిరంతరము యుద్ధములు చేసినవి.

14. ఈ పోరాటములలో మేము మిమ్ము గాని, ఇతర మిత్రులను గాని శ్రమపెట్టదల్చుకోలేదు.

15. ఇపుడు దేవుని అనుగ్రహము వలన మేము శత్రువుల బారినుండి తప్పుకొింమి. వారు మాకు లొంగిపోయిరి. 16. కనుక ఇపుడు మేము అంియోకసు కుమారుడైన సుమేనియసును, యాసోను కుమారుడైన ఆంిపాతెరును రోమునకు పంపితిమి. మేము రోముతో సఖ్యసంబంధములను పెంపొందించు కోగోరెదము.

17. వారు తమ ప్రయాణములో మిమ్మును గూడ సందర్శించి ఈ లేఖను మీ కొసగవలెనని ఆజ్ఞాపించి తిమి. మేము మీకు సోదరులుగా ఉండగోరెదమని ఈ జాబులో వివరించితిమి.

18. మాకు ప్రత్యుత్త రము పంపవలెనని మిమ్ము వేడుకొనుచున్నాము.”

19. స్పార్టా దేశీయులు పూర్వము ఓనియాసు నకు పంపిన జాబు ఇది:

20. ”స్పార్టా రాజు అరియాసు ప్రధాన యాజ కుడు ఓనియాసునకు శుభములు పలికి వ్రాయునది.

21. యూదులు స్పార్టా దేశీయులను గూర్చిన దస్తావేజు ఒకి మా కంటబడినది. మన మిరు వురము సోదర జాతులమనియు అబ్రహాము మనకు మూలపురుషుడనియు దానిలో చెప్పబడినది.

22. ఇపుడు మేము మన బంధుత్వము గూర్చి తెలిసి కొింమి కనుక మీరు మీ సంక్షేమమును గురించి తెలియజేసినచో మేము మిగుల సంతసింతుము.

23. మా మట్టుకు మేము మీకు పంపు సందేశమిది. మీ పొలములు, మీ మందలు మావియగును. అట్లే మా పొలములు మా మందలు మీవియగును. ఈ సంగతి మీకు విన్నవింపవలెనని మాదూతను ఆదేశించితిమి.”

యోనాతాను సీమోనుల యుద్ధములు

24. దెమేత్రియసు సైన్యాధిపతులు పూర్వము కంటె పెద్ద సైన్యముతో తన మీదికి దండెత్తి వచ్చు చున్నారని యోనాతాను వినెను.

25. అతడు శత్రు వులను తన దేశమున ప్రవేశింపనీయగూడదని నిశ్చ యించుకొనెను. కనుక అతడు యెరూషలేమును  వీడి హమాతు  సీమలో  వారిని  ఎదుర్కొనబోయెను.          

26. యోనాతాను విరోధి శిబిరమునకు వేగుల వాండ్రను పంపగా వారుశత్రువులు రాత్రివేళ వచ్చి యూదులమీద పడనున్నారని తెలియజేసిరి.

27. మునిమాపున యోనాతాను తన సైనికులను ఆయు ధములతో సిద్ధముగానుండుడని ఆజ్ఞాపించెను. విరోధులు రాత్రివేళ ఎప్పుడైన వచ్చి తమ మీద పడవచ్చునని తెలియజేసెను. అతడు శిబిరము చుట్టు  పహారావారిని కాపుపెట్టెను.

28. యోనాతాను అతని సైనికులు యుద్ధమునకు సిద్ధముగానున్నారని గ్రహించి శత్రు సైనికులు కలవరపడి తమ శిబిరమున వెలుగుచున్న మంటలను గూడ ఆర్పివేయకపారిపోయిరి.

29. యోనాతాను అతని అనుచరులు విరోధి శిబిరమున వెలుగుచున్న మంటలనుచూచిరి. కాని విరోధులు పలాయితులైరని మరుసి రోజు ఉదయము దాక గుర్తింపరైరి.

30. ఉదయమున యోనాతాను శత్రు వుల వెంటబడెనుగాని వారప్పికే ఎలెయుతేరు నదిని దాి వెళ్ళిపోయిరి.

31. యోనాతాను చేయునది లేక వెనుదిరిగి దారిలో సబదీయులనబడు అరబ్బులను ముట్టడించి ఓడించెను. వారి సొత్తును కొల్లగొట్టెను.

32. తరువాత అతడు గుడారము లెత్తించి దమస్కున కు వెళ్ళెను. అచినుండి ఆ ప్రాంతమంతట పర్య ించెను. 33. ఇంతలో సీమోను కూడ దాడివెడలి అష్కెలోను ప్రాంతపు కోటలదాక వెళ్ళెను. అటు పిమ్మట యొప్పాను ముట్టడించెను.

34. అచి సైనికులు ఆ కోటను దెమేత్రియసు పక్షము వారికి ఒప్పగింపనున్నారని వినెను. కనుక సీమోను అచట ఒక సైనిక బృందమును కాపుపెట్టెను.

యెరూషలేమున కట్టడములు

35. యోనాతాను తిరిగివచ్చిన తరువాత పెద్దల నందరిని ప్రోగుజేసి యూదయాలో కోటలు కట్టుటకు సన్నాహములు చేయించెను.

36. మరియు యెరూషలేము ప్రాకారముల ఎత్తును పెంచుటకును, కోటకును, నగర మునకును మధ్య ఎత్తయిన గోడను కట్టుటకును ఏర్పాట్లు చేయించెను. ఈ గోడ వలన కోటలో వసించు శత్రు వులు వస్తువులను అమ్ముటకు  గాని, కొనుటకుగాని వీలుపడదు.

37. అప్పికే తూర్పు లోయ చెంత ప్రాకారము పడిపోయియుండెను. కఫెనతా ప్రాంత మున గూడ మరమ్మతు అవసరమైయుండెను. కనుక ప్రజలందరును ప్రోగై నగరరక్షణనకు గోడలు కట్ట బూనిరి.

38. సీమోను కూడ పర్వత ప్రాంతమున నున్న అదిదా నగరమును పునర్నిర్మించెను. అతడు దానికి ప్రాకారములను నిర్మించి గడియలతో కూడిన ద్వారములను ప్టిెంచెను.

యోనాతాను శత్రువులకు చిక్కుట

39. త్రూఫోను అంియోకసు రాజు మీద తిరు గబడి సిరియాను స్వాధీనము చేసికొని కిరీటము ధరింపవలెనని అభిలషించెను.

40. కాని అతడు యోనాతాను తనకడ్డము వచ్చి తనమీద యుద్ధము చేయునని భయపడెను. కనుక అతడు సైన్యమును వెంటబెట్టుకొని బేత్షానునకు  వెళ్ళెను. ఎట్లయినను యోనాతానుని బంధించి  వధింపవలెనని అతని  పన్నా గము.

41. యోనాతాను కూడ శూరులైన సైనికులను నలువదివేల మందిని వెంటబెట్టుకొని బేత్షేనునకు వచ్చెను.

42. యోనాతాను పెద్ద సైన్యముతో వచ్చు టను చూచి త్రూఫోను అతనిని ఎదిరింప వెరచెను.

43. అతడు యోనాతానుని గౌరవాదరములతో ఆహ్వా నించి తన స్నేహితులకు పరిచయము చేసెను. అతనికి బహుమతులు అర్పించెను. తన పక్షము వారెల్లరును తనవలెనే యోనాతానునకును విధేయులై ఉండవలెనని శాసించెను.

44. అతడు యోనాతానుతో ”మన యిరి వురి మధ్య  యుద్ధమే లేనప్పుడు నీవు ఈ సైనికులను ఇన్ని వ్యయప్రయాసలకు  గురిచేయనేల?

45. ఇపుడు వీరినందరిని ఇండ్లకు పంపివేయుము. నీకు అంగ రక్షకులుగా నుండుటకు కొద్దిమందిని మాత్రము  వెంటబెట్టుకొని  నాతో  ప్టోలమాయిసునకురమ్ము. నేను ఆ నగరమును, అచి దుర్గములను, వానిలోని సేన లను, సైన్యాధిపతులను నీ వశము చేయుదును. అటు పిమ్మట నేను వెళ్ళిపోవుదును. ఇందులకే ఇపుడు నేని చికి వచ్చితిని” అని చెప్పెను.

46. యోనాతాను అతని మాటలు నమ్మి తన సైనికులను యూదయాకు పంపి వేసెను.

47. అతడు మూడువేలమందితో బయలు దేరి మరల వారిలో రెండువేల మందిని గలిలీయలో విడిచిపెట్టెను. వేయి మందిని మాత్రము వెంటబెట్టు కొని ప్టోలమాయిసునకు వెళ్ళెను.

48. కాని అతడు ప్టోలమాయిసును ప్రవేశింపగనే పౌరులు నగరద్వార ములు మూసివేసిరి. యోనాతానుని బంధించి అతని అనుచరులందరిని వధించిరి.

49. యోనాతాను సైన్య ములను మట్టుపెట్టుటకు గాను త్రూఫోను గలిలీయ కును, యెస్రెయేలు లోయకును కాలిబంటులను, ఆశ్వి కులను పంపెను.

50. యోనాతాను అతడి యను చరులు బంధీలై మడిసిరనుకొని యూదసైనికులు ఒకరినొకరు ప్రోత్సహించుకొనుచు సేనలుతీరి పోరునకు ఆయత్తమైరి.

51. యూదులు ప్రాణము లకు తెగించి పోరాడుచున్నారని గ్రహించి శత్రు సైన్య ములు వెనుకకు తగ్గెను.

52. అటు పిమ్మట యూద సైన్యములు సురక్షితముగా యూదయాకు మరలి వచ్చెను. కాని వారు మిగుల భయపడిరి. యోనాతాను అతని అనుచరులు చనిపోయిరనుకొని యూదాజాతి యంతయు శోకించెను.

53. చుట్టుపట్లనున్న అన్య జాతులెల్ల యిస్రాయేలీయులను నాశనము చేయ నెంచెను. వారు యూదులకు నాయకుడును, మద్దతు నిచ్చు వారును లేరు కనుక వారినెదిరించి అడపొడ కానరాకుండ చేయవలెననుకొనిరి.