హెలియొడొరసు కథ

3 1. ఓనియాసు ప్రధానయాజకుడుగా నుండిన కాలమున పవిత్రనగరమైన యెరూషలేము శాంతి సౌభాగ్యములకు ఆటపట్టుగానుండెను. అతడు దుష్క్రి యలను సహింపనివాడు, భక్తుడు. కనుక ఎల్లరును నియమములను పాించిరి.

2. వివిధ దేశములనేలు రాజులు కూడ దేవాలయమును గౌరవించి దానికి అమూల్యమైన బహుమతులు సమర్పించిరి.

3. ఆసియా రాజగు సెల్యూకసు తాను ప్రోగుచేసిన కప్పముల నుండే దేవాలయ బలులకు అగు వ్యయమును చెల్లించెడి వాడు.

4. అపుడు బిల్గా తెగకు చెందిన సీమోను దేవాలయాధికారిగా నియమింపబడెను. ఇతడు నగర ములోని విపణి వీధిని గూర్చి ఓనియాసుతో వివాదము పెట్టుకొని ఓడిపోయెను.

5. ఆ రోజులలో తార్సిసు కుమారుడు అపోల్లోనియసు పెద్దసిరియాకు రాష్ట్రపాల కుడుగా ఉండెడివాడు.

6. సీమోను అతని యొద్దకు వెళ్ళి దేవాలయ కోశాగారము విస్తారమైన సంపదతో మూలుగుచున్నదని, బలులకగు వ్యయమునకు అంత సొమ్ము అక్కరలేదు, కనుక రాజు ఆ సొత్తును స్వాధీనము చేసికోవచ్చునని చెప్పెను.

7. అపోల్లోనియసు రాజును కలిసికొనినపుడు ఆ సంగతి తెలియజేసెను. రాజు ఆ సొత్తును తీసికొనివచ్చుటకు తన ప్రధానమంత్రి అయిన హెలియొడొరసును నియమించెను.

8. హెలియొడొరసు వెంటనే ప్రయాణము కట్టెను. కాని అతడు పెద్ద సిరియా మరియు ఫినీష్యాలోని నగరములను దర్శింపబోవు వానివలె నించెను.

9. ఆ ప్రధానమంత్రి యెరూషలే మునకు రాగా ప్రధానయాజకుడు, పౌరులు అతనిని హృదయపూర్వకముగా ఆహ్వానించిరి. అంతటతడు తాను వచ్చిన పనిని తెలియజేసి దేవాలయ కోశాగార మున విస్తారమైన నిధులున్న మాట నిజమేనా అని ప్రశ్నించెను.

10-11. ప్రధానయాజకుడు ”అయ్యా! ఆ దుర్మార్గుడు  సీమోను మీతో చెప్పిన మాటలు నిజము కాదు. దేవాలయ కోశాగారమున కొంతధనమున్న మాట నిజమే. కాని దానిలో కొంతభాగము వితంతువుల కొరకును, అనాథ శిశువుల కొరకును నిర్దేశింప బడినది. మరికొంత భాగము తోబియా కుమారుడు ప్రముఖుడు హిర్కేనసుకు చెందినది. మొత్తము సొమ్ము నాల్గువందల వీసెల  వెండియు, రెండువందల వీసెల బంగారము ఉండును.

12. జగద్విఖ్యాతము పవిత్ర మునైన ఈ దేవాలయమును నమ్మి ఇతరులిచట తమ సొమ్మును భద్రపరచుకొనిరి. అి్ట సొమ్మును అన్యులు కొనిపోవుట భావ్యము కాదు” అని చెప్పెను.

యెరూషలేమున కలవరము

13. కాని హెలియొడొరసు, రాజు ఆజ్ఞాపించి నట్లుగా ఆ సొమ్మును రాజుకోశాగారమునకు తరలింపవలెనని పట్టుపట్టెను.

14. అతడు ముందుగనే ఒకరోజును నిర్ణయించి ఆ రోజున సొమ్మును లెక్కించుటకుగాను దేవాలయములోనికి వెళ్ళెను. ఆ సంగతి విని నగరమెల్లను గగ్గోలుపడెను.

15. అర్చకులు యాజకవస్త్రములు ధరించి పీఠము ముందు సాష్టాంగ పడిరి. వారెవరైన దేవాలయమున నిధులను భద్ర పరచినచో వానిని కాపాడవలెనని నియమము చేసిన భగవంతునకు ఇప్పుడీ సొమ్మును రక్షింపుమని మనవి చేసిరి.

16. అప్పుడు ప్రధానయాజకుని వైపు చూచిన వారి మనసు కరిగిపోయెను. అతని ముఖము వివర్ణ మయ్యెను. అతని మనసులోని బాధ ఎల్లరికిని అర్థ మయ్యెను.

17. అతని దేహము భయముతో కంపించి పోయెను. ఆ కంపమతని హృదయములోని వ్యధను వ్యక్తము చేయుచుండెను.

18. ప్రజలెల్లరును తమ యిండ్లనుండి పరుగెత్తుకొనివచ్చి దేవాలయమును అమంగళము కానీయవలదని  దేవునికి ప్రార్థన చేయ బూనిరి.

19. స్త్రీలు నడుముల మీద గోనెపట్ట కట్టుకొని వీధులలో ప్రోగైరి. తల్లిదండ్రులు ఇల్లు వదలి బయికి వెళ్ళనీయని కన్యలు కొందరు నగరద్వారముల చెంతకు, కొందరు ప్రాకారముల చెంతకు పరుగెత్తిరి. కొందరు తమ ఇండ్లలోని కికీలగుండ  వెలుపలికి తొంగి చూచిరి.

20. ఎల్లరును చేతులెత్తి దేవుని ప్రార్థించిరి.

21. ఆ రీతిగా పురజనులెల్లరును గుమిగూడి సాష్టాంగ పడి ప్రార్థన చేయుటను, ప్రధానయాజకుడు తీవ్రమైన మనోవ్యధకు గురియగుటను చూడగా ఎల్లరి హృదయ ములును ద్రవించిపోయెను.

22-23. ప్రజలెల్లరును దేవాలయమున దాచుకొన్న వారి సొమ్మును సురక్షిత ముగా కాపాడుమని సర్వశక్తిమంతుడైన దేవునికి ప్రార్థన చేయుచుండగా హెలియొడొరసు కోశాగారము లోని నిధులను తనిఖీ చేయబూనెను.

హెలియొడొరసునకు శిక్ష

24. ఆ మంత్రి తన అంగరక్షకులతో దేవాలయ కోశాగారమునొద్దకు వచ్చెను. వెంటనే సర్వాత్మలకును, సర్వశక్తులకును అధిపతియైన  మహాప్రభువు  ఒక  దివ్యదర్శనము కలిగింపగా మంత్రితో వెళ్ళ సాహ సించిన వారందరును గగ్గోలుపడిరి. వారు ప్రభువు శక్తిని జూచి భయభ్రాంతులైరి.

25. ఆ దర్శనములో వారికొక గుఱ్ఱమును రౌతును కనిపించిరి.  ఆ గుఱ్ఱ మునకు అందముగా అలంకరింపబడిన కళ్ళెము కలదు. రౌతు బంగారు ఆయుధములను ధరించి భీకరముగానుండెను. ఆ గుఱ్ఱము భయంకరముగ హెలియొడొరసు మీదికి దుమికి, అతనిని తన ముంది కాళ్ళగిట్టలతో తన్నెను.

26. అప్పుడు ఆ మంత్రి బలిష్ఠులును, సుందరాకారులు, మనోహర వస్త్రధారులైన ఇరువురు యువకులనుగూడ చూచెను. వారు మంత్రికి ఇరువైపుల నిలుచుండి చాలసేపు అతడిని కొరడాలతో మోదిరి.

27. వెంటనే హెలియొడొరసు కన్నులకు చీకట్లు క్రమ్మగా అతడు నేలమీదికి ఒరిగెను. అతని అనుచరులు అతనినొక డోలికపై పరుండబ్టెి  వెలుపలికి కొనిపోయిరి. 28. అతడొక్క క్షణము ముందు చాలమంది అనుచరులతోను అంగరక్షకులతోను కోశా గారము లోనికి వెళ్ళెను కదా! ఇప్పుడు నిస్సహాయుడై యుండగా అతనిని వెలుపలికి కొనిపోయిరి. అతని అనుచరులెల్లరును దేవుని మహాశక్తిని గుర్తించిరి.

29.  ప్రభువు దర్శనమువలన హెలియొడొరసు మాటలు కోల్పోయి, అనారోగ్య స్థితిలో అట్లే పడి యుండెను. 30. ప్రభువు అద్భుతరీతిన దేవాలయమును రక్షించెను. ఒక్క నిమిషమునకు ముందు భయము, కలవరపాటు నెలకొనియున్న తావున ప్రభువు ఇప్పుడు మహానందమును కలిగించెను. కనుక యూదులు ప్రభువును స్తుతించి, కీర్తించిరి.

31. హెలియొడొరసు మిత్రులు తమ నాయకునికొరకు ప్రార్థనము చేయు మని ఓనియాసును వేడుకొనిరి. మహోన్నతుడైన ప్రభువు మృత్యువు వాతబడనున్న తమ మంత్రిని కాపాడు నట్లు మనవి చేయుమని త్వరత్వరగా బతిమాలిరి.

32. తాను పంపిన ప్రతినిధికి యూదులే ఇి్ట ఆపద తెచ్చి ప్టిెరని రాజు శంకించునేమోయని ఓనియాసు భయపడెను. కనుక అతడు హెలియొడొరసు ఆరోగ్యము కొరకు బలినర్పించెను.

33. అతడు ఆ రీతిగా బలి నర్పించుచుండగా పూర్వపు యువకులిద్దరును అవే దుస్తులతో మరల హెలియొడొరసునకు దర్శనమిచ్చి యిట్లనిరి: ”ఓయి! నీవు ప్రధానయాజకుడైన ఓనియాసు నకు కృతజ్ఞుడవైయుండుము. అతనిని చూచియే ప్రభువు నిన్ను కాపాడెను.

34. నిన్ను శిక్షించినవాడు పరలోకాధిపతియైన ప్రభువు. కనుక నీవు వెళ్ళి ఎల్లరి కిని ఆయన వైభవమును చాిచెప్పుము.” ఇటుల చెప్పి ఆ యువకులు అదృశ్యులైరి.

హెలియొడొరసు పరివర్తనము

35. హెలియొడొరసు ప్రభువునకు బలినర్పించెను. తన ప్రాణమును కాపాడినందులకుగాను దేవునికి మ్రొక్కులు చెల్లించెను. ప్రధానయాజకునివద్ద సెలవు తీసికొని సైన్యముతో రాజునొద్దకు తిరిగివచ్చెను.

36. అతడు దేవాదిదేవుడగు ప్రభువు చేసిన అద్భుత కార్యమును ఎల్లరికిని విదితము చేసెను.

37. అంతట రాజు యెరూషలేమునకు మరల మన ప్రతినిధినొకనిని పంపవలెనన్నచో ఎి్టవానిని  పంపవలయునో  చెప్పు మని అడుగగా హెలియొడొరసు ఇట్లనెను: 38. ”నీ శత్రువుగాని నీ మీద కుట్రలు పన్నువాడుగాని ఎవడైన ఉన్నచో అతనిని యెరూషలేమునకు పంపుము. అతడు మరల తిరిగిరాడు. ఒకవేళ వచ్చెనేని బాగుగా కొరడా దెబ్బలు తినిగాని రాడు. ఏదో విచిత్రమైన దైవశక్తి అచట నెలకొని ఉన్నది.

39. స్వర్గలోకవాసియైన దేవుడు ఆ దేవాలయమును కాపాడుచున్నాడు. ఆ మందిరము నకు కీడును తలప్టిెనవారిని ఆయన అక్కడికక్కడే  కూలద్రోయును.”

40. హెలియొడొరసు ఆగడము నుండి ప్రభువు దేవాలయ కోశాగారమును రక్షించిన తీర్టిది.