ఉపోద్ఘాతము:
పేరు: ఎస్తేరు ఒక యూద నాయకురాలు. ఎస్తేరు అనగా ”నక్షత్రము”. ఎస్తేరు కథను యిస్రాయేలీయుల నాయకుల వృత్తాంతములతో సమానముగా చూచెదరు. ఈ వృత్తాంతమును సంవత్సరమున ఆఖరిపండుగ అయిన ‘పూరీము’. మరియు ఇతర పండుగ సమయములో ఎక్కువగా స్మరించుకొందురు.
కాలము: క్రీ.పూ. 3-2 శతాబ్దాలలో వ్రాయబడినది.
రచయిత: మొర్దెకయి (17:29) లేదా ఎజ్రా లేక నెహెమ్యా అని భావిస్తారు. కాని ఎవరైనది ఖచ్చితముగా తెలియదు.
చారిత్రక నేపథ్యము: నెహెమ్యా అనంతరము దాదాపు ముప్పది సంవత్సరముల తరువాత ఈ గ్రంథములోని విశేషాలు చోటుచేసుకున్నాయని గుర్తించబడినది. ఇందలి సంఘటనలు పారశీక రాజధాని షూషను రాజు అంతఃపురములో జరిగెను. ఇందు చారిత్రక అంశములు చాలా కనిపించును. పారశీక సామ్రాజ్యములో ప్రవాసులైన యిస్రాయేలు ప్రజలకు వచ్చిన అపాయము దీని ప్రధాన వృత్తాంతము.
ముఖ్యాంశములు: దేవుడు మొర్దెకయి, ఎస్తేరుల ద్వారా యూదులను రక్షించడము, యూదులను నాశనముచేయ తలప్టిెనవారిని అంతమొందించడము అను అంశములు, ప్రవాసములోనున్న యూదులకు గొప్ప ఆశను, భవిష్యత్తుపై నమ్మకాన్ని కలిగించడానికి వుద్ధేశింపబడినది. తరచుగా కష్టాలు, అవమానాలు, హింసలకు గురవుతున్న యూదులను యావే దేవుడు వారిని నిర్లక్ష్యము చేయరని తెలుపుతున్నది. దేవుడు తన పరికరముగా వినియోగించిన వ్యక్తులలో ఎస్తేరు స్త్రీ అయి వుండడం గమనార్హము. ఈ గ్రంథము యూదుల పండుగయైన పూరీము ఆవశ్యకతను తెలుపుతుంది (17:20-22). ఈ పండుగ నాడు ప్రజలు కానుకలను అర్పించుకోవడము, దానములు చేయడము పరిపాి.
క్రీస్తుకు అన్వయము: పరోక్ష అన్వయము చూడగలము. దేవుడు ఎస్తేరు ద్వారా తన ప్రజలను రక్షించెను. ప్రజల తరపున నిలిచిన క్రీస్తుకు చిహ్నముగా ఎస్తేరును చూడవచ్చు.
గ్రంథము అధ్యాయముల సంఖ్య, వచనముల సవరణల వివరణము
హీబ్రూ, గ్రీకు భాషల్లో ఎస్తేరు గ్రంథముయొక్క వేర్వేరు ప్రతులు లభ్యమయినాయి. మొదట హీబ్రూ ప్రతియు, ఆ పిమ్మట గ్రీకు ప్రతియు వ్రాయబడినవి. ఈ గ్రంథములోని అధ్యాయముల, వచనముల విభజనలు జరిగినపుడు హీబ్రూ ప్రతిలో పది అధ్యాయములుగ (1:1-10:3), గ్రీకు ప్రతిలో 11 నుండి 16 వరకు లెక్కించిరి. గ్రీకు ప్రతిలో ఈ క్రింది అంశములు అదనముగ గలవు: 1. మొర్దకయి కల(11:2-12:6), 2. అహష్వేరోషు శాసనము (13:1-7), 3. మొర్దకయి మరియు ఎస్తేరుల ప్రార్ధనలు (13:8-14:19), 4. ఎస్తేరు రాజుసమక్షమున నిలబడుట (15:1-16), 5. యూదులకు అనుకూలముగా అహష్వేరోషు శాసనము (16:1-24), 6. మొర్దకయి కల వివరణ (16:1-24). బైబిలు నిపుణులు ఈ గ్రంథములోని కథనము అర్థవంతముగా వుండడానికి వాిని సవరించిరి. దీని ఫలితముగనే ఈ గ్రంథఆరంభము 11వ అధ్యాయముతో మొదలగును. ఈ పద్దతి మూలముగా అధ్యాయములలో తేడాలుండును. ఈ గ్రంథములోని అధ్యాయములకు పూర్వగ్రంథములో సమానమైన అధ్యాయములను, వచనములను బ్రాకెట్లలో చూడగలరు.
ఈ గ్రంథపు గ్రీకు అనువాదము
ప్టోలమీ మరియు క్లియోపాత్ర పరిపాలనా కాలము నాలుగవయేట, డోసేతీ మరియు అతని కుమారుడు ప్టోలమీ పూరీము ఉత్సవము గూర్చిన ఈ లేఖను కొనివచ్చారు. ఈ డోసేతీ తాను లేవీయ యాజకుడని చెప్పుకొన్నాడు. వీరిరువురు ఈ లేఖ విశ్వసనీయమైనదని, ప్టోలమీ కుమారుడు, యెరూషలేము నివాసి లిసిమాఖకు దీనిని మూలము నుండి అనువదించి యిచ్చెనని ధృవపరచారు.