కథా ప్రారంభము
మొర్దెకయి కల
1(11) 1. మహాప్రభువైన అహష్వేరోషు పరిపాల నాకాలము రెండవయేట నీసాను నెల మొది దిన మున మొర్దెకయికి ఒక కల వచ్చెను. బెన్యామీను తెగకు చెందిన యాయీరు, షిమీ, కీషు క్రమముగా ఇతని వంశకర్తలు. 2. ఇతడు షూషను నగరమున వసించుచున్న యూదుడు, రాజు ఆస్థానమున పెద్ద ఉద్యోగి.
3. పూర్వము బబులోనియా ప్రభువు నెబుకద్నెసరు, యూదా రాజు యెకోన్యాతో పాటు యెరూషలేమునుండి బందీలుగా కొనివచ్చిన వారిలో యితడు ఒకడు. మొర్దెకయి కన్న కల యిది:
4.భూమిమీద ఆర్తనాదము, గందర గోళము, ఉరుములు, భూకంపము, కలవరపాటు గోచరించెను.
5. రెండు మహా సర్పములు యుద్ధమునకు సన్నద్ధమై వచ్చి భయంకరముగా కేకలిడెను.
6. ఆ కేకలు విని నేలమీది జాతులన్ని ప్రోగై ధర్మమును పాించు జాతిపై యుద్ధమునకు తలపడెను.
7. అది భూమిమీద చీకి, బాధ, విచారము, పీడనము, కలవరపాటుతో కూడిన దుర్దినము.
8. ఆ ఉపద్రవము చూచి ధర్మ మును పాించు జాతి మిక్కిలిభయపడి మరణము నకు సిద్ధమయ్యెను.
9. ఆ జాతి ప్రజలు దేవునికి మొర ప్టిెరి. ఆ మొర ఫలితముగా ఒక చిన్న చెలమనుండి వెలువడినదో అన్నట్లు పెద్ద యేరు ప్టుి పొంగి పారెను.
10. అంతట సూర్యుడు ఉదయింపగా వెలుగు కలిగెను. అప్పుడు దీనులైన ధర్మజాతి ప్రజలు ఔన్న త్యము పొంది శక్తిమంతులైన వారిని మ్రింగివేసెను.
11. ప్రభువు సంకల్పమును సూచించు ఇి్ట కల నుండి మేల్కొని మొర్దెకయి నిశితముగా ఆలోచింప మొదలిడెను. దాని భావము ఏమైయుండునా అని దినమంతయు తర్కించిచూచెను.