2 (12) 1. బిగ్తాను, తేరేషు అను ఇరువురు నపుంసకులు రాజప్రాసాద ప్రాంగణమునకు కావలి కాయుచుండగా మొర్దెకయి వారి దాపున శయ నించెను.
2. ఆ నపుంసకులు రాజు మీద కుట్ర పన్ను చుండిరి. మొర్దెకయి ఆ రహస్యమును పసికట్టెను. వారు అహష్వేరోషును హత్యచేయు పన్నాగమున నున్నారని గ్రహించి ఆ సంగతి రాజునకు విన్నవించెను.
3. రాజు ఆ ఇరువురిని బాధలకు గురిచేయగా వారు తమ తప్పిదమును ఒప్పుకొనిరి. అహష్వేరోషు వారిని ఉరి తీయించెను.
4. అతడు ఈ ఉదంతమునెల్ల రాజకార్యముల దస్తావేజున వ్రాయించెను. మొర్దెకయి కూడ ఆ సంగతిని లిఖించి యుంచెను.
5. రాజు మొర్దెకయికి ఆస్థానమున ఉద్యోగమిచ్చి బహుమతు లతో సత్కరించెను.
6. అప్పుడు అగాగు వంశజుడు హమ్మెదాతా కుమారుడైన హామాను అనువాడు రాజుమన్ననకు పాత్రుడైయుండెను. అతడు మాత్రము ఇరువురు నపుంసకులను చంపించినందులకుగాను మొర్దెకయికి కీడుచేయతలపెట్టెను.