పూరీము మహాదినము
17(9) 1. రాజు తాకీదు అదారు అను పండ్రెండవ నెల పదుమూడవ దినమున అమలులోనికి వచ్చెను. యూదుల శత్రువులు ఆ దినమున వారిని నాశనము చేయవచ్చును గదా అనుకొనిరి. కాని అనుకొనకుండ ఆనాడు యూదులే తమ శత్రువులను అణగద్రొక్కిరి.
2. ఆయా సంస్థానములోను, పట్టణ ములలోను వసించు యూదులు ఎక్కడివారు అక్కడే ప్రోగై, తమకు హానితలప్టిెన వారిమీదపడిరి.ఎల్ల రును వారికి భయపడుటచే, ఎవరును వారిని ఎదిరింపజాలరైరి.
3. అధిపతులు, అధికారులు మొదలైన ప్రభుత్వోద్యోగులెల్లరును మొర్దెకయికి జడిసి, యూదులకు సాయపడిరి. 4. రాజప్రాసాదమున మొర్దెకయి పలుకుబడి కలవాడని సంస్థానములందు ఎల్లెడల వెల్లడి ఆయెను. నానాికి అతని పలుకుబడి హెచ్చుచుండెను.
5. కనుక యూదులు కత్తులు చేప్టి తమ శత్రువులను చీల్చిచెండాడిరి. విరోధులనెల్ల తమఇష్టము వచ్చినట్లు చేసిరి.
6. ఒక్క షూషను దుర్గముననే ఐదువందల మందిని సంహరించిరి.
7-10. ఆ చచ్చినవారిలో యూదుల శత్రువు హమ్మెదాతా కుమారుడు హామానుని తనయులు పది మంది యుండిరి. వారి పేర్లివి: పర్షందాతా, డల్ఫోను, అస్పాతా, పోరాతా, అదల్యా, అరీదాతా, పర్మష్టా, అరీసయి, అరీదయి, వైసాతా. అయినను యూదులు శత్రువుల సొమ్మును దోచుకొనలేదు.
11. షూషను దుర్గమున చనిపోయినవారి సంఖ్యను ఆ దినమే రాజునకు తెలియజేసిరి.
12. అతడు ఎస్తేరు రాణితో ”ఒక్క షూషను దుర్గముననే యూదులు ఐదువందల మందిని మట్టుబ్టెిరి. హామాను పుత్రులు పదిమందినిగూడ చంపిరి. ఇక వారు మన సంస్థానములలో ఎి్ట కార్యములు చేసిరో! అయినను ఇపుడు నీకేమి కావలయునో చెప్పుము. ఇంకా నీవేమి కోరుకొందువో తెలియజేయుము. నీ కోర్కె తప్పక తీర్చెదను” అనెను.
13. ఎస్తేరు ”ప్రభువుల వారికి సమ్మత మగునేని షూషను దుర్గమునందలి యూదులు, నేి రాజశాసనమును రేపు కూడ అమలులో పెట్టు టకు అనుమతినిండు. హామానుని పదిమంది కొడుకుల శవములను కంబములపై వ్రేలాడదీ యింపుడు” అనెను.
14.రాజట్లే జరిగింప ఆజ్ఞ ఇచ్చెను. రాజాజ్ఞను షూషను దుర్గమున ప్రకించిరి. పదిమంది హామాను కుమారుల శవములను బహి రంగముగా వ్రేలాడదీసిరి.
15. షూషను నందలి యూదులు అదారు నెల పదునాల్గవ దినమున మరల గుమిగూడి మూడువందల మందిని తెగార్చిరి. అయినను వారు మృతుల ఆస్తిపాస్తులను దోచుకొన లేదు.
16. ఇతర సంస్థానములలోని యూదులు ఎక్కడి వారు అక్కడే ఏకముగా గుమిగూడి ఆత్మరక్షణ చేసి కొనిరి. వారు తమ విరోధులను డెబ్బది యైదువేల మందిని చంపి శత్రుపీడనను వదలించుకొనిరి. అయి నను వారు ఆ శత్రువుల సొత్తును దోచుకోలేదు.
17. ఈ సంఘటన అదారు నెల పదుమూడవనాడు జరిగెను. వారు పదునాలుగవనాడు శత్రువులను చంపుట చాలించి ఆనందముతో పండుగ చేసికొనిరి.
18. కాని షూషనునందలి యూదులు మాత్రము పద మూడు, పదునాలుగు తేదీలలో శత్రువులను వధించి పదునైదవ దినమున విశ్రాంతి తీసికొనిరి. ఆనాడు ఆనందముతో ఉత్సవము చేసికొనిరి.
19. కనుకనే అరక్షి తములైయున్న చిన్న ఊళ్లలో జీవించు యూదులు అదారు నెల పదునాలుగవ దినమున సెలవు తీసికొని ఆనందముతో ఉత్సవము చేసికొందురు. ఒకరి యిిింకొకరు భోజన పదార్ధములు పంపుకొందురు. కాని పెద్ద నగరములలో వసించు యూదులు మాత్రము అదారు నెల పదునైదవ దినమున పండుగ చేసికొని ఒకరి యిిింకొకరు వంటకములు పంపుకొందురు.
పూరీము పండగను నెలకొల్పుట
20. మొర్దెకయి జరిగిన సంఘటనలన్నిని లిఖించియుంచెను. అహష్వేరోషు రాజుపాలిత ప్రాంతాలలో నివసిస్తున్న యూదులందరికిని, దగ్గరి వారికిని దూరపువారికి గూడ లేఖలు పంపెను.
21. అదారు నెలలోని పదునాలుగు, పదునైదవ దినము లను ఏటేట సెలవురోజులనుగా నిర్ణయించెను.
22. ఇవి యూదులు శత్రుపీడనను వదిలించుకొనిన దినములు. ఈ నెలలో వారి దుఃఖము సంతోష ముగను, వారి విలాపము ఉత్సవముగను మారి పోయెను గదా! కనుక మొర్దెకయి ఈ దినములు ఆనందముతో కూడిన ఉత్సవదినములు కావలెనని ఆజ్ఞాపించెను. ఈ దినములందు యూదులు ఒకరి ఇంికొకరు వంటకములు పంపుకోవలెననియు పేదలకు దానధర్మములు చేయవలెననియు అతడు కట్టడ చేసెను.
23. యూదులు మొర్దెకయి లేఖను శిరసావహించి ఈ ఉత్సవమును జరుపుకొను ఆచార మును ప్రారంభించిరి. ఏటేట దానిని కొనసాగించు చువచ్చిరి.
24. అగాగు వంశజుడును హమ్మెదాతా కుమా రుడును, యూదుల శత్రువైన హమాను యూదులను మట్టుపెట్టు దినమును నిర్ణయించుటకు చీట్లువేసెను కదా! ఆ చీట్లకు ”పూరు” అని పేరు.
25. కాని ఎస్తేరు రాజును సందర్శింపగా అతడు లిఖితపూర్వక మైన శాసనమును చేసి హామాను యూదులకొరకు త్రవ్విన గోతిలో తానే పడిపోవునట్లు చేసెను. అతనిని, అతని కుమారులను ఉరి తీయించెను. 26-27. కనుక ఈ ఉత్సవమునకు ”పూరీము” అని పేరు వచ్చెను. ”పూరు” అనగా చీట్లుకదా! మొర్దెకయి తమక్టి జాబు వ్రాయుటవలనను, తమకు జరిగిన ఈ సంఘటనలనెల్ల వారు కన్నులార చూచి అనుభవ మునకు తెచ్చుకొనుటవలనను, యూదులు తామును, తమ సంతతియును, తమలో చేరిపోవు అన్యజాతి ప్రజలును, ప్రతియేడును నిర్ణీతకాలమున ఈ రెండు రోజులను ఉత్సవదినములుగా పాింపవలెనని నిర్ణయము చేసికొనిరి. 28. ప్రతి సంస్థానమున ప్రతి నగరమున, ప్రతి తరమున ప్రతి యుదా కుటుంబ మున ఈ పూరీము ఉత్సవమును జ్ఞప్తికితెచ్చుకొని, వైభవోపేతముగా కొనియాడవలెననియు, ఆ పండు గను ఏనాడును విస్మరింపరాదనియు నిర్ణయము చేసి కొనిరి.
29. అబీహాయిలు పుత్రిక అయిన ఎస్తేరు రాణికూడ పూరీమును గూర్చి మొర్దెకయి వ్రాసిన లేఖను అధికారపూర్వకముగా సమర్థించుచు ఒక లేఖ వ్రాసెను.
30. ఆమె దానిని పారశీకమునందలి నూట యిరువది ఏడు సంస్థానములలో వసించు యూదు లందరికి పంపించెను. ఆ లేఖయందు ఇట్లున్నది: ”యూదులకు శాంతిభద్రతలు సిద్ధించునుగాక!
31. మొర్దెకయి ఎస్తేరురాణి ఆజ్ఞాపించినట్లే యూదులును, వారి వంశజులును నిర్ణీత కాలమున, నిర్ణీతపద్ధతిలో పూరీము ఉత్సవము చేసికొనవలెను. ఈ ఉత్సవ ముతోపాటు ఉపవాసములను, విలాపములను గూడ పాింపవలెను.”
32. ఎస్తేరు చేసిన ఈ ఆజ్ఞ పూరీము విధిని దృఢపరచెను. యూదులు ఆమె ఆజ్ఞను గ్రంథమున లిఖించి భద్రపరచిరి.