జ్ఞానము, నరుని ధ్యేయము

నరుడు దేవునాశ్రయించి దుష్టత్వము విడనాడవలెను

1 1. లోకమునేలు రాజులారా!

               మీరు న్యాయమును పాింపుడు.

               మీ హృదయములను ప్రభువుమీద

               లగ్నము చేసికొనుడు.

               చిత్తశుద్ధితో ఆయనకొరకు గాలింపుడు.

2.           తనను పరీక్షకు గురిచేయని వారికి,

               తనను  శంకింపని వారికి ఆయన దర్శనమిచ్చును.

3.           దురాలోచనము కలవారికి దేవుడు దొరకడు.

               దేవుని పరీక్షించుటకు సాహసించువారిని

               ఆయన శక్తి పిచ్చివారినిగా చేయును.

4.           జ్ఞానము కపాత్ముని వరింపదు.

               అది పాపి హృదయమున వసింపదు.

5.           ఉపదేశమునొసగు పవిత్రాత్మము

               కపటమును అంగీకరింపదు,

               అది మూర్ఖతను సహింపదు,

               అన్యాయమును  మెచ్చుకొనదు.

6.           జ్ఞానము నరులతో స్నేహము చేయు ఆత్మము.

               కాని, అది దేవుని నిందించువారిని సహింపదు.

               దేవుడు నరుని అంతరంగమును పరిశీలించును.

               అతని హృదయాలోచనలను పరీక్షించును,

               అతని పలుకులను వినును. 

7.            దేవుని ఆత్మము ప్రపంచమునంతిని

               ఆవరించియున్నది.

               అది ఈ లోకమునంతిని

               ఒక్కిగా ఐక్యపరచుచున్నది

               నరుడు పలుకు ప్రతి పలుకును

               ఆ ఆత్మకు తెలియును.

8.           అన్యాయమును సమర్థించువాడు

               తప్పించుకోజాలడు

               అతనికి న్యాయసమ్మతమైన శిక్ష ప్రాప్తించితీరును.

9.           భక్తిహీనుని ఆలోచనలు పరిశీలింపబడును,

               అతని పలుకులు దేవునికి తెలియజేయబడును,

               అతడు తన నేరములకు

               తగిన శిక్ష ననుభవించును.

10.         దేవుడు నరుల పలుకులన్నిని జాగ్రత్తగా వినును.

               వారు తన మీద చేయు ఫిర్యాదులన్ని

               ఆయన చెవినబడును.

11. కనుక దేవునిమీద వ్టిగనే నిందలుమోపవద్దు.

               ఆయనను గూర్చి నిష్ఠురములాడవద్దు.

               మనము రహస్యముగా పలికిన

               పలుకులకుగూడ ప్రతిఫలముండును.

               అబద్దములాడువాడు నాశనమైపోవును.

12.          దుష్కార్యములుచేసి చావును తెచ్చుకోవలదు.

               చెడుపనులవలన మృత్యువును

               ఆహ్వానింపవలదు. 

13. మృత్యువును దేవుడు కలిగింపలేదు,

               ప్రాణులు చనిపోవుటను చూచి

               ఆయన సంతసింపడు.

14.          ఆయన ప్రతి ప్రాణిని జీవించుటకొరకే

               సృజించెను.

               ఆయన చేసిన ప్రాణులన్నియు

               ఆయురారోగ్యములతో అలరారుచున్నవి.

               జీవులలో మరణకరమైన విషయమేమియు లేదు.

               మృత్యువు ఈ  లోకమున రాజ్యము చేయదు.

15.          న్యాయమునకు మరణము లేదు.

 దుష్టులు జీవితమును సరిగా అర్ధము చేసుకొనరు

16.          కాని దుష్టులు తమ వాక్క్రియలద్వారా

               మృత్యువును ఆహ్వానించిరి.

               చావును తమ నేస్తురాలినిగా భావించి

               దానితో పొత్తు కుదుర్చుకొనిరి.

               తాము దానికి తగిన స్నేహితులైరి.